మదీనా మస్జిద్ అధ్యక్షునిగా ముజాహిద్ ఖాన్.

మదీనా మస్జిద్ అధ్యక్షునిగా ముజాహిద్ ఖాన్.

మహదేవపూర్-నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలోని మదీనా మస్జిద్ కార్య నిర్వహణ కమిటీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా ఎండి ముజాహిద్ ఖాన్, తోపాటు ఉపాధ్యక్షులు, ఎండి షఫీ ఖాన్, షంషీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, సంయుక్త కార్యదర్శి, మొహమ్మద్ అహ్మద్ బీసీ ఎలక్ట్రిషన్, కోశ అధికారిగా అస్రార్ ఖురేషి, కార్యవర్గ సభ్యులుగా, షేక్ నసీం, మొహమ్మద్ అలిమ్, మహమ్మద్ అల్తాఫ్, మొహమ్మద్ యాకూబ్, మహమ్మద్ అలీమ్ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ముఖ్య సలహాదారులుగా, అన్సార్ ఖురైషి, మొహమ్మద్ కరీం ఖాన్, ఎండి మసూద్ అలీ. లను ఎన్నుకోవడం. ఈ సందర్భంగా అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ మాట్లాడుతూ మస్జిద్ సేవకు ఎన్నుకోవడం అల్లాహ్ ఇచ్చిన వరమని, కార్యవర్గం అంతా మస్జిద్ తో పాటు ముస్లింల ఉన్నతి సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు సహాయ శక్తుల ప్రయత్నిస్తామని, ముస్లిం సోదరులందరికీ కమిటీ తరపున అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు సన్మానం

బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు ఘనoగా సన్మానం
వనపర్తి నేటిదాత్రి :

 

 పట్టవనపర్తిణంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది డి కిరణ్ కుమార్ నివాసంలో శాలువతో ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి చిదేర వెంకటేశ్వర్లు గంధం రాజు వెంకటేష్ పరమేష్ సురేష్ బాబు బాస్కర్ సంబు వెంకట్ రమణ విజయ సన్మానము చేసిన వారిలో ఉన్నారు

బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన.

బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన
వరంగల్ పోపా :-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సుధీర్ వలుస ను వరంగల్ బార్ అంబేద్కర్ హాల్ లో పోపా కార్యవర్గం మంగళవారం శాలువా, పూల మాల తో ఘనంగా సన్మానంచించారు.
ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, 20సంవత్సరాల తర్వాత వరంగల్ బార్ అధ్యక్షులు గా పద్మశాలి ఉండటం పద్మశాలి కులానికి గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మన సామజిక వర్గానికి వన్నె తేవాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వరంగల్ పోపా అధ్యక్షులు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ,యువ న్యాయవాది సుధీర్ బార్ అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవింద్, పాము శ్రీనివాస్, మాటేటి అశోకకుమార్, న్యాయవాదులు నల్ల మహాత్మ, అనుమాండ్ల రాజకుమార్, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

పలు కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలో నల్లబెల్లి మల్లమ్మ చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినారు.. జూకల్ గ్రామంలోని అన్నం కొమురయ్య చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం తాడిశెట్టి లక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఆమె ఇవ్వడం జరిగినది..నవాబుపేట గ్రామ కరోబార్ జిల్లాల కుమార్ ప్రమాదవశత్తు బైక్ నుండి పడి చనిపోగా చిట్యాల ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కంకనాల శంకర్ , పాలడుగుల రఘుపతి , బిక్కనూరి విజయ్ జూకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు సూర నరేందర్ , మండల ఉపాధ్యక్షుడు దొంతి రాంరెడ్డి , రేగురి స్వామి రెడ్డి , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ , నాగరాజు , అందుగుల రాజు , మధుకర్ , రాము , మధు , సదనందం , చింతల సుమన్ , మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు…

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల.!

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల సాధన సమితి అధ్యక్షుడు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నూతన ఎమ్మార్వో దశరథ్ ను బుధవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యపై ఎల్లవేళలా తమకు అండ ఉండాలని నూతన ఎమ్మార్వో ను రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రైస్ మిల్లు అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన బీచని బాలకృష్ణ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం సోమవారం చేయడం జరిగినది. కార్యదర్శిగా పోల విజయకుమార్ కోశాధికారిగా యనుమగండ్ల రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైస్మిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాలకృష్ణమాట్లాడుతూ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా.!

రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల జయంత్. 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

 

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరహోరి మధ్య జరిగాయి. నూతన అధ్యక్షుడిగా ఆకుల జయంత్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహేందర్, సహాయ కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా చౌటపల్లి వెంకటేష్, బుస్స రామనాథం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, పి వేణు కుమారులు గెలుపొందారు.గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు తడుక విశ్వనాథం, కరుణాల భద్రచలం, టీవీ నారయణ లు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి.

చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం చేసిన బీజేపీ నేతలు
వనపర్తి నేటిదాత్రి :

హిందూ రాష్ట్ర సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నారాయణ దాస్ జ్యోతి రమణ దంపతులను ఎంపికైనందున వనపర్తి పట్టణ 11 వ వార్డు రామ్ నగర్ కాలనీ కి చెందిన కాటమోనీ కృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు రాంనగర్ కాలనీ బిజెపి నాయకులు బోడా భాస్కర్ పట్టణ కార్యదర్శి అక్కల శివ గౌడ్ పట్టణ బీజేవైఎం నాయకులు అడ్డాకుల రాణా ప్రతాప్ 11వ వార్డు బూత్ అధ్యక్షులు 11వ వార్డు బిజెపి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ చంద్రకాంత్ రాజు రవి తదితరులు ఉన్నారు

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా.! 

పరకాల బార్అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య. 

 

పరకాల నేటిధాత్రి. 

హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షునిగా కూకట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా,మేకల శ్రవణ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ గా దొగ్గేల రమేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎండి.సబీర్, ట్రేసరర్ గా రాహుల్ విక్రమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గుర్రం ప్రవీణ్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి పెద్దబోయిన వేణు ప్రకటించారు.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాలమండలం లోని చల్లగరిగే గ్రామంలో
శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం రోజున చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* అధ్యక్షతన చల్లగరిగే యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది..చల్లగరిగే గ్రామ యూత్ అధ్యక్షులు గా కట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా:దూడపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*గా: సిరిపేల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి*గా దూడపక సురేందర్ సహాయ కార్యదర్శిగా పినగాని సురేష్, గొల్లపెల్లి నగేష్ సెక్రటరీగా అల్లె ప్రవీణ్ ప్రచార కార్యదర్శులుగా గువ్వ శ్రీకాంత్.కార్యవర్గ సభ్యులు గా
.గొల్లపెల్లి అనిల్
దూడపాక లక్ష్మణ్
.అల్లె తిరుపతి
దూడపాక రాజు
.వేమునూరి రాకేష్ లను ఎన్నుకున్నారు,
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండిరాజు మండల యూత్ నాయకులు గోపగాని శివ చిరంజీవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.

బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.

అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.

అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

BJP

 

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.

అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్..

వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ను సన్మానం చేసిన మిత్రులు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు న్యాయవాది కిరణ్ బాల్య మిత్రులు వై వెంకటేష్ మెడి కల్ ఏజెన్సీ నిర్వహికులు కె బి శ్రీనివాసులు శెట్టి పంపు కటకం చందు గట్టు రవి సాగర్ కొండూరు ప్రవీణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వై వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆకాంక్షించాలని  కోరారు

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా.!

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా జ్యోతి రమణ నియామకం

వనపర్తి నేటిదాత్రి :

 

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణదాసు జ్యోతి రమణ నియామకం అయ్యారు ఈ మేరకు ఢిల్లీ నుండి హిందూ సభ జాతీయ అధ్యక్షులు స్వామి సౌ పర్ణిక విజయేంద్రపురి నియామక పత్రం పంపారని జ్యోతి రమణ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ పాండి చ్చేరి 5 రాష్ట్రాలకు హిందూ సభ ఇన్చార్జిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిన్నయ్య నంద్ సరస్వతి నిర్మల్ వైడ్ సి గాయత్రి దేవేంద్ర కుమార్ చౌదరి బిజెపి జాతీయ రాష్ట్ర నాయకులకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ హిందూ సభ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమకమైనందుకు వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఏర్పుల సుమిత్రమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

కెటిఆర్ సేన మండల అద్యక్షులుగా మురహరి తిరపతి.

చిట్యాల నేటి ధాత్రి

 

కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి *

మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

నేటిధాత్రి మొగుళ్ళపల్లి :

 

మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా.!

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్

2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో
ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.

2025 – 2026 జనరల్ బాడి..

2025 – 2026 జనరల్ బాడి కమిటీలో
అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు,
ప్రధాన కార్యదర్శి మోటురి రవి,
సహాయ కార్యదర్శి కాంసాని అశోక్,
కోశాధికారి దాస్యం రంగనాథస్వామి,
ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్,
లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

INTUCF నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా

నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్

జమ్మికుంట :నేటిధాత్రి

తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి యు సి ఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో, కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐ ఎన్ టి యు సి,) అధ్యక్షులు గా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, బేతీగల్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా.. అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ..
నా నియామకానికి కృషి చేసిన కార్మిక సంఘం నాయకులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నియామకం ద్వారా అసంగటిత కార్మికులు మరియు సంగటిత కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, వారు అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version