స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలో నెంబర్ 1 గా నిలిపాం
-అభివృద్ధి అంటేనే తెలంగాణ రాష్ట్రం అనే స్థాయిలో ప్రగతి సాధించాం
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జనాలు కేసీఆర్ పాలనను మరువ లేకపోతున్నారు.
-సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలనని సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అన్నారు.
గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేటికీ కేసీఆర్ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారని, మరో మారు కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.