కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో ముందంజ….

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో ముందంజ

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టే.

మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

కేసముద్రం/ నేటిధాత్రి

కేసముద్రం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 వ వార్డు అభ్యర్థి రడం శ్రీను ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు కేసముద్రం మున్సిపాలిటీ లో 7 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని తెలియజేశారు. కేసంద్రం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మరియు మాజీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు.7వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రడం శ్రీనుకి మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల మనసు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రచారంలో రడం శ్రీను, రడం నిఖిల్,గుండు గోపాల్, మాదాసు సారంగం, కోలిపాక వెంకన్న, చిలుముల సదానంద చారి, బండి రమేష్, బండి తోట వెంకన్న, కొనతం కోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న…. రడం శివ జ్యోతి..

ప్రచారంలో దూసుకుపోతున్న…. రడం శివ జ్యోతి

కాంగ్రెస్ పార్టీ కే ఓటెయ్యండి… అభివృద్ధికి బాటలు వేయండి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మున్సిపాలిటీలోని కేసముద్రం విలేజ్ లో మున్సిపల్ ఎన్నికల గడప గడప ప్రచారంలో 10వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రడం శివజ్యోతి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరిస్తూ తాను గెలిస్తే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందిస్తానని మరియు కేసముద్రం మున్సిపాలిటీ లో 10 వ వార్డు అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో శివజ్యోతి మాట్లాడుతూ మా కుటుంబం గతం నుండి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అని ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పలాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఈ అభివృద్ధిలో భాగం పంచుకునేందుకు నాకు అవకాశం దక్కిందని 10వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికల బరిలో నిలుచున్నానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ కాంగ్రెస్ ఉధృత ప్రచారంలో పాల్గొని వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు సన్న బియ్యం గృహజ్యోతి మరియు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎన్నో సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను గడప గడప వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 10 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రణం శివజ్యోతిని అత్యంత మెజార్టీతో గెలిపించండి అని 10 వ వార్డ్ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ రడం వెంకన్న, కాటంరాంరెడ్డి, చిట్ల రవి, బండారి దయాకర్, ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్ , చిన్నాల కట్టయ్య, చింతనూరి సతీష్, , బైరు వెంకన్న యనమల మహేందర్, తోట వెంకన్న , ఎలకల బోయిన అనిల్ , బుర్ర సుధాకర్, కుమార్ వెన్ను ఎల్లయ్య , యాకూబ్ పాషా, హమీర్, మహిళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం…

20వార్డు పద్మ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ రాజు నాయక్- పద్మ పార్టీ కౌన్సిలర్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి టీపీపీసి సభ్యులు చల్లూర్ మధు,పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది ఉచిత కరెంటు 200 యూనిట్లు, 500 రూపాయలకు వంట గ్యాస్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, రైతు భరోసా, ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతు బీమా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ప్రతినియోగ వర్గంలో ఇంటిగ్రేడ్ హై స్కూల్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు సంక్షేపతకలతో ముందుకు వెళుతుందని తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు మాట్టేవాడ సురేష్, శనిగరపు తిరుపతి, మంతెన సాంబయ్య, నోముల నారాయణ, ఇస్తారి, యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పాల శీను, రాజశేఖర్ జన్ను, కోయిల క్రాంతి, రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version