ఒకటవ వార్డు సేవకు సిద్ధం: కృష్ణారెడ్డి

ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలను సేవలు అందిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సబ్ వెడ్డింగ్ 24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్ముతూ నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి, విద్యా సౌకర్యాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతంగా సేవ చేసి వార్డును ఆదర్శంగా నిలుపుతానని కృష్ణారెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version