పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్.

పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్మి షాదీముభారక్ పథకాలు ఒక వరం లాంటివి .

◆ -పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్

◆ – ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పట్టణం లోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్మి/షాదీముభారక్ సంబంధిత నియోజకవర్గ లోని 925 మంది లబ్దిదారులకు గాను ₹.92,607,300 /- విలువ గల చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయినిలని .దేశంలో ఏ రాష్రంలో కూడా కళ్యాణలక్మి, షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్. ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు.అలాగే ఇటీవలే ముఖ్య మంత్రి గారి జహీరాబాద్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధులను కేటాయిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశాం అని, కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులను వరాలను ఇవ్వలేదు అని పువ్వు ఇవ్వక పోయినా కనీసం పత్రి అయినా ఇవ్వలేదు అని అన్నారు మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక పథకం లో 1,00,116 తో పాటుగా తులం బంగారం ఇస్తాం హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సంజీవ్ రెడ్డి,వెంకటేశం,పాక్స్ చైర్మన్ మాచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.

 

నేటిధాత్రి:

 

 

 

 

 

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు.

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. మర్డర్‌ మిస్టరీ- క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ‘మార్గన్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేశ్‌బాబును విజయ్‌ ఆంటోని కలిశారు. థ్రిల్లింగ్‌ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని విజయ్‌ ఆంటోని తెలిపారు.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ సురేష్.

వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని యస్.వి. కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ గారి కూతురి వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ గారు, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్ గారు,పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు, శుక్లవర్ధన్ రెడ్డి, ఖాజా భాయ్, స్వామి, ముర్జల్ గారు,మొయిజ్, ఇనాయత్, తధితరులు పాల్గొనడం జరిగింది.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చలో వరంగల్ గూడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే గూడ పత్రికను పలుచోట్ల గోడలకు అంటించిన అనంతరం, గీతా బాయ్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు, టిఆర్ఎస్ యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version