లోక్ ఆదాలత్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
#రాజీ పడటమే రాజమార్గం
#ఎస్సై వి గోవర్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో పలు కేసులలో సతమతమవుతున్న బాధితులు రాజీ పడడం వలన వారి భవిష్యత్తుకు లోక్ అదాలత్ దోహద పడుతుందని ఎస్సై వి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈనెల15న నర్సంపేట కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ ను మండల పరిధిలో ఉన్న పలువురు పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సద్వినియోగం చేసుకోవాలని. అలాగే క్రిమినల్, సివిల్ ఆస్తి తగాదాలు, కుటుంబ పరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన పలు కేసులలో ఇబ్బంది పడుతున్న బాధితులు సత్వర పరిష్కారం లభించే అవకాశం లోక్ అదాలత్ లో దొరుకుతుందని అలాగే ఇరువర్గాల వారు రాజీ పడడంతో సమస్య పరిష్కారం కావడమే కాకుండా కక్షిదారుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
