కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్ 13:

 

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారుఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా,10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారితమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు,పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్.కె.బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో త్రాగునీటిలో మురుగు నీరు కలుస్తున్నాయి పరిష్కరించాలని,పింఛన్ ఇప్పించాలని, కోర్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లే అవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోర్లగుంట మారుతీ నగర్ లో వర్షపు నీరు నిలిచి పోతున్నది పరిష్కరించాలని,ఏ ఆర్ హాస్పిటల్ రోడ్డులో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని,ఎల. ఎస్. నగర్ నందు కాలువలు మరమ్మత్తు చేయాలని, నగరంలోని ఓపెన్ డ్రైన్స్ లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి,ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version