తోట సుధాకర్ కు పలువురి పరామర్శ…

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ

నడికూడ,నేటిధాత్రి:

 

 

టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T133358.203.wav?_=1

 

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన జాలిగపు సునీల్ గారి తల్లిగారు మరణించడంతో వారి కుటుంబానికి అండగా సునీల్ గారి స్నేహితులైన సన్రైజర్స్ చారిటబుల్ ట్రస్ట్ 99 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు 10000వేల రూపాయల చెక్ అందించారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి…

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.

ఆర్ఎంపీ కి ఆర్థిక సహాయం…

ఆర్ఎంపీ కి ఆర్థిక సహాయం

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి దాసరి జయసాగర్ తల్లి ఈశ్వరమ్మ (85) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా ఆర్ఎంపి,పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నడికూడ మండల కమిటీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం కల్పించి,మండల కమిటీ తరపున రూ.5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షుడు పాశికంటి రమేష్, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రాజేందర్,మార్త సురేష్, అడిగిచర్ల అశోక్,మంద సురేష్,తదితరులు పాల్గొన్నారు.

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం…

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామానికి చెంది న మంద జంపయ్య అనారో గ్యంతో మరణించగా తమ కుమారుడు అయిన మంద సురేష్ 2005 బ్యాచ్ పదవ తరగతి మిత్రులు ఇంటికి చేరుకొని వారి తండ్రికి నివాళు లు అర్పించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపి ₹25000/- వేల రూపాయలు అర్థిక సహాయాన్ని తమ కుటుం బానికి అందజేసి అండగా నిలిచారు.గత 7 సంవత్సరా లనుండి తమతో పాటు చదువుకున్న 2005 SSC బ్యాచ్ మిత్రుల కుటుంబంలో ఎలాంటి ఆపద వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ బాసటగా నిలుస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్ర మంలో దాసి శ్రావణ్ కుమార్, రంగు రాజేష్, కోగిల సుమ న్,పైండ్ల భాను, మోరె సుమన్, కోగిల తిరుపతి, బైని కర్ణాకర్, అల్లూరిశంకర్ పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి..

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మెట్ పల్లి సెప్టెంబర్ 22 నేటి దాత్రి

 

 

మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సోదరుడు కూన గంగాధర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను సోమవారం రోజు వారి నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా..టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,శంకర్, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T121029.177.wav?_=2

 

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T123238.256.wav?_=3

 

 

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్,ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ మరియు V6 న్యూస్ ఛానల్ రిపోర్టర్, ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ సోదరుడు (30 సంవత్సరాలు) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నమాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన అంత్యక్రియల ప్రార్థనాయకు జహీరాబాద్ లోని ఈద్గాలోని బాగ్దాదీ మసీదులో జుహర్ ప్రార్థనల తర్వాత, మసీదు జహ్రా ఖతీబ్ మరియు ఇమామ్ మౌలానా మసూమ్ ఆలం ఖాస్మీ చేత చేయబడ్డాయి మరియు అంజుమాన్ స్మశానవాటికలో ఖననం జరిగింది. సమాచారం అందుకున్న రాజకీయ, సామాజిక, మతపరమైన నాయకులు మరియు జర్నలిస్టు సంఘం జహీరాబాద్‌లోని శాంతి ఒమర్‌లోని ఐడిఎస్ఎంటి కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి, ఓపికగా ఉండాలని సలహా ఇవ్వడం ద్వారా మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. అంత్యక్రియల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

సిఐఎస్ఎఫ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T114441.637.wav?_=4

 

సిఐఎస్ఎఫ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సిఐఎస్ఎఫ్ బీడీఎల్ జవాన్ ఆరెపల్లి రమేష్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అతని వెంట
రాయని శ్రీనివాస్ గుండ మణికుమార్ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143411.649.wav?_=5

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి

నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

గుండాల(భద్రాద్రికొత్త

గూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుకొళ్ళూరి రామయ్య అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి మృత దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన గుండాల మండల పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా ఖదీర్ మాట్లాడుతు రామయ్య ని అందరూ తమ ఇంటి పేరుతో కాకుండా పట్వారి రామయ్య అని సంభోదించే వారు ఈ ప్రాంతానికి వారు ఎంత సేవ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పార్టీకి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య , మండల ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య , సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,ఎస్కె అబ్దుల్ నభి, పాయం గణేష్ , నునావత్ రవి,యువజన నాయకులు ఈసం భద్రయ్య,పల్లపు రాజేష్,బొంగు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T125952.524.wav?_=6

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి
చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

పీరియ నాయక్ కుటుంబానికి ఆర్థిక చేయూత

నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సబ్ స్టేషన్ తండ వాస్తవ్యులు బానోత్ పీరియా నాయక్ గ్రామ పంపు ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలు పని చేశారు కావున మాజీ సర్పంచ్ కి”శే”గుగులోతు వెంకన్న కుటుంబ సమక్షంలో మంగళవారం పెద్దకర్మ సందర్భముగా మానుకోట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్ నాయక్ పీరియ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మానవత్వంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నగదుగా 6000 /- రూపాయలు అందజేయడం జరిగింది బానోత్ పిరియా నాయక్ భార్య బానోత్ బిచ్చాలి మరియు తన కుమారుడు బానోతు సురేందర్ కూతురు సంగీత కు ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చే పథకాలు ఏమైనా ఉంటే నా వంతు సహాయంగా తప్పకుండా మీ కుటుంబానికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
గుగులోత్ శివుడు
గూగులోత్ సుక్యనాయక్
గుగులోతు నరేష్ (బోయ)
గుగులోతు విజయ్ నాయక్
గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

కేసముద్రంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142652.925-1.wav?_=7

బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత

టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన వల్లందాస్ కొమురయ్య కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఒక క్వింటా బియ్యం బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతగా అందివ్వగా కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మండల ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ చైతన్య నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ మాజీ వార్డ్ మెంబర్ మేకల లచ్చమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య ఉల్లి వెంకటేశ్వర్లు లావుడియా వెంకన్న అజ్మీర రాజు శ్రీరాముల సమ్మయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=8

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సాంబయ్య పార్థదేహానికి పూలమాల వేసిన బొచ్చు చందర్పరకాల…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125344.982.wav?_=9

సాంబయ్య పార్థదేహానికి పూలమాల వేసిన బొచ్చు చందర్పరకాల నేటిధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్,డిసిసిబి డైరెక్టర్,తెలంగాణ ఉద్యమ నాయకుడు,బీసీ హక్కుల, గౌడ్ సంఘం నేత పూజారి సాంబయ్య గౌడ్ అకాల మరణం చెందగా వారి పార్దివదేహానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నాల గోనాద్,రంజాన్ అలీ,ఎస్టీ సెల్ పరకాల నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,రిటైర్ కో ఆపరేటివ్ అధికారి శంషుద్దీన్,మాజీ వార్డ్ మెంబర్ లక్కం వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివాళులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-87.wav?_=10

 

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

దామెర మండలంలోని కొగిల్ వాయ్ గ్రామానికి చెందిన జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి కొండి మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా దశదినకరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్,మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారయణ రావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు,గంకిడి బూచి రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో బి.ఆర్.ఎస్ నేత బుర్ర రాంబాబు మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T120444.253-1.wav?_=11

 

అనారోగ్యంతో బి.ఆర్.ఎస్ నేత బుర్ర రాంబాబు మృతి
నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నేటిధాత్రి ఐనవోలు:-

 

ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బుర్ర రాంబాబు గౌడ్ అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయం తెలుసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి రాంబాబు భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని ధైర్యం చెప్పినారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ తంపుల మోహన్, గ్రామ అధ్యక్షుడు కట్కూరి చంద్రమౌళి, మాజీ ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు, గ్రామ కార్యదర్శి గద్దల ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు కట్కూరి ఉపేందర్, గువ్వల కృష్ణ బాబు, తిరుమల్ రెడ్డి, బొక్కల స్వామి, కంజర్ల శ్రీనివాసరావు, కట్కూరి శంకర్, దిలీప్ రావు, గోవర్ధన్, రాజేష్, మధుకర్, రాజు, సైనిక్ సందీప్ వేణుమాధవ్, జిల్లా మండల గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ సోషల్ మీడియా నాయకులు ఉన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T144213.303-1.wav?_=12

 

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ.

#గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి సర్వర్ అనారోగ్యంతో మృతి చెందగా. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో బుధవారం మృతిని స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు కొండి అశోక్, పరికి పవన్, మురికి రవి, భాష బోయిన సమ్మయ్య, కొత్త పెళ్లి రమణ చారి, గాజు బిక్షపతి, కనుకo సాల్మన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version