జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి
కటకం జనార్ధన్ పట్టణ అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ని సమస్యలను పరిష్కరించాలని వారు సూపర్డెంట్ ను కోరారు కానీ వారం రోజులు గడుస్తున్నా హాస్పిటల్ యొక్క సమస్యలు పెరుగుతున్నాయి తప్ప వాటి పరిష్కారం కావడం లేదు కావున జిల్లా కలెకర్ట్ సమక్షంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్రాసిన వినతిపత్రం ను భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కి అందించడం జరిగింది.
