వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మెట్ పల్లి సెప్టెంబర్ 22 నేటి దాత్రి
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సోదరుడు కూన గంగాధర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను సోమవారం రోజు వారి నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా..టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,శంకర్, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
