విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి.!

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలోని అప్పయ్య పల్లి గ్రామానికి చెందిన ఒంటెరు భాస్కర్ కు చెందిన పాడి గేదే బుధవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఉదయం మేత కోసం బయటకు వెళ్లిన పాడి గేదె సాయంత్రం. ఇంటికి రాకపోవడంతో ఉదయం భాస్కర్ బయటకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెంది కనిపించింది. సుమారు 70 వేల ఈరోజు చేసే గేదె మృతి చెందడంతో రైతు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

క్షతగాత్రులను పరామర్శించిన.!

క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్. మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి

 

గత రెండు రోజుల క్రితం కాళేశ్వరం కారులో వెళ్ళివస్తూ కాటారం మండల పరిధిలో లారీ ఆక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి,హనుమకొండలోని లాస్య హాస్పిటలలో చికిత్స పొందుతున్న పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొచ్చురమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించన ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్. మడికొండ శ్రీను.అనంతరం జరిగిన సంఘటన గురుంచి వివరాలు తెలుసుకుని,వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడూరి రఘుపతి రెడ్డి-అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి-కావ్య దంపతుల వివాహ వేడుకలు హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో గల ఎంఎన్ రావు గార్డెన్ లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. మూడుముళ్ల బంధంతో..ఏడడుగుల అనుబంధంతో ఏకమైన ఈ జంట నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి గోదారి, గట్టు శ్రీకాంత్ తదితరులున్నారు.

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన.!

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
అన్నదాన కార్యక్రమం
బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేశిని కోటి
సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్
మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్58వ పుట్టినరోజు సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో పొన్నం ప్రభాకర్ పేరున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

Ponnam Prabhakar’s birthday

అలాగే పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది
* జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరూ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి NSUI రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమాలలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు సుంకరి రమేష్ సాయిన్ రవి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారపల్లి బిక్షపతి ఎలగందుల స్వరూపా శ్రీహరి పిట్టల శ్వేతా రమేష్ పానుగంటి సారంగం దిడ్డి రామ్మోహన్ కు దాడి రాజన్న గొల్లి పూలమ్మ మొగిలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి శివ మరి రామ్ రెడ్డి పందాల అజయ్ ముద్దమల్ల రవి పోతుల శ్రీనివాస్ అశోక్ రాజ్కుమార్ శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజు ఎండి సజ్జు పాతకాల రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శులు రవి అజయ్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి వార్డుల అధ్యక్షులు నరికే సుమన్ బుల్లి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ పొనగంటి కుమార్ పొన్నగంటి రాజు గాంధీ యువజన నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

అదనపు వసూళ్లపై నిశ్శబ్దం వెనుక రహస్యం.

అదునపు బకెట్లు అనుమతి ఇస్తేనే క్వారీలు ప్రారంభిస్తాం.

నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.

గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.

ప్రస్తుతం కొనసాగిస్తున్న ఇసుక రీచ్ లో ఎన్ని అక్రమాలు జరిగిన డోంట్ కేర్.

లోడింగ్ చేయనున్న కాంట్రాక్టర్ పై చర్యలకు బదులు, టీజీఎండిసి తమాషాగా చూస్తుంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కు టీజీఎండిసి తూట్లు పొడుస్తుంది.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

ఇసుక అక్రమాలు ఇసుక క్వారీల నిర్వహణ విషయంలో టి జి ఎం డి సి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్లకు వారు చెప్పిందే వేదం అంటూ సై అంటున్నారు. మండలంలో ఇసుక క్వారీల నిర్వహణ, విషయంలో టి జి ఎం డి సి, అధికారులు, నూతన ఇసుక పాలసీని అమలు పరిచాల్సింది పోయి, పాలసీ యొక్క విధానాలను తూట్లు పొడుస్తున్నారు, ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లకు, ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకు సహకరిస్తూ కాంట్రాక్టర్ల సూపర్వైజర్లతో సమానంగా టీజీఎండిసి సిబ్బంది, వసూళ్లు చేసి ఇవ్వడం, శరమాములుగా కొనసాగుతుంది. మరోవైపు దర్జాగా కాంట్రాక్టర్ సిబ్బంది ప్రతి లారీ వద్ద సీరియల్ నంబర్ పాసింగ్ లోడింగ్ లాంటి పేర్లతో వేల రూపాయలను దండుకోవడం జరుగుతుంటే, అధికారులు తమకేమీ తెలువది అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, టీజీఎండిసి అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, కాంట్రాక్టర్ల వెసులుబాటు అక్రమ సంపాదనకు మొగ్గు చూపుతూ వారు చెప్పింది వేదం అంటూ కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి అధికారులు, కొత్త రీచుల ప్రారంభం ఇసుక రీచుల్లో ఇసుక డంపింగ్ చేసి ఉన్నప్పటికీ లోడింగ్ కై ఆదేశాలు జారీ చేసే సత్తా లేకుండా పోయింది. దీనికి సాక్షాలు మండలంలో అనేక ఇసుక రీచుల్లో డంపింగ్ చేసి ఉన్న ఇసుక కుప్పలు సాక్ష్యం.

 

TGMDC

 

కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీజీఎండిసి.

ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న టీజీఎండిసి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, ఇసుక కాంట్రాక్టర్ల గుప్పిట్లో కీలుబొమ్మలా మారి, అక్రమ వసూళ్ల వ్యవహారం పై నిశ్శబ్దాన్ని పాటిస్తూ, కొత్త ఇసుక రీచుల ప్రారంభం విషయంలో, కాంట్రాక్టర్లకు వెసులుబాటు అక్రమ వసూళ్లు అదనపు బకెట్ల వ్యవహారం ప్రారంభం కై ,టి జి ఎం డి సి, పై ఒత్తిళ్లు, చీకటి ఒప్పందాలకు వేచి చూస్తూ, ప్రస్తుత అదనపు వసూళ్ల వ్యవహారంతో ఇసుక కాంట్రాక్టర్లకు, కడుపు నిందడం లేదని, అదునపు బకెట్లు 2500 నుండి 5000 వరకు రెండు బకెట్లు వేస్తేనే తమ కడుపు నిండుతుందని, కాంట్రాక్టర్ల విన్నపం మేరకు టీజీఎండిసి కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారి, కొత్త ఇసుక క్వారీల ప్రారంభం చేపట్టాల్సింది పోయి, సుమారు నాలుగు నెలల నుండి, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఇసుక కాంట్రాక్టర్లు, ఇప్పటికీ కేటాయించిన గ్రామాల్లో భూముల కొనుగోళ్ల విషయం పేరుతో, కాలయాపన చేయడం, మరోవైపు కొన్ని ఇసుక రీచ్ లు ఇప్పటికే డంపింగ్ చేసి ఉన్నప్పటికీ, ఆ రీచ్ ల నుండి ఇసుక రవాణా చేయించకపోవడం, వెనుక దాగి ఉన్న రహస్యం, అదనపు బకెట్ కు అనుమతి ఇస్తేనే, ఇసుక రీచులన్నీ పెద్ద మొత్తంలో ప్రారంభించడం జరుగుతుందని, టి జి ఎం డి సి కు కాంట్రాక్టర్లు వివరించడం జరిగింది అని అందుకే కొత్త ఇసుక క్వారీల ప్రారంభం డంపింగ్ చేసిన ఇసుక రీచుల నుండి రవాణాకు ఆలస్యం చేయడం జరుగుతుంది.

 

TGMDC

 

నెలల నుండి డంపింగ్ చేసి ఉన్న లోడింగ్ కు సమీరా అంటున్న కాంట్రాక్టర్ లు.

మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలో 14 ఇసుక రీచులకు 2014 సంవత్సరంలో 14 ఇసుక రీచులకు టెండర్ వేయడం జరిగింది. 14 క్వారీలు కూడా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆగస్టు 2014 నాటికి తమ కాంట్రాక్టర్ అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో కేవలం రెండు ఇసుక క్వారీలు మాత్రం ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. మిగతా 12 ఇసుక రీచ్ లు వాటిలో మహాదేవపూర్ ఒకటి, రెండు, మూడు ,నాలుగు, బొమ్మ పూర్ పేరుతో నాలుగు, బ్రాహ్మణ పెళ్లి పేరుతో రెండు,ఎల్కేశ్వరం పేరుతో రెండు, బెంగులూర్, పేరుతో ఒకటి, వీటిలో సుమారు నాలుగు క్వారీలు డంపింగ్ పూర్తిచేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ, ఇసుక రవాణా చేయడానికి ససేమీరా అంటున్నారు కాంట్రాక్టర్, అలాగే మిగితా 8 ఇసుక రీచ్లు, ఇప్పటివరకు భూమి పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ, ఇసుక క్వారీలు నిర్వహించకపోవడం, కాంట్రాక్టర్లపై టీజీఎండిసి తక్షణ చర్యలు తీసుకొని, ఇతరులకు కాంట్రాక్ట్ అప్పజెప్పి ఇసుక రవాణా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, టీజీఎండిసి కేవలం కాంట్రాక్టర్ల కొరకు శాఖ పని చేస్తుందనే విధంగా నేటి వరకు, గత సంవత్సరం, జూన్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమై జూలై నాటికి అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నప్పటికీ, నేటికి ఇసుక రవాణా కొనసాగడం జరగలేదంటే, టీజీఎండిసి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టా కాదా. కాంట్రాక్టర్లకు టీజీఎండిసి పరోక్షంగా సహకరిస్తుందని స్పష్టంగా కనబడుతుంది.

 

TGMDC

గత నెల రీచులన్నీ ఆన్లైన్ చేసిన, పట్టించుకోని కాంట్రాక్టర్.

ఇక టీజీఎండిసి పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ల ఇసుక క్వారీల పేర్లను టీజీఎండిసి గత నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు సుమారు 15 రోజులు,ఆరు రిచులపేర్లు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా టీఎస్ఎండిసిని పట్టించుకోకపోవడంతో టీజీఎండిసి ఇసుక రీచుల పేర్లను ఆన్లైన్ లో పెట్టడం నిలిపివేసింది. టీజీఎండిసి ఆన్లైన్లో పెట్టిన ఇసుక రీచుల పేర్లు ఇవే, మహాదేవపూర్ ఒక్కటి, ఎలికేశ్వరం ఒక్కటి, బొబ్బాపూర్ రెండు, బొమ్మపూర్ 3, బొమ్మపూర్ నాలుగు, మహాదేవపూర్ నాలుగు, టీజీ ఎంబీసీ అధికారుల ఆదేశాలు కాంట్రాక్టర్ల వద్ద ఎంత విలువతో ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతుంది. మహాదేవపూర్ వన్ క్వారీలో ఇసుక నాలుగు నెలల నుండి స్టోర్ ఉన్నప్పటికీ రవాణాకు టీఎస్ ఎండిసీ ఆదేశాలకు రిజెక్ట్ చేసిన కాంట్రాక్టర్, మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న పలువుల ఎనిమిది ,పలుగుల తొమ్మిది, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఇసుక రిచుల్లో ఇసుక అక్రమాల వ్యవహారం అక్రమ వసూళ్ల దందా, మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ, టీజీఎండిసి అధికారులకు వాటిపై చర్యలకు ధైర్యం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇసుక రీచ్ లో స్టాక్ చేసి ఉన్న ఇసుక రవాణాకు ఆదేశాలు ఇవ్వాల్సిన టిజిఎండిసి ఇసుక కుప్పలను తమాషాగా చూస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించి సగానికి పై ఇసుక క్వాంటిటీని రవాణా చేయాల్సిన టి జి ఎం డి సి, కేవలం కాంట్రాక్టర్లకు అక్రమ సొమ్మును దోచిపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధికారులవ్యవహారం, ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ విధానానికి తూట్లు పొడుస్తూ, కేవలం కాంట్రాక్టర్ల వద్ద మెప్పు పొంది అక్రమ సొమ్ము కాంట్రాక్టర్లతో పాటు తాము కూడా పోగు చేసుకుందామని ఒక చీకటి ఒప్పంద లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని స్పష్టంగా కనబడుతుంది. ఇలా టీజీఎండిసి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి వంద శాతం చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారంతో టీజీఎండిసి బండారం బయటపడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి కింది స్థాయి నుండి ఉన్నత అధికారి వరకు తక్షణమే ఇసుక రీచులు ఇప్పటివరకే ప్రారంభించకుండా ఉండడానికి కారణం, ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక రీచ్ లో అక్రమాల వ్యవహారంపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వివాహ కార్యక్రమములో పాల్గొన్నా ఎమ్మెల్యే చైర్మన్.

వివాహ కార్యక్రమములో పాల్గొన్నా ఎమ్మెల్యే చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

వివిధ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను. ఆశీర్వదించిన స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ,డిసిఎన్ఎస్ చైర్మన్ శివ కుమార్,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ గారు, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,
నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ ,
మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు.

కేతకిలో ఎస్పీ ప్రత్యేక పూజలు.

కేతకిలో ఎస్పీ ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి బుధవారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు.

విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ.!

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లామొగుళ్లపల్లి మండలంలో ని మోట్లపల్లి గ్రామ వాస్తవ్యులు గూడూరి రఘుపతి రెడ్డి -అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి వెడ్స్ కావ్య రెడ్డి (m.n రావు గార్డెన్ పరకాల) గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు

పెద్ద కోమటిపల్లి గ్రామ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దురిశెట్టి సంపత్_ సప్న గార్ల కుమార్తె శరణ్య గారి నూతన ఫల పుష్ప అలంకరణ కార్యక్రమ0లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య *

ఆయన వెంట గ్రామ నాయకులు పాల్గొన్నారు

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలును బహిష్కరించాలని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల ఎంఆర్ఓ గారికి మరియు కోహిర్ మండల పిఎస్ ఎస్ఐ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మరియు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్న వారిని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది.
ఇందులో మండల అధ్యక్షులు వైద్యనాథ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, సీనియర్ నాయకులు నర్సింలు, సతీష్ రెడ్డి, నాగరాజు, వంశ వర్ధన్ రెడ్డి, వంశీ, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, ఈశ్వర్ యాదవ్, శ్రీనివాస్, శ్రీశైలం, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.

హనుమాన్ మందిరాలయంలో.!

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

హనుమాన్ మందిరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కమల్ పల్లి హనుమాన్ మందిర్ ఆలయంలో ధ్వజస్తంభం, శివలింగం, నందీశ్వర, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక పూజలు నడుమ, వేదపండితుల మధ్య దంపతులచే యజ్ఞం, పూర్ణాహుతి, మహాకుంభసంప్రోక్షణ, మహాదీక్షాశీర్వచనములు చేశారు.

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి !

జిల్లాలో ఇందిరమ్మఇం డ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో.

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో..
వెంకటాపూర్ (ఆర్ )లో
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం..

రామాయంపేట మే 8 నేటి దాత్రి (మెదక్):

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రోనాల్డ్ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఒకప్పుడు జిల్లాల్లో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించే వారమని ఇప్పుడైతే ప్రతి గ్రామంలో కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Red Cross

అనంతరం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి మాట్లాడుతూ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెగా వైద్య శిబిరాలతో పాటు, రక్త దాన శిబిరాలు, వివిధ రకాల వ్యాధులకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు… ఆరోగ్య శిబిరాల చైర్మన్ దామోదర్ రావు మాట్లాడుతూ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో విరివిగా మెగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులను ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా
కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మద్దెల సత్యనారాయణ,మద్దెల రమేష్,సభ్యులు వి.సతీష్ రావు,తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి సూరారం డాక్టర్ లు రాఘవేందర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మేఘాన, రవి కిరణ్ లు రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి.

తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలంలోని పురేడుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి సుధారాణి మీద ఇంతకుముందు వచ్చినటువంటి తప్పుడు ఆరోపణల దృశ్య( ఇంది రమ్మ ఇండ్ల అమలు విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి 10000 రూపాయలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్త ) పై పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి పరునష్టం దావా కింద గ్రామస్తులలో పది మంది మీద కోర్ట్ నుండి నోటీసులు పంపించడం జరిగినది. దానికి బదులుగా బుధవారం నాడు గ్రామస్తులందరి ముందు
ఆ పది మంది వచ్చి పంచాయతీ కార్యదర్శి పి సుధారాణి కి క్షమాపణలు చెప్పి ఇందిరమ్మ ఇళ్ల కు మేమందరమూ అర్హులమే అని చెప్పినాము కానీ మీరు 10000 తీసుకున్నారు అని ఎవరికి చెప్పలేదు అని మా వైపు నుండి ఏమైనా తప్పు జరిగి ఉంటే మమ్ములను క్షమించండి అని గ్రామస్తులందరి ముందు క్షమాపణలు కోరారు.
మంగపేట మండలం పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు కే.సురేష్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే హక్కు మనకున్నది కావున దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండ ఎవరిపైనా తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేయకూడదు అని మీడియా మిత్రులను కోరడం జరిగినది

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట

#అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.

#మధ్యవర్తులను నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు.

# కాలేజీ చైర్మన్ నీ కలిసిన తరువాతనే అడ్మిషన్ తీసుకోవాలి.

మంద సురేష్ బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ,నేటిధాత్రి:

 

 

గ్రామలలో ఇంటింటి ప్రచారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యంత్రం ఉపాధ్యాయులకు లక్ష్యంగా నిర్దేశం కరపత్రాలు బ్రోచర్ల పంపిణీ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులకు టార్గెట్ నిర్దేశిస్తున్నాయి ఆ లక్ష్యం వాళ్లను సాధించేవరకు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు తమ పాఠశాల ప్రత్యేకతలు విశిష్టతను వివరిస్తూ ఆకాశాన్నియమైన బ్రోచర్లు కరపత్రాలను పంచుతున్నారు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం వెనుక ప్రచారాల తలపిస్తుంది ప్రతి ఒక్కరూ 10 నుండి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు టార్గెట్ విధించారు దీంతో వారు ఉదయం ఏడు గంటల నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ ప్రదక్షణం కొరబడినందున ఆరోపణలు ఉన్నాయని ఫీజులు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోలను అమలు చేయడంలో లేదు అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా అర్హత లేని వారితో బోధనలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అని మంద సురేష్ ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని అధికారులపై మండిపడ్డారు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామపంచాయతీ కార్యదర్శి చిట్యాల వ్యవసాయ. మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ చిట్యాల డైరెక్టర్లు అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version