పేరుకే పెద్దాసుపత్రి….సౌకర్యాలు లేక రోగుల అవస్థలు
తక్షణమే సదుపాయాలు కల్పించాలి
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంసిపిఐ (యు) బృందం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని నూతనంగా నిర్మాణం చేసి రోగులకు ఉన్నత సేవలు అందించేందుకు గాను ఏర్పాటు చేసిన జిల్లా ఆసుపత్రి ఇప్పుడు పేరు పెద్దాసుపత్రిగా మారింది.ఆ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందడంలేదనే ఆరోపణలతో ఎంసిపిఐ (యు) పార్టీ నాయకుల బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించారు.పేద,మధ్యతరగతి ప్రజల రోగుల కోసం నిర్మించిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేమితో రోగులు నానా అవస్థలు పడుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. రోగుల దగ్గరికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ వంద పడకల ఏరియా ఆసుపత్రి నుండి 250 పడకల జిల్లా ఆస్పత్రిగా అప్ గ్రేట్ అయిన సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.టెక్నీషియన్స్ , శానిటేషన్ , సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తగిన విధంగా లేదన్నారు.సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం మూలంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.
