తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి..

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.

తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా!

తెలుగులో.. రిష‌బ్ షెట్టి పీరియ‌డ్ డ్రామా! ఫ‌స్ట్ లుక్ అదిరింది

కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది.

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రానికి తెర లేచింది. క‌న్న‌డ న‌టుడు కాంతార స్టార్ రిష‌బ్ షెట్టి (Rishab Shetty) హీరోగా స్ట్రెయిట్ తెలుగులో ఓ కొత్త చిత్రం తెర‌పైకి వ‌స్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) నాగ‌వంశీ (Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌మౌళి శిష్యుడు ఆకాశ వాణి (Aakashavaani) మూవీ ఫేం అశ్విన్ గంగ‌రాజు (Ashwin Gangaraju) ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ బుధ‌వారం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ మూవీకి ది ల్యాండ్ బ‌ర్న్‌డ్ ఎ రెబ‌ల్ రోజ్ అనే క్యాప్స‌న్ ఇచ్చారు. 18 వ శ‌తాబ్ధంలో బెంగాల్‌లో జ‌రిగిన తీవ్ర ఉద్రిక్త‌ ప‌రిస్థితుల బ్యాగ్రౌండ్‌లో హిస్టారిక‌ల్ పీరియ‌డ్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కునుంది.

ఇదిలాఉంటే ప్ర‌స్తుతం రిష‌బ్ (Rishab Shetty) తెలుగులో ప్ర‌శాంత్ వ‌ర్మ‌ జై హ‌నుమాన్‌లో న‌టిస్తోండ‌గా ఛ‌త్ర‌ప‌తి శివాజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అంతేగాక‌ ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార చాఫ్ట‌ర్ 1 మ‌రో నెల ప‌దిహేను రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

31జులై న ఇంటర్మిడియట్ మొదటిసంవత్సరం స్పాట్ అడ్మిషన్లు..

31జులై న ఇంటర్మిడియట్ మొదటిసంవత్సరం స్పాట్ అడ్మిషన్లు

కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణ కుమారి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T121045.381.wav?_=1

పరకాల నేటిధాత్రి

2025-2026 ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణకుమారి ఓ ప్రకటనలో తెలిపారు.జోన్ 4కు చెంది పదవతరగతి పాసైన విద్యార్థినులకు మండల పరిధిలోని మల్లక్కపేట (పరకాల)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో బైపిసి,ఎంపిసి గూపులలో సీట్లు కాళిగా ఉన్నాయని జులై 31 గురువారం రోజున ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్థామని,ఎంపికైన వారికి సీట్లు కేటాయిస్తామని అన్నారు.పదవ తరగతిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు ఓరిజినల్ సర్టిఫికెట్లు మూడు సెట్లు జిరాక్స్ కాపీలలు మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటాలు హజరు కావాలని కోరారు.ఎంపిక పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం 4గంటలకు ఎంపికైన విద్యార్థినుల జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు.

తొలి గేమ్‌లో హంపి గెలుపు..

తొలి గేమ్‌లో హంపి గెలుపు

తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి…

మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌

బటూమి జార్జియా): తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా చాలు.. హంపికి సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. కాగా, భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ మధ్య క్వార్టర్స్‌ మొదటి గేమ్‌ డ్రాగా ముగిసింది. ఇక, మరో క్వార్టర్స్‌ తొలి గేమ్‌లో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ జోంగి టాన్‌ (చైనా)తో వైశాలి పాయింట్‌ పంచుకొంది. ఇక, క్వార్టర్స్‌లో హారిక, దివ్య తలపడుతుండడంతో భారత్‌ తరఫున ఒకరు సెమీస్‌ చేరడం ఖాయమైంది.

మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన.!

మల్గి మాజీ సర్పంచ్ మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు జన్మదిన వేడుకలో పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని చిన్నారిని ఆశీర్వదించారు అందరూ కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచేందర్, రాజేందర్ రెడ్డి, సంఘరామ్ పాటిల్, రవి కుమార్, రాజ్ కుమార్, భూమా రెడ్డి,మైపాల్, చంద్రన్న,ఇస్మాయిల్, లోకేష్ పాటిల్,గొల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 11:

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కాజూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కుమారి ఆముద పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు చూడా చైర్ పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుష్పాలు, గజమాలతో కాజూరు ప్రాంత కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఘన స్వాగతం పలికారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కాజూరు ప్రజలకు వారు
వివరించారు,
ఇది మంచి ప్రభుత్వం అంటూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించి మళ్లీ మాకు కూటమి ప్రభుత్వమే కావాలంటూ తమ ఆకాంక్షను కాజూరు ప్రాంత ప్రజలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు  తెలియజేసారు.

సమస్యల పరిష్కార దిశగా తొలి అడుగు..

సమస్యల పరిష్కార దిశగా తొలి అడుగు

ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగానే మే 30న జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో అంతర్గత కమిటీని వేశారు. మూడు సెక్టార్ల నుండి 30 మందిని ఎంపిక చేశారు.

గత రెండు నెలలుగా ఎగ్జిబిటర్స్ (Exhibitors), డిస్ట్రిబ్యూటర్స్ (Distributors), ప్రొడ్యూసర్స్ (Producers) మధ్య నలుగుతున్న సమస్య తారాస్థాయికి చేరడంతో తెలుగు ఫిల్మ్ చాంబర్ (Telugu Film Chamber) దీనిని పరిష్కరించే పనిని భుజానికి ఎత్తుకుంది. మే 30న జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మూడు సెక్టార్లకు చెందిన 30 మందితో ఓ కమిటీని వేస్తామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె. ఎల్. దామోదర ప్రసాద్ (K. L. Damodara Prasad) ఇప్పటికే హామీ ఇచ్చారు. దాని ప్రకారం 30న విశాఖ పట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. అందులో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ నుండి 30మందితో కూడిన అంతర్గత కమిటీని వేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్ వ్యవహరిస్తారు. అలానే కన్వీనర్ గా ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ వ్యవహరించబోతున్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కమిటీలో నిర్మాతల రంగం నుండి కె.ఎల్. దామోదర ప్రసాద్, దిల్ రాజు, టి. ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్, పి.వి రవికిశోర్, వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, డీవీవీ దానయ్య, స్వప్న దత్, వై సుప్రియ సభ్యులుగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ నుండి భరత్ భూషణ్, ఎన్. సుధాకర్ రెడ్డి, ఎం. సుధాకర్, శిరీశ్‌ రెడ్డి, శశిధర్ రెడ్డి, యు. వెంకటేశ్వరరావు, ఎం. రాందాసు, ఎన్. నాగార్జున, సీడెడ్ కుమార్, సి. భరత్ చౌదరి ఉంటారు. అలానే ఎగ్జిబిటర్ సెక్టార్ నుండి టి.ఎస్. రాం ప్రసాద్, డి. సురేశ్‌ బాబు, సునీల్ నారంగ్, జి. వీర నారాయణ బాబు, సి. శ్రీనివాసరావు, కె. అనుపమ్ రెడ్డి, టి. బాల గోవింద రాజ్, జి. మహేశ్వర్ రెడ్డి, కె. శివ ప్రసాద్ రావు, ఎం. విజయేందర్ రెడ్డి సభ్యులుగా వ్యవహరించబోతున్నారు. మూడు సెక్టార్స్ కు చెందిన ఈ 30 మంది తెలుగు సినిమా రంగంలోని వివిధ సమస్యలపై పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి.

జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మనబోయిన యాకయ్య, సీనియర్ నాయకులు బి వెంకన్న.

తొర్రూరులో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభ.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం గొల్ల కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు కృషి చేయాలని, దొడ్డి కొమురయ్య ఉద్యమస్ఫూర్తితో గొల్ల కురుమ యువత తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీ.ఎం.పీ.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వెంకన్న లు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు ఎద్దు ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన యాకయ్య, బొమ్మనబోయిన వెంకన్న లు సంయుక్తంగా మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి మరింత ఉద్యమాన్ని రగిలించిందని… తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొల్ల కురుమ యువ నాయకుడు దొడ్డి కొమరయ్య ముందు నడిచి అమరత్వం పొందడం మన గొల్ల కురుమల అందరికీ గర్వకారణమని… వారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఒక గొల్ల కురుమలకే కాకుండా దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయన అమరత్వం బాసటగా నిలిచిందని…. అణగారిన వర్గాల కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం భూమి బుట్టి పేద ప్రజల విముక్తి కోసం అమరుడయ్యాడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పోసాని సంతోష్ యాదవ్, నూకల హరీష్, జిఎంపిఎస్ తొర్రూరు మండల కార్యదర్శి మద్దెల రాజు, ఉపాధ్యక్షులు సర్వి నగరాజు, ఎర్రం రాజు, సహాయ కార్యదర్శి పెద్దబోయిన కుమార్, గిరిజన సంఘం నాయకులు భీమా నాయక్, బహుజన సామాజిక కార్యకర్త మాలోత్ సురేష్ బాబు, ఎస్సీ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు వెల్తూరి పూర్ణచందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి, జర్నలిస్టు పున్నం సారయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు కొండ వెంకన్న, వృత్తి ప్రజా, కుల గొల్ల కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

దొడ్డి కొమురయ్య గారి ఆశయాల సాధన కోసం నేటి ప్రజానీకం నడుం బిగించాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ లో ఈరోజు దొడ్డి కొమరయ్య గారి 79 వ. వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు , పోరాట స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్.. దొడ్డి కొమరయ్య 79 వ. వర్ధంతి సందర్భంగా ఈ రోజు బి.వై. నగర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు , విప్లవ జోహార్లు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర నాయకులు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , గడ్డం రాజశేఖర్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

సితార‌లో అల్ల‌రి న‌రేశ్‌ ఆల్కహాల్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.

 సితార‌లో అల్ల‌రి న‌రేశ్‌ ఆల్కహాల్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది…

అల్ల‌రి న‌రేశ్ తాజాగా మ‌రో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 

కామెడీ హీరో నుంచి క్ర‌మ‌క్ర‌మంగా విల‌క్ష‌ణ న‌టుడిగా, అల్ రౌండ‌ర్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకోవ‌డానికి కృషి చేస్తోన్న అల్ల‌రి న‌రేశ్ (Allari Naresh) తాజాగా మ‌రో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యాన‌ర్‌పై వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా గ‌తంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా (Family Drama) అనే డిఫ‌రెంట్ సినిమా తెర‌కెక్కించి ప్ర‌శంస‌లు అందుకున్న

 

ఈరోజు (సోమ‌వారం) అల్ల‌రి న‌రేశ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మేక‌ర్స్ ఈ సినిమా టైటిల్ రివీల్‌ చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. న‌రేశ్ స‌ర‌స‌న బోల్డ్ భామ రుహానీ శ‌ర్మ (Ruhani Sharma) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా గిబ్రాన్ (Ghibran Vaibodha) సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు ఆల్కహాల్ (Alcohol) అనే పేరు ఫిక్స్ చేయ‌గా ఇప్పుడు ఈ టైటిల్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌ర‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెళ్ల‌డించారు

కిరణ్‌ అబ్బవరం.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.

కిరణ్‌ అబ్బవరం.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

 

 

 

 

‘క’, దిల్ రూబా వంటి చిత్రాల త‌ర్వాత హీరో కిరణ్‌ అబ్బవరం న‌టిస్తోన్న నూత‌న‌ చిత్రం కే ర్యాంప్.

‘క’, దిల్ రూబా వంటి చిత్రాల త‌ర్వాత హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) న‌టిస్తోన్న నూత‌న‌ చిత్రం కే ర్యాంప్ (K Ramp). ‘సామజవరగమన2, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాల తర్వాత హాస్య మూవీస్‌ సంస్థ (Hasya Movies) అధినేత రాజేశ్‌ దండా (Rajesh Danda) ఈ సినిమా నిర్మిస్తున్నారు. జైన్స్‌ నాని (jains nani) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐదు నెల‌ల క్రితమే ఈ చిత్రం స్టార్ట్ అవ‌డ‌మే గాక షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రిగిపోతుంది. 

సినిమా థియేటర్‌లు

కిరణ్‌ అబ్బవరం సరసన యుక్తి తరేజా (Yukti Thareja) నటిస్తుండ‌గా చేతన్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి కిర‌ణ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్‌లో ల‌వ్ సింబ‌ల్ మంట‌ల్లో ఉండ‌గా దాని ఎదుట హీరో లుంగీలో న‌వ్వుతూ ఉన్న‌ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ సోమ‌వారం రిలీజ్ చేశారు. కాగా పూర్తి వినోదాత్మ‌కంగా రూపొందుతున్న ఈ మూవీ ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సుభం’ సినిమా సమీక్ష:నేటిధాత్రి

 

 

 

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటిల తెలుగు చిత్రం వినోదాత్మకమైన ఇండీ-స్టైల్ హర్రర్ కామెడీ మరియు సామాజిక వ్యంగ్యం.

‘సుభం’ చిత్ర తారాగణం | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్‌మెంట్

ఒక నిరాడంబరమైన సినిమా పెద్దగా ఊగిపోయి హాయిగా ల్యాండ్ అయినప్పుడు అది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, మరియు శుభం అనే తెలుగు హర్రర్ కామెడీ కూడా అదే చేస్తుంది. నటి సమంతా రూత్ ప్రభు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి సినిమా బండికి చెందిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు మరియు వసంత్ మారింగంటి రచన చేశారు. ఉపరితలంపై, ఇది భయానక కామెడీ, కానీ హృదయంలో, ఇది లింగ సున్నితత్వంపై పదునైన వ్యాఖ్యానం – తెలివైన రచన మరియు మనోహరమైన ప్రదర్శనల ద్వారా మరింత ప్రభావవంతంగా మారింది.

2000ల ప్రారంభంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత భీమిలిలో ఇంటర్నెట్‌కు ముందు రోజుల్లో, కథ కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన శ్రీను (హర్షిత్ రెడ్డి) మరియు బ్యాంక్ ఉద్యోగి అయిన శ్రీ వల్లి (శ్రియా కొంఠం) మధ్య జరిగే మధురమైన వికారమైన పెళ్లి చూపులు (ఒక కుదిర్చిన వివాహం)తో ప్రారంభమవుతుంది. ఉపగ్రహ టీవీ అంగుళంలో ప్రవేశించడం ప్రారంభించినప్పుడు కేబుల్ ఇప్పటికీ రాజ్యమేలుతున్న నేపథ్యం – కథనాన్ని ముంచెత్తకుండా నోస్టాల్జియాను జోడిస్తుంది.

పాత తెలుగు సినిమాల ‘సుఖాంతం’ టైటిల్ కార్డులకు గుర్తుగా ‘ సుభం ‘ అనే టైటిల్ ప్రేక్షకులను నిజంగా సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఇక్కడ, సమాధానం చాలా ఆధునికమైనది: లింగ సమానత్వం. స్క్రిప్ట్ సమకాలీన సృజనాత్మక స్వేచ్ఛలను తీసుకున్నప్పటికీ, అది స్థానం నుండి తప్పినట్లు అనిపించదు – దాని స్పర్శ తేలిక, పుష్కలంగా నవ్వులు మరియు 125 నిమిషాల కఠినమైన రన్‌టైమ్‌లో తెలివైన భయానక సన్నివేశాలకు ధన్యవాదాలు.
దర్శకుడు : ప్రవీణ్ కాండ్రేగుల
నటీనటులు : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్
నిడివి : 125 నిమిషాలు
కథాంశం : ఒక చిన్న పట్టణంలో, స్త్రీలు టెలివిజన్ షో చూస్తున్నప్పుడు వ్యామోహంలో మునిగిపోతారు. పురుషులు పరిష్కారాలను కనుగొనాలి మరియు దానికి వారు తమలో తాము చూసుకోవాలి.

శుభం లో సూక్ష్మమైన లింగ వ్యాఖ్యానం ప్రారంభంలోనే బయటపడటం ప్రారంభమవుతుంది – శ్రీ వల్లి పని చేస్తుంది మరియు మర్యాదపూర్వక శైలికి సరిగ్గా సరిపోదు కాబట్టి పెద్దలు ఆమె వధువుగా సరిపోతుందని ప్రశ్నిస్తారు. ఇంతలో, శ్రీను స్నేహితులు అతనిని ‘ఆల్ఫా మేల్’ ప్రవర్తనలో శిక్షణ ఇస్తారు, అదే వారి భార్యలను ఆకట్టుకునేలా చేయడంలో రహస్యం అని నమ్ముతారు. ఈ క్షణాలు హాస్యంతో సాగుతాయి, ఏదైనా విషపూరిత ఉద్దేశ్యం కంటే పురుషుల అజ్ఞానాన్ని హైలైట్ చేస్తాయి.

తర్వాత, ట్విస్ట్: పట్టణంలోని మహిళలు ఒక మెలోడ్రామాటిక్ టీవీ షో చూస్తున్నప్పుడు వారిపై ఆకర్షితులవుతారు. గందరగోళం గురించి. వ్యంగ్యంగా ప్రారంభమయ్యేది హాస్యాస్పదంగా, భయానకంగా మారే అల్లకల్లోలంగా మారుతుంది, పురుషులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తహతహలాడుతుండగా, హాస్యాస్పదమైన మాటలు మరియు హాస్యం.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటి ఈ చిత్రాన్ని చిన్న పట్టణ విచిత్రాలు – సుపరిచితమైన కబుర్లు, కేబుల్ టీవీ నోస్టాల్జియా మరియు విచిత్రమైన పాత్రలలో – ఎంకరేజ్ చేస్తారు. వివేక్ సాగర్ సంగీతం శృంగారం నుండి భయానక స్థాయికి సులభంగా కదులుతుంది మరియు మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ స్వర మార్పును నైపుణ్యంతో సంగ్రహిస్తుంది.
‘సుభం’ లో సమంత రూత్ ప్రభు | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్మెంట్

ఈ సినిమాలోని సోప్ ఒపెరా, జన్మ జన్మల బంధం , ఒక తెలివైన కథన పరికరంగా మారుతుంది. కల్పిత సోప్‌లను హాస్యాస్పదంగా ఉపయోగించే ఇటీవలి చిత్రాల మాదిరిగా కాకుండా (మత్తు వడలారా మరియు దాని సీక్వెల్ గుర్తుకు వస్తుంది), శుభం మూడు జంటల మధ్య లింగ గతిశీలతను ప్రతిబింబించేలా చేస్తుంది, ఈ పిచ్చికి బరువును జోడిస్తుంది.

మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రశాంతతలు ఉన్నాయి, కానీ కథ త్వరలోనే వేగం పుంజుకుంటుంది. సమంత తన సాధారణ ఇమేజ్‌కు విరుద్ధంగా నటించిన డెడ్‌పాన్ కామియో క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె మౌనం ఏకపాత్రాభినయం కంటే ఎక్కువ చెబుతుంది.

ఊహించదగిన పరిష్కారం వైపు వెళ్ళవచ్చని మీరు అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ మరియు వసంత్ ఒక ఆశ్చర్యకరమైన మలుపును ఇస్తారు. మీరు సినిమా బండిని చూసినట్లయితే , మీరు క్రాస్ఓవర్‌ను మరింత ఆనందిస్తారు, కానీ మీరు చూడకపోయినా ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. ఇది సినిమాటిక్ విశ్వాలకు దర్శకుడు యొక్క ఉల్లాసభరితమైన సమాధానం, ఇది స్వతంత్ర చిత్రాలకు కూడా ఉమ్మడి ప్రపంచాలను కలిగి ఉండవచ్చని మనకు గుర్తు చేస్తుంది.

మెయిల్ మరియు కల్కి 2898 AD లలో ప్రత్యేకంగా నిలిచాడు ) శ్రీనుకి ఆప్యాయతను తెస్తాడు, మరియు శ్రియ కొణతం నిశ్శబ్దంగా దృఢంగా ఉండే శ్రీ వల్లిగా తనదైన శైలిలో నటించాడు. మిగిలిన తారాగణం – గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, మరియు వంశీధర్ గౌడ్ – తమ పాత్రలను అతిగా ప్రదర్శించకుండా వినోదాన్ని పెంచారు.

“రింగ్స్ ఆఫ్ ది లార్డ్” చూస్తున్నానని గర్వంగా చెప్పుకునే పాత్ర వంటి ఒక ఆహ్లాదకరమైన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఒక వదులుగా ఉన్న థ్రెడ్ ఏమిటంటే, స్త్రీలు మొదట ఎందుకు దయ్యాలను పట్టుకుంటారు. ఈ చిత్రం ఒక కారణం చెప్పకుండానే తప్పించుకుంటుంది, బహుశా అది మంచి కోసమే కావచ్చు – కొన్ని విషయాలు వివరించకుండా వదిలేస్తే సరదాగా ఉంటాయి.

శుభమ్ అనేది ‘ఆల్ఫా మేల్స్’ అందరికీ ఒక పదునైన సందేశాన్ని అందించే హారర్-కామెడీ. మరియు ఇది పుష్కలంగా నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తుంది.

శుభమ్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.

ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.

డి ఆర్ డి ఓ.పోరిక బాల కృష్ణ

చిట్యాల నేటిధాత్రి:

జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల ప్రజా పరిశత్ కార్యాలయం వారంతా సమావేశంనకు ముఖ్య అడతిథులు గా డి ఆర్ డి ఓ పోరిక బాల కృష్ణ (జిల్లా గ్రామీన అభివృద్ధీ అధికారి హాజరయ్యారు
ఈ సందర్బంగా డిఆర్ ర్డీవో మీటింగ్ లో మాట్లాడుతూ దీనసరి కూలి 307/- రూపాయలు వచ్చు విధంగా మా సిబ్బంది కి సూచనలు చేశాము వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం పని చేసి 300 ల నుండి 307 రూపాయలు వచ్చు విధంగా పని చేయమని చెప్పారు
అదేవిధంగా పని వద్ద కచ్చితంగా నీడ, ప్రధమ చికిత్స పెట్టె, నీటి సౌకర్యం విధిగా పంచాయతీ కార్యదరషులకు కల్పించాలని చెప్పారు
తర్వాత రేపు రాబోయే వనమహోత్సవం కార్యక్రమమాo క్రింద తీసుకున్న స్థలాలను పంపించి టార్గెట్ ప్రకారం నాటించాలి అని చెప్పారు
ఎస్సి ఎస్టీ చిన్న సానకారు రైతులకు పండ్ల తోటలపథకం క్రింద అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని చెప్పాడు
మండల కార్యాలయనకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సమీక్ష సమావేశం తీసుకున్నారు
ఈ కార్యక్రమం లొ జయశ్రీ ఎంపీడీఓ క్వాలిటీ కాట్రోలర్ ధర్మషింగ్ , ఏపీవో అలీం,సాంకేతిక సహాయకులు, సుధాకర్, అపర్ణ, స్వామి, స్రవంతి , పంచాయతీ కార్యదర్శలు,స్వచ్చా జిల్లా కోర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

తొలి ప్రేమే తోపు కాదే.

తొలి ప్రేమే తోపు కాదే

 

నేటి ధాత్రి:

 

 

 

 

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో…

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్‌, ఎస్కేన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌, గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌ లవ్‌ ఫెయిలైతే బెస్ట్‌ లవ్‌ ఎక్కడో మొదలవుతుంది’ అని చెబుతూ సాగిన గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. అంతం వరకూ అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమే అనీ, అదే తుది కాదనే కాన్సె్‌ప్టను ఈ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్‌ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ సంగీత దర్శకుడు మణిశర్మ బీజీఎం కంపోజ్‌ చేశారు.

తొలి ఉగాది.

శీర్షిక:తొలి ఉగాది.

 

నేటి ధాత్రి:

*పుడమి ఆకు పచ్చని చీర కట్టుకుని…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

ఇంద్రుడు మేఘ మాలికల విల్లులతో
తుంపర, తుంపరులుగా
చినుకుల బాణాలు విడుస్తూ …
స్వా గతం సుస్వా గతం తెలుపగా వచ్చింది తొలి ఉగాది..!

పండిన కొత్త చింత పులుపు వగరు మామిడి ఉరింపులు పలుకగా భిన్నసంస్కృతులకు బహు పునాది వేస్తూ వచ్చింది తొలి ఉగాది..!

సంస్కృతి సంప్రదాయాలను ఒకటిగా చేసి చైత్ర మాసపు ఊసులు చెప్తూ గండు కోయిల తీయని పాటలతో స్వాగతం సుస్వాగతం పలుకగా
వచ్చింది తొలి ఉగాది..!

పంచభూతాలు దీవించగా…
చావిడలో పంచాంగ శవ్రణాలు
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

తెలుగు లోగిళ్లలోన మామిడితోరణాలు,
షడ్రురుచులతో ఉగాదిపచ్చడి…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు 2025

శ్రీమతి “మంజుల పత్తిపాటి” (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వనపర్తి మొదటి దివంగత మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి.

వనపర్తి మొదటి దివంగత మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పార్కులో చెత్తాచెదారం

పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

వనపర్తి నెటిదాత్రి:

Media Cell

వనపర్తి మొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి పార్కులో చెత్తాచెదారం పేరుకుపోయిందని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ నందిమల్ల రమేష్ బీ ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ యుగంధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పానగల్ రోడ్డు బస్టాప్ దగ్గర పార్క్ ఉన్నదని వారు తెలిపారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూతురు ప్రత్యూష సహకారంతో దివంగత ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ పార్క్ ఏర్పాటు చేయించారని వారు పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో అన్ని పార్కులలో ఆహ్లాదకరమైన చెట్లు పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయించారని వారు తెలిపారు. వెంటనే వనపర్తి లో మున్సిపల్ కమిషనర్ పార్కులను సందర్శించి ప్రతి ఒక్క పార్కు దగ్గర మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని వనపర్తి మొదటి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పార్కులో చెత్తాచెదారం మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకొని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version