బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన(MLA).

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే

పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:

 

పలమనేరు బారసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్. భాస్కర్ ను పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ్ రెడ్డి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎల్.భాస్కర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మీపతి,కార్యదర్శి బర్కత్, ఉపాధ్యక్షులు షేక్ షరిఫ్, చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి. ఆర్. రవి,
సీనియర్ న్యాయవాదులు భగీరథ కుప్పరాజు, ఎస్. రెడ్డెప్పశెట్టి, రాజా రెడ్డి, కె.జగదీశ్, ఎస్.లక్ష్మణ్ రెడ్డి,ఇ.కృష్ణ, ఎన్. నారాయణ రెడ్డి,పి.ఆర్.లోకేష్,
బి.గిరీష్,రాజు,రాజీవ్ గాంధీ, రాజశేఖర్,సుబ్బారామయ్య,సంధ్య, పుష్పాంజలి,చాందిని పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి

మల్లాపూర్ మార్చ్ 20 నేటి దాత్రి

అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే తెలంగాణా రాష్ట్ర బడ్జెట్
మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఅభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి అన్నారు.
బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చిన్నారెడ్డి స్పందిస్తూ తెలంగాణా రాష్ట్రంలో గడ్డు ఆర్థిక పరిస్థితులు వున్నప్పటికీ, వాటిని అధికమించే విధంగా 3,04,965 కోట్ల ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు బడ్జెట్ మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని అద్యక్షులు చిన్నారెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగానికి, రైతు భరోసాకు, నీటిపారుదల శాఖలకు పెద్దపీట వేసి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వున్నా చిత్తశుద్ధిని తెలిపింది అని కొమ్ముల చిన్నారెడ్డి తెలిపారు.

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు.

ఆమె మాటే – తుపాకి తుటా…..!

డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు

ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3 వ వర్ధంతి సభ

భద్రాచలం ;నేటి ధాత్రి

ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు.
బుధవారం స్థానిక చంద్ర భవనంలో
ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి సభలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యం గారి చిత్రపటానికి నాదెళ్ల లిలావతి పూల మాలా వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతా లక్ష్మి మాట్లాడుతు మల్లు స్వరాజ్యం సంపన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే 13 ఏల కే తుపాకి పట్టి నిజం ప్రభుత్వం కి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య చైతన్యవంతులను చేశారని అన్నారు. తుపాకి పట్టి గెరిల్లా పోరాట నిర్మించిన మల్లు స్వరాజ్యం నీ నిజాం సైన్యాలు యెదుర్కోలేక ఇంటిని సైతం తగలబెట్టారని అన్నారు.ఆ నాడు ఆమె ను పట్టిస్తే 10 వేల రూపాయిలు ఇస్తాము అని ప్రభుత్వం ప్రచురించింది గుర్తు చేశారు.
స్వరాజ్యం రజాకర్ల పాలిట సింహా స్వప్నం అయ్యి నిలిచారని కొనియాడారు.ఆమె జానపద బాణీల్లో కవి కట్టి స్వయం గా ఆమె పాడి గ్రామంలోని ప్రజలను ఐక్యం చేసేదని తెలిపారు . ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పోటీచేసి 2 పర్యాయాలు సీపీఎం పార్టీ తరపున ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం స్పూర్తి తో మహిళలందరూ ఐద్వా ఇచ్చే పిలుపులో, పోరాటలలో భాగస్వాములు అయినప్పుడే నిజమైన ఘన నివాలి అర్పించినట్టు అని సీత లక్ష్మి స్పష్టం చేశారు..ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జీవన జ్యోతి , వై పూర్ణిమా దేవి, గౌతమి యే జే, ఆఫీస్ భేరర్స్ సక్కుభాయి, జీ నాగలక్ష్మి, ఎమ్ సుబ్బలక్ష్మి , పట్టణ కమిటీ సభ్యులు కే సుసిల , గణపతమ్మ,సి యెచ్ దనమ్మ,డి నాగలక్ష్మి ,సౌదామిని ,సౌభాగ్యం తడితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన.!

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన రమేష్ మేడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఏఏఓ గత నెల బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయాన్ని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ జనరల్ (ప్రధాన కార్యదర్శి) రమేష్ మేడి వచ్చి పరామర్శించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ నూతన కమిటీ కూడా పాల్గొనడం జరిగింది కమిటీని కార్యక్రమాలను అభినందించడం జరిగింది భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ చురుకుగా పాల్గొనాలని చెప్పారు
రాహుల్ (సబ్ ఇంజనీర్) డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ (సబ్ ఇంజనీర్) సెక్రటరీ మొగులప్ప ( ఆర్టిజన్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ (సబ్ ఇంజనీర్) అడిషనల్ సెక్రటరీ రాములు (జే ఏ ఓ) ట్రెజరర్ కిరణ్ ( ఏ ఎల్ ఎం )
ఉపాధ్యక్షులు ,సంగమేష్ (ఎల్ ఎం) మాజీ అధ్యక్షులు ,
ఏఎల్ఎంలు జేఎల్ఎంలు ఆర్టిజన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించిన మేము సైతం అని ముందుకు రావడానికి జహీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగ అరుంధతి సంఘం నాయకులు వరాలు , స్వామి దాస్, జయరాజ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు.!

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

Ra Channa Patel

ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ..

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుని నియామకం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పందుల సారయ్య ను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు పులిగిల్ల బాలయ్య ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నత్తి కోర్నేల్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పందుల సారయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా ఆలు పెరగకుండా చేస్తున్నామని ఇట్టి ఉద్యమానికి ఎన్నో ఉడుదులుకులు జరిగిన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తూ అసెంబ్లీలో కమిటీని వేసి అదేవిధంగా షమీం అత్తరు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసి దానిపై సర్వే చేయించి వర్గీకరణ చేయించి మంత్రివర్గంతో ముసాయిదా తీర్మానం చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత కల్పించి అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని 19 96లో వర్గీకరణ చేస్తానని ప్రకటించిన బిజెపి నాలుగు పర్యాయాలు అధికారంలోకి వచ్చి వారు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అన్నారు. ఇలాంటి బీజేపీని ప్రజలు పాతాళని తొక్కే రోజు దగ్గరలో ఉందని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య అన్నారు.
నా నియమానికి సహకరించినటువంటి దళితరత్నం దొబ్బటి రమేష్ టి పి సి సి కార్యదర్శి పాముల రమేష్, డాక్టర్ శరత్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, దయాకర్, రావుల మురళి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘనపురపు అంజయ్య, మిట్ట కడుపుల జలంధర్, బ్లాక్ కాంగ్రెస్ బైరు వెంకన్న, పలువురికి అభినందనలు తెలిపారు.

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం.

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం

నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా ,హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ ప్రింటింగ్ మరియు ప్యాకేజ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. భారత రాష్ట్రపతి మరియు హర్యానా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా గోషిక వెంకటేష్ మాట్లాడుతూ , హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని తన కృషికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మొదట డిప్లొమా, జి జె యు నుండి బి. టెక్ , ఎం. టెక్ చేసాను. దీని తరువాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసాను మరియు కొన్ని సంవత్సరాల తరువాత – నాకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నా డిగ్రీ మరియు పతకాన్ని స్వీకరించడానికి జి జె యు హిసార్ హర్యానాకు పిలువబడిందన్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

TPCC President Mahesh Kumar Goud.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ కార్యక్రమం లో మండల యువ నాయకులు అశ్విని పాటిల్ ఉన్నారు.

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో
– మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం
– కేకే సిరిసిల్ల వాసి
– గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు

సిరిసిల్ల:(నేటి ధాత్రి)

బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్ల మధు నువ్వు నిన్న మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని, భేషరతుగా కెకె మహేందర్ రెడ్డి అన్నకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అర్హతకు, ( పరిధికి ) మించి మాట్లాడొద్దని అన్నారు.
పెద్దవారిని విమర్శిస్తే పెద్దొనివైతవని భ్రమలో మాట్లాడుతున్నావని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి పుణ్యమే సిరిసిల్ల నియోజకవర్గం, కెకె మహేందర్ ప్రతి ఇంటి,ఇంటికి గులాబి జెండాని, తెలంగాణ నినాదాన్ని పరిచయం చేసిందని అన్నారు.
నీకు తెల్వకపోతే కేటీఆర్, కేసీఆర్ లను అడుగని అన్నారు.
10 సంవత్సరాల కాలంలో మల్కపేట రిజర్వాయర్ లో నీళ్ళు నింపలేని చాతగాని మనుషులు ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి ని విమర్శిస్తే కెకె మహేందర్ రెడ్డి అభిమానులు

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు
– దీక్ష సమయంలో బిజెపి మద్దతు
– బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
సిరిసిల్ల, (నేటి ధాత్రి):

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం 317 జీవో గురించి దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసిన తట్టుకొని వారికి మద్దతుగా నిలిచినందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్క కొమురయ్యకు ఓటు వేశారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రభాకర్,ఆడెపు రవీందర్,పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేవైఎం అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్,మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు,నరేష్, మోర రవి, విష్ణు, రాంప్రసాద్, పట్టణ అధ్యక్షురాలు పండుగ మాధవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న

పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి..

మాజీ మైనారిటీ అధక్షులు అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి

ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కట్కూరు దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన మైనారిటీ యువకుల గ్రీన్ టైగెర్స్ క్రికెట్ టీంనకు మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి అలీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షలు కట్కూరి దేవేందర్ రెడ్డి అతిధులుగా హాజరై జెర్సీలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం సభ్యులతో పరిచయ కార్యక్రమం చేసుకొని క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆడి ఆటను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగారాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఉడుత సంపత్,దొమ్మటి దాసు,డాక్టర్ రోహిత్,వెంకటేష్ రాకేష్ లు పాల్గిన్నారు.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు

” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన

■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉజ్వల్ రెడ్డిని నియమిం చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో వైద్యుడిగా సేవలు!

జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లికి చెందిన సిద్దం రెడ్డి ఉజ్వల్ రెడ్డి కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు ఉజ్వల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారు. పన్నెండేళ్లుగా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో తన ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా వివిధ పోటీలనూ నిర్వహిస్తుంటారు.
వీరి కుటుంబానికి స్థానికంగా మంచి పేరుంది. ఉజ్వల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి గతంలో జహీరా బాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానూ కృషి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా సారథిగా ఆయనను నియమించేలా కసరత్తు పూర్తయింది.

కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడంతో!

నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షు రాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత ఆమెకు టీజీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం
ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టీజీఐఐసీ కార్పొరేషన్
ఛైర్ పర్సన్ తో పాటు జిల్లా అధ్యక్షురాలిగానూ
కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఉజ్వల్ రెడ్డిని
సారథిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
అతి త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నించారు. చివరకు పార్టీ అధిష్టానం సురేష్ షెట్కార్ వైపే మొగ్గింది. ఈ క్రమంలో ఉజ్వల్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

రెండోసారి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన పూదరి రేణుక

జమ్మికుంట నేటి ధాత్రి

హైదరాబాద్ గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న చేతుల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణానికి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని గుర్తించి జమ్మికుంట పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవి పూదరి రేణుక శివకుమార్ గౌడ్ ని నియమించడం జరిగింది
ఇట్టి మా నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు కి మా కృతజ్ఞతలు

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని

పరకాల నేటిధాత్రి
హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్ దిలీప్ రాజ్ ని హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతే ఈ దేశానికి వెన్నుముక అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికలను శాసనసభలో ఆమోదించ చేయడం చరిత్ర ఆత్మకు,సాహసోపేతం అని అన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల రేవంత్ రెడ్డికి ఎంమ్మార్పిఎస్ మందకృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో జరగబోయే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,బొచ్చు అనిల్, పేరుక చరణ్,బొచ్చు రాజు, బొచ్చు నాగరాజు,కోడపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ అధ్యక్షునిగా శ్రీనివాస్ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రం లో విశ్వ బ్రహ్మణ సంఘం మండల అధ్యక్షుడు మొగుళోజు. భగవత్ చారి ఆధ్వర్యంలోగురువారం రోజున చిట్యాల గ్రామ విశ్వ కర్మ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు.రంగాచారి హాజరు అయ్యారు. చిట్యాల గ్రామ విశ్వ కర్మ అధ్యక్షునిగా చిలుములా.శ్రీనివాస్.. గౌరవ అధ్యక్షునిగా.. కల్వచర్ల వీరబ్రహ్మం…ప్రధాన కార్యదర్శిగా శృంగారపు.రాం కుమార్… ఉపాధ్యక్షుడిగా చిలుముల రమణాచారి. సహాయ కార్యదర్శిగా కల్వచర్ల రాము.. కోశాధికారిగా చిలుముల రాజేందర్. సలహాదారులు. కల్వచర్ల సత్యనారాయణ. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి . చిలుముల రాజమౌళి. కోశాధికారి .కల్వచర్ల కృష్ణమూర్తి… మండల వర్కింగ్ ప్రెసిడెంట్. పోతుగంటి చంద్రమౌళి. యూత్ విశ్వబ్రాహ్మణ సంఘం మండల ప్రధాన కార్యదర్శి. మాటూరి లవన్ బాబు.ఉప్పుల రాజేందర్.. కల్వచర్ల యుగేందర్.. చిలుముల.రాజేష్.వేమూరి. పరిపూర్ణాచారి .. కల్వచర్ల కిషోర్ సతీష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version