కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి..

మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు సందర్బంగా జిల్లా గ్రంథాలయం డైరెక్టర్ నాగభూషణం హైదరాబాద్ లో వారి నివాసం లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన జువ్వాడి నర్సింగరావు ఈ కార్యక్రమంలో
మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ ఎల్లలజలపతి రెడ్డి రాష్ట్ర పద్మశాలి సంఘము ఉపాధ్యక్షులు కేసుల సురేందర్ కౌన్సిలర్లు మర్రి సహాదేవ్, పిప్పర రాజేష్ బీసీ సంక్షేమ శాఖ మెట్ పల్లి ఇంచార్జి తుమ్మనాపెళ్ళి రాజు లు తదితరులు పాల్గొన్నారు.

వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు.

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు
మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

 

జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
కోరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కోరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలికి ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెట్ పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు అనంతరం
ఆర పేటలో వై కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాలలా గర్జనలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సభ్యులు కీ”శే” గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version