ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించిన.!

ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించిన పూర్వ విద్యార్థులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ 1990-91 పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రూ .30 వేల విలువైన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేశారు. బుధవారం పాఠశాలలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా క్యా తనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు మందమర్రి మండల విద్యాధికారి దత్తు మూర్తి చేతుల మీదుగా ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 1990- 91 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అందజేయడం అభినందనీయమన్నారు.

ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని పాఠశాల చదివిన ఇతర విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ .శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోమల, పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ లక్షెట్టి లక్ష్మణ్ మూర్తి, కో కన్వీనర్లు బావండ్ల పెల్లి శ్రీనివాస్, ఈదునూరి సారంగరావు, పి. రమాదేవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి.

అప్రమత్తంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యం వెల్లడి

జైపూర్ నేటి ధాత్రి:

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులతో పాటు సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు జైపూర్ ఎస్టిపిపి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం వెల్లడించారు.ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నత అధికారులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్లాంట్ ఉద్యోగులంతా పరిస్థితులకు తగిన విధంగా తగిన జాగ్రత్త వహించాలని వివిధ అంశాలను పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిఎం కే. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడి కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి ఏవైనా వస్తువులు గాని,పార్సిల్స్ గానీ వస్తే తీసుకోరాదని కోరారు.అందరూ విధిగా. ఈ ఆదేశాలను పాటించాలని, అప్రమత్తంగా మెదలాలని తెలిపారు.అలాగే నివాస ప్రాంతాల్లో గాని,ప్లాంట్ పరిసరాల్లో గాని అనుమానితులు కనిపిస్తే వెంటనే సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.8332974224 కీ సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ (ఓ&ఎం) జే.ఎన్.సింగ్,ఏజీఎం (ఈ అండ్ ఎం) మదన్మోహన్,సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,పీఎంపిఎల్ ప్లాంట్ హెడ్ అఖిల్ కపూర్,పీఈఎస్ ప్లాంట్ హెడ్ రమేష్ చంద్ర ,డీజీఎం (సివిల్) శ్రీ అజాజుల్లా ఖాన్,డిజీఏం పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, ఎస్ అండ్ పిసి ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటు.

గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం.!

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం పలికిన సామాజిక కార్యకర్తలు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

 

 

నేటి ధాత్రి :తెలంగాణ రాష్ట్రం లో పరిపాలన మార్పులలో భాగంగా, వీణవంక మండలం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన దూలం మంజుల గారికి పూలమొక్కతో సాధర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపిన సామజిక కార్యకర్తలు దేవునూరి శ్రీనివాస్, సిలివేరు శ్రీకాంత్, ఈ శుభ సందర్బంగా,తహసీల్దార్ మండల ప్రజలకు నూతన రెవెన్యూ చట్టాలు “భూభారతి, సాదా బైనామా”ల విషయంలో ప్రజలకు విరివిగా సేవలను అందించాలని, వీణవంక మండల ప్రజలు, అన్నదాతలైన రైతాంగ వర్గం తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది, అందుకు సానుకూలంగా స్పందించిన నూతన తహసీల్దార్ గారికి వీణవంక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్..

*తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్..

*ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్…

*రూ.1000 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ఉపాధి..

*ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యం..

*వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

తిరుపతి(నేటి ధాత్రి)

తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్…పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు.

*లక్ష్యానికి తొలి అడుగు ఇది..

స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలిఅడుగు అవుతుందన్నారురాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసిఈ)
పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌కు సహకారం అందిస్తాయి. అని ముఖ్యమంత్రి చెప్పారు.

*ఎన్నో వనరులు…వినియోగించుకోండి..

విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఆంధ్రప్రదేశ్… దేశీయ, ప్రపంచ మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని ముఖ్యమంత్రి అన్నారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.

ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు..

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ ఢైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుచిం 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. మొత్తంమ్మీద 8 శాతం నుంచి 10 శాతం ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుంది.

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ..

2012లో స్థాపించిన హీరో గ్రూపు పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన, సౌర, హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది. భారతదేశం, యుకె, ఉక్రెయిన్, వియత్నాం, బంగ్లాదేశ్‌లో 1.9
జి డబ్యూ,
సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్వహిస్తూ రూ.1,460 కోట్ల వార్షిక ఆదాయం సాధిస్తూ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి సామర్థ్యాన్ని 30,
(జి డబ్యూ,)
కి పెంచడానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.

రాక్‌మాన్ ఇండస్ట్రీస్..

1960లో స్థాపించిన హీరో గ్రూప్‌లో భాగమైన రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డై-కాస్టింగ్ భాగాలు, అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల తయారీదారు. లుధియానా, హరిద్వార్, చెన్నై, బవాల్, సూరత్, వడోదర, తిరుపతి ప్లాంట్లతో రూ.2,390 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. ఏరోస్పేస్, హై-ఎండ్ ఆటోమోటివ్ రంగాల్లోకి ప్రవేశించింది. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్‌మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్‌ పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version