నస్కల్ లో ..
ఉచిత వైద్య శిబిరం
మోహన్ నాయక్ సేవలు గణనీయం.
నిజాంపేట: నేటి ధాత్రి
నిరుపేదల పెన్నిధిగా డాక్టర్ మోహన్ నాయక్ నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ.. పేదల గుండెల్లో నిలిచిపోతున్నాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, ఇతర వ్యాధులకు పై వైద్యులు శాస్త్ర చికిత్సలు నిర్వహించారు. పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ ను గ్రామీణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, శ్రీనివాస్, దేశెట్టి లింగం , గుమ్ముల అజయ్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
