నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం…

నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో అధికారులకు సన్మాన కార్యక్రమం

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా

రామన్నపేట ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు
చేయాలని రామన్నపేట సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు
ఈ ప్రాంతం యొక్క చరిత్రను వివరిస్తూ అధికారులుగా
వారి యొక్క సహకారం ఉండాలని సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత నియోజకవర్గమైన రామన్నపేట ను పరిగణలోకి తీసుకోవాలని నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు ఉన్నాయి. నియోజకవర్గ ఏర్పాటుకు మండలంలో ఉన్న అన్ని రకాల అధికారుల సహకారం కూడా అవసరం తప్పకుండా ఉంటుంది ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది వారి సహకారం తప్పకుండా ఉండాలని ఒకప్పుడు రామన్నపేట నియోజకవర్గం లో ఎంతోమంది గొప్ప నాయకులు అధికారులు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఈ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలను నియోజకవర్గo ఏర్పడితే అభివృద్ధికి కావలసిన వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటుకు అధికారుల అవసరం తప్పకుండా ఉండాలని నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో
రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లుకు రామన్నపేట ఎస్సై డి నాగరాజుకు రామన్నపేట చరిత్రను వివరిస్తూ వారి యొక్క సహకారం ఉండాలని వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి. లింగయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్.కె చాంద్ ఎర్ర రమేష్ గౌడ్
నియోజకవర్గ సాధన సమితి నాయకులు వర్తక వ్యాపార సంఘం నాయకులు పోతరాజు శంకరయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య గౌడ్, పిఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు వరికల్ గోపాల్, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, దళిత రత్న అవార్డు గ్రహీత తెలంగాణ ఉద్యమకారులు గడ్డం యాదగిరి తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ నకిరేకంటి అశోక్
బిజెపి మండల నాయకులు ఏలూరు రవి, బీఎస్పీ మండల అధ్యక్షులు నకిరేకంటి నరేష్,
సాధన సమితి నాయకులు పెండం. రవీందర్ బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు..

కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు

భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రిని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి తరలిస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని హెచ్చరించారు. మూడు మండలాల ప్రజలకు అందుబాటులో విధంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ కేంద్రం వర్ధన్నపేటకు తరలించడం ద్వారా మూడు మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని దానిని గుర్తుంచుకొని ఎక్కడైతే వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు అక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తగిలిందని ఇప్పటికైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య విద్య అందించడం కోసం ప్రజలకు అనువైన సౌకర్యాలను కల్పించడం కోసం పని చేస్తే బాగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లోని గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఖాళీ శంకుస్థాపనలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోవడం కోసం కొన్ని మాఫియాలను పెంచుకుంటూ పోతూ వారి స్వలాభం కోసం వారి కుటుంబ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారని అది గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పారనేది వర్ధన్నపేట నియోజకవర్గంలో నిరూపణ జరిగిందని అని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన పంతిని .కట్ర్యాల. గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా పార్టీ జెండా ఎగరవేసిందని అలాగే కక్కిరాలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఉపసర్పంచ్ చేజిక్కించుకోవడం జరిగిందని ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయడం కడారి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని దీన్ని ఆలోచించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుద్ధి తెచ్చుకోవాలని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి అయినవోలు పున్నేలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా ప్రతిపక్షాలు పనిచేశాయని అదేవిధంగా పర్వతగిరి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేసిందని తెలియజేశారు ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని కావున ప్రజలకు అవసరమైన పనులను అతి త్వరలో చేపట్టి వారికి అవసరమైన అన్ని విధాల విద్య వైద్య నీటి సౌకర్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి రావలసిన దేవాదుల కాలువ ద్వారా నీరు నీరు ఇప్పటికీ తేకపోవడం ఎంత విడ్డూరంగా ఉంది అంటే ఇచ్చిన హామీలను మరిచిపోయి నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ప్రజలకు న్యాయం చేయకపోతే నిత్యం ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ప్రజల సహకారంతో ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన 100 పడకల ఆసుపత్రిని తరలిస్తే పెద్ద ఉద్యమాన్నిగా నిర్మించి గట్టిగా బుద్ధి చెప్తామని వచ్చే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version