బొల్లం అరుణ భాస్కర్ రామాలయం అభివృద్ధికి సహాయం

బొల్లం అరుణ భాస్కర్ రామాలయం అభివృద్ధికి మరింత చేయూత

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు పూజ అనంతరం గణపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ బొల్లం అరుణ భాస్కర్ దంపతులు ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నూతన బీరువా కొరకు రూపాయలు10116 ను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామిమాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ మోటపోతుల రాజన్న గౌడ్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి గోరంట్ల రాజన్న గుప్తా గారు పాల్గొనడం జరిగింది

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ….

ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.

#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version