డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్…

డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్

మహాదేవపూర్ ఆగస్టు 01 (నేటి ధాత్రి) *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కేంద్రంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో శుక్రవారం రోజున క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టి గర్ల్స్ హాస్టల్, స్కూల్ కాంప్లెక్స్, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం దూర ప్రాంతాల వారికి హాస్టల్ సదుపాయం ను అందుబాటులో ఉంది కావున వినియోగించుకొని విద్య లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, హాస్టల్ లలో ఆహారవిషయం లో సమయ పాలన పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని అన్నారు. హెల్త్ సెంటర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలం లో ఎక్కువ గా ప్రజలు ఎలాంటి సమస్యలకు గురి అవుతారో ముందే గ్రహించి ప్రజలకు అవగాహన తో పాటు అన్ని రకాల వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ కిరణ్, ఎంపీ ఓ ప్రసాద్, గ్రామ కార్యదర్శి కల్పన ఎస్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరిత తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

కోటగుళ్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు..

కోటగుళ్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో శ్రావణ మాస మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, గణపేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలమాలతో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు భవానీ మాతకు చీరే సారే, ఓడి బియ్యం సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు.

గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర.

గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర

 

పరకాల నేటిధాత్రి

గుడ్ ఫ్రైడే (శుభశుక్రవారం) సందర్బంగా దివ్య కారుణ్య యేసు క్యాతలిక్ సంఘం ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో ఉదయం బస్టాండ్ కూడలినుండి మొదలై పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట సిలువ యాత్రను చేపట్టారు.అనంతరం యూదుల రాజైన యేసుక్రీస్తు వారు ఈలోకంలో జీవించే జనాంగం కోసం సిలువలో ఎలా వేయబడ్డారని కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తు వేశాధారణతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడికొండ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి నాయకులు,మాజీ ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్,డాక్టర్ మడికొండ శ్రీను,క్రైస్తవ సోదర సోదరీమణులు,సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ…

వాహనాల తనిఖీ

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు తప్పకుండా సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడిపినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సోహెల్, రజక్ పాల్గొన్నారు.

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

పలమనేరు నేటి ధాత్రి :

పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డు సమీపంలో ఉన్న ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించినట్లు సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాల్సి ఉండగా శనివారం సెలవు రోజు కాబట్టి ముందుగా జరపాలసి వచ్చిందన్నారు. ఈ దినోత్సవానికి మహిళా డాక్టర్లు శారద, సుధారాణి, ఎస్సై స్వర్ణ తేజ ,లెక్చరర్ రుక్మిణి, బాలికల పాఠశాల హెచ్ఎం కుప్పమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులకు సామాజిక సేవాదాత శ్రీపురం సీతారామయ్య, వీరి పెద్ద కోడలు సునీత చేతుల మీదుగా శాలువులు కప్పి ఘనంగా సన్మానించారు. లెక్చరర్ రుక్మిణి, ఎస్సై స్వర్ణ తేజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అప్పుడే సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలు, బాలికల యొక్క మేదస్సు దానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వాటికోసం మనమందరము పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే భారతదేశంలో పురుషాధిపత్యం చెలరేగుతున్నదనడానికి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనం అన్నారు.ఎక్కడో అమెరికా దేశంలో ఓ రాష్ట్రమునందు 5000 మంది మహిళా కార్మికుల చేత ప్రారంభమైన పోరాటం ప్రపంచ దేశాల్లో అలుముకుందని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ పండుగగా జరుపుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుండి విద్యతోపాటు, సామాజిక నైపుణ్యతలు, మానవతా విలువలు ఇంటి దగ్గరే వారికి బోధించాలన్నారుబాలికలను అన్ని రంగాల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించి ధైర్యంగా ముందుకు పంపించాలన్నారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నజ్మా, మాధవి లత, గీత, శారదమ్మ, ద్రాక్షాయని, పుష్ప, అంగన్వాడి వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

కేతకీకి పోటెత్తిన భక్తులు..!

కేతకీకి పోటెత్తిన భక్తులు.. భక్తుల అగ్నిగుండ ప్రవేశం

జహీరాబాద్. నేటి ధాత్రి:

అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అమావాస్య కలిసి రావడంతో భక్తుల మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రికి కల్యాణోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version