బిఆర్ఎస్ అభ్యర్థి కొక్కిరాల దీప్తి ప్రచారం
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కొక్కిరాల దీప్తి రాకేష్ రావు ప్రచారం జోరుగా కొనసాగుతోంది.మంగళవారం గండ్రవాడ, బ్రాహ్మణవాడ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆమె ఓటర్లను కలిసిన సందర్బంగా తనకు అవకాశం ఇస్తే కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరిస్తానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే బ్రాహ్మణవాడలో పర్యటించిన సమయంలో బిడ్డా..మా ఓటు నీకే”అంటూ ఆశీర్వదించడంతో ప్రచారానికి మరింత ఉత్సాహం లభించింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఎండీ జాకీర్ అలీ (ఎంపీపీ) నాయకులు పాడి నవతా భగవాన్ రెడ్డి,బండి వెంకటేష్,ఎండీ మాక్స్ ద్ అలీ,ఎండీ బియా బాని,జాలా రవీందర్ రెడ్డి,బొమ్మకంటి నాగరాజు,మంజూరు,ఖలీమ్,మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
