మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.
#గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి నేటి ధాత్రి:
దేశ స్వాతంత్ర్య కాంక్ష సాధనలో ఎంతోమంది మహనీయుల త్యాగం ఉంది వారి జీవిత పోరాటా స్ఫూర్తి మన అందరికీ ఆదర్శం అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 77 ఏళ్లు పూర్తి చేసుకోవడం హర్షనీయమని దేశాన్ని హక్కుల సాధన దిశగా మార్పు గావించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పనకు ఎంతో కృషి చేశారు. ఇప్పటికీ మన దేశాలు భారత రాజ్యాంగంలోని అనేక అంశాలను ఆదర్శంగా తీసుకొని పాలన చేయడం భారతీయులకు ఎంతో గర్వకారణం. ఈ దేశానికి ఎంతోమంది మహనీయులు చేసిన సేవ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని వాళ్ళ ఆశయ సాధన కొరకు మనమంతా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్,ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, నాయకులు నాన బోయిన రాజారాం, పాండవుల రాంబాబు, ఖ్యాతం శ్రీనివాస్, గుండాల కుమారస్వామి, పోడేటి ప్రకాశం, జన్ను జయరాజ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, మంద రాజన్న, బూస సదయ్య, వేల్పుల రవి, మహేందర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
