అధికారులూ…ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానముందా……!?
◆-: ప్రమాదకర రసాయన పరిశ్రమ మాకొద్దుంటూ..”యువత ఇంటింటి ప్రచారం”..!
◆-: కర్మగార యాజమాన్యంతో కుమ్మక్కైన వారు ఎవరైనా వారిని..”ప్రజాక్షేత్రంలో నిలబెడతాం”..!
◆-: ప్రజారోగ్యమై ప్రధాన లక్ష్యమంటూ..”యువత ఊరూరా విస్తృత ప్రచారం”..!
◆-: పరిశ్రమ రద్దయేంతవరకు పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తాం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్,: ప్రజారోగ్యాన్ని, పంచభూతాల్ని, పంచాయతీ అభివృద్ధికి ప్రయోజనం కలిగించే పరిశ్రమలు ఏవైనా సంపూర్ణంగా సహకరిస్తాం. ఫెవికాల్, ప్లైవుడ్ పరిశ్రమలను అడ్డుపెట్టుకొని ప్రాణాంతకమైన కెమికల్, రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోమని, గతంలో సైతం గ్రామ శివారులో ఒక పేరు నా అనుమతి పొంది.. మరో పరిశ్రమ కొనసాగుతుందని.. ఇట్టి జటలమైన సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని.. మరో మారు మోసపోయే పరిస్థితి లేకుండా ఉండేందుకే ఉద్యమాన్ని చేపడుతున్నామని, పరిశ్రమ ఏర్పాటు విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే పనులు చకచగా కొనసాగుతున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు సంపూర్ణంగా సహకరించాలని.. డబ్బులకు కక్కుర్తి పడి కర్మాగారంతో కుమ్మక్కై యాజమాన్యానికి సహకరించే వ్యక్తులు ఎవరైనా వారిని ఉపేక్షించేది లేదని.. తప్పనిసరిగా..”ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని” యువత ఊరురా ప్రచారాన్ని నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మల్గి గ్రామానికి చెందిన యువకులు అధిక సంఖ్యలో గురువారం రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఊరూరా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన అనిల్ కుమార్, కృష్ణ, మల్లేష్, తదితరుల ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువత.. మల్గి, డప్పుర్, అత్నూర్, వడ్డీ, న్యాల్ కల్, శంషాల్లాపూర్, కర్ణాటకలోని ఇమాంబాద్ గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని నిర్వహించారు. అందుకు ఆయా గ్రామాల్లో ప్రజానికం సానుకూలంగా స్పందించడం పట్ల యువత సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నెల జరిగే “ప్రజాభిప్రాయ సేకరణ”లో స్పష్టత ఇవ్వాల్సిందే..!
ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఉత్తర్వుల మేరకు జిల్లాకు చెందిన వివిధ శాఖాధికారులు పరిశ్రమ ఏర్పాటు పై స్థానిక ప్రజానీకానికి మౌఖికంగా కాకుండా, ఆధారాలతో సహా ప్రజలకు అవగాహన కల్పించాలని యువత స్పష్టం చేశారు. సభకు తరలిరానున్న ప్రజానీకానికి అడ్డుకోకూడదని, గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరిని స్వాగతించి సహకరించాలని యువత పోలీసులకు విన్నవించారు. పరిశ్రమ ఏర్పాటులో ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రజా ఆరోగ్యాన్ని, పంచభూతాల్ని సంరక్షించేలా ఉన్నతాధికారులు స్పష్టం చేయాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
యాజమాన్యంతో కుమ్మకైతే..”ప్రజా క్షేత్రంలో నిలబెడతాం”..!
ప్రజాసంక్షేమం కోసం కొనసాగుతున్న ఉద్యమంలో యువతకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని, లాభాపేక్ష ధోరణితో వ్యవహరించి కర్మకార యాజమాన్యంతో కుమ్మకైతే అట్టి వ్యక్తులు ఎవరినైనా ఉపేక్షించేది లేదని, ప్రజాక్షేత్రంలో నిలబెట్టి నిలదీస్తామని యువత హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రాణాలైనా ఇస్తాం.. అంతేగానే ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసే అట్టి పరిశ్రమలను.. ఈ పరిస్థితిలో కొనసాగించమని, తప్పనిసరిగా అడ్డుకొని తీరుతామని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించి గ్రామసభకు వందలాదిగా తరలిరావాలని యువత పిలుపునిచ్చారు. ఊరూరా కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో యువత హాజరయ్యారు.
