పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి…

పార్టీలో యువతకు అవకాశం ఇవ్వండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టి పి సి సి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తన నివసరంలో కలిసి శాలువాతో సన్మానం చేసిన డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త బీసీ ఉద్యమ నేత . మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో మా ప్రాంతం నుండి బీసీ యువకుడినైన నాకు జడ్పిటిసిగా అవకాశం కల్పిస్తే అంతఃకరణ శుద్ధితో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ హక్కుల కొరకు కృషి చేస్తానని ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధన్ రాజ్ గౌడ్ అన్నారు మాలాంటి యువతను రాజకీయంగా ప్రోత్సహించాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు అభ్యర్థించారు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానత్వం ఉంటుంది యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందని డా: ధన్ రాజ్ గౌడ్ అన్నారు అనంతరం మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ధన్ రాజ్ గౌడ్,

జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నేత శూన్యం

జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 25 వరకు జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నేత శూన్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో బీసీలకు నేతలుగా తలెత్తని అవకాశాలు – 2020 నుండి 2025 వరకు బీసీ నేతల సంఖ్య శూన్యం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 2025 వరకూ బీసీలకు రాజకీయ పట్ల ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో జెడ్పిటిసిలు, ఎంపీపీ పదవుల్లో బీసీలకు ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం ఆవేదన కలిగించే అంశంగా నిలిచింది. నియోజకవర్గంలో ఉన్న మొత్తం పదవుల్లో రెండు ఓసీలకు, మూడింటిని ఎస్సీలకు కేటాయించారు. అయితే, బీసీలకు మాత్రం ఒక్క నాయకత్వ పదవీ బాధ్యత కూడా లభించకపోవడం శోచనీయమని స్థానిక బీసీ సంఘాలు వాపోతున్నాయి. పది శాతం వర్గాలైన ఓసీలకు పదవులు ఇవ్వడం, 18 శాతం ఉన్న ఎస్సీలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటే, దాదాపు 52 శాతం ఉన్న బీసీలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వం లేకపోవడంతో బీసీ వర్గ సమస్యలు అధికారికంగా ప్రతిఫలించకపోతుండడం, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని పక్కన పెట్టడం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా విభజనలపై బీసీ సంఘాలు, యువత కఠినంగా స్పందిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో నాయకత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వైఫల్యాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిచో కాబోయే రోజుల్లో జనరల్ అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని సంకేతాన్ని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version