రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.