డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్
మహాదేవపూర్ ఆగస్టు 01 (నేటి ధాత్రి) *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో శుక్రవారం రోజున క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్, స్కూల్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దూర ప్రాంతాల వారికి హాస్టల్ సదుపాయం ను అందుబాటులో ఉంది కావున వినియోగించుకొని విద్య లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, హాస్టల్ లలో ఆహారవిషయం లో సమయ పాలన పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అన్నారు. హెల్త్ సెంటర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలం లో ఎక్కువ గా ప్రజలు ఎలాంటి సమస్యలకు గురి అవుతారో ముందే గ్రహించి ప్రజలకు అవగాహన తో పాటు అన్ని రకాల వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ కిరణ్, ఎంపీ ఓ ప్రసాద్, గ్రామ కార్యదర్శి కల్పన ఎస్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరిత తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.