హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

 

 

 

 

 

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది.

– భర్తను చంపి తెల్లారేవరకు శవంతోనే ఉన్న భార్య

చెన్నై: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు(Kadaluru) జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నైవేలి పంచాయతీ బీ2-బ్లాక్‌లో ఎన్‌ఎల్‌సీ నుంచి పదవీవిరమణ పొందిన కొలంజియప్పన్‌ (63) నివశిస్తున్నారు.

 

ఆయన భార్య మరణించడంతో భర్తకు దూరమైన పద్మావతి (55) అనే మహిళను 20ఏళ్ళ కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ కొలంజియప్పన్‌పై పద్మావతి నెల రోజుల క్రితం నైవేలి పోలీస్‏స్టేషన్‌(Nyveli Police Station)లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని తెలిసింది.

 

ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి గాఢనిద్రలోవున్న కొలంజియప్పన్‌ గొంతును పద్మావతి కత్తితో కోయడంతో అతడు మృతిచెందినట్లు తెలిసింది. భర్త శవం వద్ద పద్మావతి ఉదయం వరకు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది. ఆమెను అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్‌కు తరలించారు.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

ఆమనగల్ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు…ఈ సందర్భంగా కండె హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. గత 11 ఏళ్లలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చాయి,అని వివరించారు.
స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, ఉజ్వలా యోజన, జనధన్ యోజన, ముద్రా లొన్లు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. ఈ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గోరటి నర్సింహ, ఆమనగల్ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె) గార్లు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను సూటిగా వినిపించుకునే ప్రయత్నం చేశారు…

తాగునీరు, రోడ్లు, ఉపాధి అవకాశాలపై వచ్చిన అంశాలపై స్పందించి, వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు తీసుకుంటామని తెలిపారు…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

అనంతరం అమ్మ పేరు మీద మొక్కలను నాటడం జరిగింది…

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, Bjym మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, బిసి మోర్చ కల్వకుర్తి ఇంచార్జ్ వరికుప్పల చంద్రమౌళి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు శాంపూరి భగవాన్ రెడ్డి, బీసీ మోర్చ మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా నాయకులు కొప్పు పుల్లయ్య, మాజీ బూత్ అధ్యక్షుడు గండి కోట జంగయ్య, మాజీ వార్డు సభ్యులు ఆర్ ప్రభు లింగం, నల్ల కొమురయ్య, తిప్పిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మందా రాంరెడ్డి, వరికుప్పల రాఘవేందర్, మండల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎరగమౌని రాములు, సీనియర్ నాయకులు కొప్పు నర్సింహ అలియాస్ బొంబాయి, కార్ మెకానిక్ శేఖర్, వరికుప్పల శ్రీకాంత్, బండ్ల శివ, వరికుప్పల అశోక్ గార్లు గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు… ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version