డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు.

డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీత నగర్ సిరిసిల్ల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుండి దాదాపు లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ లో 25 బాలబాలికలు మరియు దాదాపు 25 మంది డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ లో బాలబాలికలు ఉత్తీర్ణు లైన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందజేసినటువంటి మెమోలు ఈరోజు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యల్.శారద అందజేసినారు ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు రాయడానికి అర్హత కేవలం ఎనిమిదవ తరగతి చదివే పిల్లలనుండి డిగ్రీ పీజీ వరకు చదివే పిల్లలు వరకు అర్హులు భవిష్యత్తులో ఇట్టి పరీక్షలలో పాసైన వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగము హైదరాబాదు వారు నిర్వహించే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ చేయడానికి అర్హులు అవుతారని ప్రధానోపాధ్యాయురాలు గారు చెప్పారు ఇట్టి టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ప్రభుత్వ డ్రాయింగ్ మాస్టర్స్ గా ఉద్యోగం పొందడానికి అర్హులవుతారు మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ పరీక్షలు కూడా ఇట్టి నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు వారు కూడా క్రాఫ్ట్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులవుతారని చెప్పారు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి పరీక్షలకు అందరూ ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి చేశారు. ఈ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తో పాటు డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అర్హులవుతారని చెప్పారు.

కనుకమ్మ మృతదేహానికి నివాళులర్పించిన దొమ్మటి.

కనుకమ్మ మృతదేహానికి నివాళులర్పించిన దొమ్మటి

పరకాల నేటిధాత్రి:

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో పాలకుర్తి సుదర్శన్ తల్లి పాలకుర్తి కనకమ్మ అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని టిపిసిసి మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య పరామర్శించారు.ఈ పరామర్శలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొజ్జం రమేష్, మాజీ కౌన్సిలర్స్ మడికొండ సంపత్,పసుల రమేష్ మాజీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు మడికొండ శ్రీనివాస్,గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్‌ నాశనం.

మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్‌ నాశనం

మహేశ్వరం జడ్పీఎస్ఎస్ హెచ్ఎమ్ స్వరూప

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్‌తో పాటు దేశ భవిష్యత్‌ నాశనమవుతుందని హెచ్ఎమ్ స్వరూప అన్నారు.

నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా హెచ్.ఎం స్వరూప మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు.

 

మాదకద్రవ్యాలు సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరం అని,విద్యార్ధి దశలోనే క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

 

ZPSS HM Swaroopa.

 

కష్టపడి చదివిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి జీవిత కాలం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతారని పేర్కొన్నారు.

చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు,శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

దుగ్గొండి సీఐ సాయిరమణ.

మత్తు పదార్థాల పట్ల ఎంజెపి స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు

నర్సంపేట నేటిధాత్రి:

 

మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని దుగ్గొండి సీఐ
సాయిరమణ అన్నారు.మత్తు పదార్థాలకు బానిసైన కొంత మంది యువత,విద్యార్థులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు.
దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో గల మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలలో మరకద్రవ్యాలు,మత్తు పదార్థాల పట్ల ఎక్సైజ్ శాఖ, జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాధికారత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దుగ్గొండి సీఐ సాయి రమణ పాల్గొని మాట్లాడుతూ అపరిచితుల మాయమాటలకు లోనుకావద్దని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు లోనవకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. సెల్ ఫోన్స్ చూడడం వల్ల విలువైన సమయాన్ని కోల్పోతారని ఈ సందర్భంగా సిఐ వివరించారు. ఎస్సై రణధీర్ మాట్లాడుతూ వివిధ రకాలుగా సైబర్ మోసగాళ్లు ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారని, మీ అకౌంట్‌కు వంద రూపాయలు పంపించామంటూ లింకులను పంపి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి లింకులను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలని విద్యార్థులకు సూచించారు. బహుమతుల పేరుతో పలు విధాల మోసాలు జరుగుతాయని చెప్పారు.మాయమాటలకు లోవనకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు.అనంతరం మత్తు పదార్థాల బారిన పడకుండా వారికి దూరంగా ఉంటామని,వాటి నిర్మూలనకు తమ వంతుగా పాలుపంచుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, పాఠశాల ప్రిన్సిపల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి

సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు

నర్సంపేట నేటిధాత్రి:

 

కేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని
సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సు మండల కమిటీ సభ్యుడు అక్కపెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది.బాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కి దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను నిర్బంధించి నెలల తరబడి జైల్లోపెట్టారని, ప్రధానంగా సిపిఎం నాయకులపై తీవ్రనిర్భందం ప్రయోగించారని అన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశాయని పోరాటాలకు తలొగ్గి 21 నెలల అమలులో ఉన్న ఎమర్జెన్సీనీ ఎత్తివేశారని అన్నారు.

గత 10 సంవత్సరాలుగా దేశంలో అధికారం లో ఉన్న మోడి ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాశి, ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను జైల్లోపెడుతూ అప్రకటిత ఎమర్జెన్సీనీ దేశంలో అమలు చేస్తూ, దొంగేదొంగా దొంగా అన్నట్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం మోడి దివాలాకోరుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక అర్హత మోడీకి లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను పొరటాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో మండల కార్యదర్శి బోళ్ళ సాంబయ్య, మండల కమిటి సభ్యులు పుచ్చకాయల నర్సింహ్మ రెడ్డి,కొంగర నర్సింహస్వామి,చల్ల నరసింహరెడ్డి,తాల్లపెల్లి రవి,నల్లగొండ మొగలి, పుచ్చకాయల మహేందర్ రెడ్డి,ఈసంపెల్లి మహేందర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సంపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో…

మోడీ పాలనలో అమలు అవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమార స్వామి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా వ్యతిరేక దీనంగా సిపిఎం పట్టణ కమిటి సభ్యులు కామ్రేడ్ గడ్డమిది బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీ నాయకులు బుర్రి ఆంజనేయులు, అన్వర్,కందికొండ రాజు,కార్తీక్,అనీల్, ఫరీద,విజయ,స్వప్న,నాగమణి, రుదర్రపు లక్ష్మి ,శ్రీనివసరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ

రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల నిధులతో సిసి రోడ్డు, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజీ, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియాలకు శంకుస్థాపన చేశారు.

రైల్వే గేటు పై నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై 15 లక్షల నిధులతో నిర్మించిన మెట్లను ప్రారంభించారు.

అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

 

Congress

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీలో అభివృద్ధి శూన్యమని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు.

మున్సిపాలిటీ లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి 25 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించాలని పట్టణ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మారేపల్లి నరేష్ మంత్రి కి వినతిపత్రం అందించారు.

Congress

 

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, వేల్పుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాస రాజు, సంఘ రవి, మేకల రమేష్ మహిళా నాయకురాళ్ళు పుష్ప , నాయకులు, యూత్ లీడర్లు ,ప్రజలు పాల్గొన్నారు.

తమిళ రాజకీయాలను కుదిపేసిన మురుగన్‌ మానాడు

`ద్రవిడ రాజకీయాలు తొలిసారి ఎదురవుతున్న ప్రతిఘటన

`క్రమంగా బలపడుతున్న సనాతనధర్మ వాదం

`హిందువులను కట్టేస్తున్న సెక్యులర్‌ సంకెళ్లు

`ఇకముందు కొండలు, ఆలయాల చుట్టూ తమిళ రాజకీయాలు

`పట్టు నిలుపుకోవడానికి డీఎంకే ఆరాటం

`ఆస్తిత్వంకోసం ఏఐడీఎంకే ఆరాటం

డెస్క్‌,నేటిధాత్రి: 

మదురైలో జరిగిన మురుగన్‌ భక్తుల సదస్సు, తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవిడవాద సంస్కృతిని సవాలు చేసింది. గత జనవరిలో విజయవాడ సమీపంలో విశ్వహిందూ పరిషత్‌ సమావేశాన్ని ఇది తలపునకు తెచ్చింది. నాడు సుమారు ఏడులక్షలమంది హిందువులు స్వచ్ఛం దంగా సమావేశంలో పాల్గని తమలోని సంఫీుభావాన్ని వ్యక్తం చేస్తే, జూన్‌ 22న మదురైలో జరిగిన ‘మురుగన్‌ భక్తగళ్‌ ఆన్మీర మనాడు’ పేరుతో హిందూ మున్నాని సంస్థ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించింది. నిజం చెప్పాలంటే కొన్ని దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి సనాతన ధర్మం, ద్రవిడవాదానికి తన బలమేంటో చూపింది. ద్రవిడ వాద పార్టీలైన ఏఐడీఎంకే, డీఎంకేల్లో ఒక్కసారిగా అంతర్మథనం సాగే రీతిలో ఈ సమావేశం జరగడం విశేషం. మొదట్లో ఏఐడీఎంకే ఈ సమవేశం పట్ల పెద్దగా దృష్టి పెట్టనప్పటికీ, సదస్సు విజయవంతం కావడం చూసి తన మనసు మార్చుకోక తప్పలేదు. ఇది కేవలం మురుగన్‌ భక్తుల సమ్మేళనం మాత్రమే కాదు, ఒక దృఢమైన రాజకీయ సందేశాన్నిచ్చిన వేదికగా మిగిలింది. ఈ సమ్మేళనానికి తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాలనుంచి ఐదులక్షలకు పైగా హిందువులు స్వచ్ఛందంగా హాజరుకావడంతో అధికార డీఎంకే నాయకుల్లో ఒకరకమైన గుబులు ప్రారంభమైంది. అరుపడై వీరు ఆలయాల (తమిళనాడు వ్యాప్తంగా విస్తరించిన అరవై మురుగన్‌ దేవాలయాలు) ప్రతికృతులను తయారుచేసి ఈ వేదికను అలంకరించడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు చేసిన మురుగన్‌ భజనల వెనుక ప్రజల్లో అంతర్లీనంగా వున్న హైందవ సంస్కృతి ఒక్కసారిగా బ యటపడిరది. ఈ సమ్మేళనం నిర్వహణకు మదురై నగరాన్ని ఎంపిక చేయడం యాదృచ్ఛికం కాఉ. తమిళ శైవంలో మదురై పట్టణానికి గొప్ప ప్రాధాన్యత వున్నది. ఈ శైవంలో భాగంగా వున్న మురుగన్‌తో ఈ నగరానికి ప్రాచీనకాలం నుంచి అద్భుతమైన అనుసంధానత వున్నది. ఈ నేప థ్యంలోనే హిందువుల అస్తిత్వ ప్రదర్శనకు మదురైని కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ సమ్మేళనం లో పాల్గన్న లక్షలాదిమంది భక్తులు, కార్యకర్తలు వేలాయుధాలను (మురుగన్‌/సుబ్రహ్మణ్యస్వామిఆయుధం) ధరించి కాషాయాంబరధారులై రావడంతో నగరం కాషాయరంగుతో కళకళలాడిరది.అంతేకాదు హిందువుల మూడ్‌ను కూడా ఇది స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా ద్రావిడ నాస్తికవాదం, బ్రాహ్మణుల పట్ల ఎంతోకాలంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను సవాలుచేసే రీతిలో ఈ సమ్మేళనం కొనసాగింది. అందువల్ల ఇది కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనమే కాదు, బలమైన రాజకీయ సంకేతాలను అందించిన సదస్సుగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ద్రావిడవాద ఆధిపత్య ధోరణికి ఒక సవాలు విసిరిందనే చెప్పాలి. 

వండియూర్‌కు సమీపంలోని అమ్మ థిడల్‌లో నిర్వహించిన ఈ సదస్సు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్‌గా నిలిచిపోయింది. మొత్తంమీద ఈ ఈవెంట్‌ అధికార ద్రవిడవాద పార్టీలో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఈ సమ్మేళనం తర్వాత డీఎంకే నాయకులనుంచి వస్తున్న ప్రకటనలు వారిలో నెలకొన్న ఆందోళనను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. మొదట్లో పోలీసులు ఈ సమావేశానికి అనుమతినివ్వడానికి నిరాకరించిన మాట వాస్తవం. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలను నియంత్రించడం చాలా కష్టమవుతుందన్న నెపంతో వారు సదస్సు నిర్వహణను తిరస్కరించారు. దీంతో నిర్వాహకులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడం తో, సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అనుమతినివ్వడమే కాకుండా, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య సదస్సు జరపాలని ఆదేశాలు జారీచేయడంతో ప్రభుత్వానికి సదస్సుకు అడ్డంకులు కలిగించడానికి వీలు కాలేదు. కోర్టునుంచి లభించిన అనుమతి దన్నుతో నిర్వాహకులు సాంస్కృతికంగా తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించారు. ఈ సమ్మేళనం ధాటికి ద్రవిడవాద సంస్కృతిని సమర్థించే వారిని అస్తిత్వ భయం ఆవహించిందనే చెప్పాలి. 

ఈ సదస్సు మొత్తం ఎనిమిది తీర్మానాలను ఆమోదించింది. ఇవన్నీ ఎంతోకాలంగా కొనసాగుతున్నవే కావడం గమనార్హం. తీర్మానాల్లో ముఖ్యమైంది తిరుప్పురన్‌కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడానికి అనుమతినివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం. తిరుప్పురన్‌కుండ్రం కేవలం మురుగన్‌ స్వామికి చెందిందేనని సమ్మేళనం స్పష్టం చేసింది. ఈ కొండపై ఒక దర్గాకూడా వు న్న నేపథ్యంలో ఇటీవల హిందూ, ముస్లింల మధ్య స్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ పర్వతం విషయంలో ఇతర మతాలవారితో సమన్వయంగా ముందుకెళ్లే ప్రసక్తే లేదని, ఇది కేవలం హిందువులకు మాత్రమే చెందిందిగా సమ్మేళనం స్పష్టం చేసింది. ఇక రెండో ముఖ్యమైన తీర్మానం, హిందువుల దేవాలయాలు, ధార్మిక సంస్థలపై ప్రభుత్వ ఆధిపత్యం వుండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. హిందువులు మతమార్పిడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో కంధ (స్కంధ) షష్టి కవచాన్ని హిందువలు నిత్యం పఠించాలని కోరింది. ఇక హిందువులు కూడా సమైక్యంగా ఉమ్మడిగా తమ ఓటుహక్కును గంపగుత్తగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. ఇతర మతాలవారు ఈవిధంగా సమైక్యంగా ఒకే మాటపై ఓటుహక్కును వినియోగించుకుంటున్నప్పుడు హిందువుల మాత్రం ఎందుకు చీలిపోవాలి? అని సదస్సు నిర్వాహకులు ప్రశ్నించారు.

బీజేపీ బహుకాలంగా తమిళనాడులో పాదం మోపాలని గట్టిగా కృషిచేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రవేశానికి మురుగున్‌ వారథిగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఈవెంట్‌కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన జారీచేయడం విశేషం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైలు సదస్సులో పాల్గని బలమైన సందేశాలను ఇచ్చారు. వీరి ప్రసంగాలు పాల్గన్నవారిని మరింత ఉత్తేజితులను చేశాయి. ముఖ్యంగా మురుగన్‌ ఒక దేవుడు మాత్రమే కాదని, తమిళుల గుర్తింపునకు గొప్ప గుర్తు అని స్పష్టం చేయడం ద్వారా ద్రవిడవాదానికి గట్టి సవాలు విసిరారు. పవన్‌ కళ్యాణ్‌ తమిళంలో చేసిన ప్రసంగం ఉర్రూతలూగించింది. ‘‘ఒక ముస్లిం తాను ముస్లింనని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక క్రైస్తవుడు తన మతవిశ్వాసాలను నిర్భయంగా పాటిస్తాడు. అదే ఒక హిందువు తాను హిందువును అని చెప్పుకున్నప్పుడే సమస్యలు వస్తున్నాయి. మనదేశంలో అమల్లో వున్న సెక్యూలరిజం ముసుగులో కొనసాగుతున్న గొప్ప దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సదస్సు నేపథ్యంలో ద్రవిడవాద పార్టీగా వున్న ఏఐడీఎంకే ఇరుక్కుపోయింది. ఎందుకంటే పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు ధర్మం కింద దీన్ని సమర్థించడమా లేక ద్రవిడ వాదానికి మద్దతుదారుగా ఖండిరచడమా తెలియక గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందంగా కొట్టుమిట్టాడుతోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి సమావేశ నిర్వాహకులకు అభినందనలు పంపి వూరుకున్నారు. అయితే ఏఐడీఎంకేకు చెందిన ఐదుగురు నాయకులు సదస్సులో పా ల్గనడం విశేషం. సదస్సులో వక్తలు హిందూ సంప్రదాయాలకు అనుకూలంగా ఉద్వేగ ప్రసంగాలు చేశారు. ఇదే సమయంలో అనుక్షణం హిందూ సంప్రదాయాలను ఆక్షేపణకు గురిచేస్తున్న ద్రవిడవాదంపై విచుకుపడ్డారు. సమర్థనీయం కానప్పటికీ ద్రవిడవాద ప్రతిపాదకుడు ఇ.వి. రామ స్వామిని విమర్శిస్తూ కొంత మంది మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్ర వక్రీకరణలు, తప్పుడు సిద్ధాంతాలతో తప్పుదోవ పట్టించే ప్రక్రిలను వక్తలు తీవ్రంగా తప్పుపట్టారు. ద్రవిడవాద ఉద్యమం అనుసరించే హిందూ వ్యతిరేక వైఖరిని కొందరు వక్తలు విమర్శించారు. మొత్తంమీద చెప్పాలంటే మురుగన్‌ మానాడు (మహానాడు) ఒక స్పష్టమైన శక్తివంతమైన సందే శాన్ని పంపిందనే చెప్పాలి. ఈ సమావేశంపై ఏఐడీఎంకే మౌనంగా వుండటంతో, డీఎంకే తన దాడులను తీవ్రం చేసింది. దీనిపై ఏఐడీఎంకే వివరణ ఇస్తూ, పార్టీ నాయకులు సమ్మేళనంలో పాల్గన్నప్పటికీ, వారు పార్టీ ప్రతినిధులు కాదని స్పష్టం చేయడం ద్వారా, నష్ట నివారణ చర్యలకుదిగింది. అంతేకాదు ఈ సమ్మేళనంలో చేసిన తీర్మానాలతో తనకు సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.

దశాబ్దాలుగా ద్రవిడవాదం నాస్తికతను, హేతువాదాన్ని ప్రచారం చేస్తున్నా, కేవలం హిందూమతానికి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇతర మతాలను పట్టించుకోవడంలేదు. దీని ప్రతిస్పందనలు తనను దెబ్బతీస్తాయన్న భయంతో డీఎంకే 2024లో పళని పట్టణంలో మురుగన్‌ సదస్సును నిర్వహించింది. ముఖ్యంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా డీఎంకే తీసుకు న్న చర్య ఇది. అయినప్పటికీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇప్పుడు మదురై పట్టణం లో నిర్వహించిన మురుగన్‌ సమ్మేళనం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు రాజకీయంగా కూడా గొప్ప ప్రభావశీలకంగా జరిగింది. ముఖ్యంగా తమిళ హిందువుల అస్తిత్వానికి ప్రతీకగా నిలవడం గమనార్హం. 

డీఎంకే దాని సహచర పార్టీలు గతంలో హిందూ దేవతలపై దారుణమైన పదజాల ప్రయోగం చేయడాన్ని తమిళులు ఇప్పటికీ మరచిపోలేదు. మనం ఏ విత్తనం నాటిదే అదే మొక్క వస్తుంది. గతంలో తాను చేసిన పనులకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు డీఎంకే తాను హిందువులకు అనుకూలమని చెప్పుకోలేదు. ఇప్పుడు మురుగన్‌ మానాడు, తాము వీర ద్రవిడవాదులుగా భావించే కొందరు తమిళ ఓటర్లకు ఆగ్రహం తెప్పించక మానదు. ఇక ఏఐడీఎంకే తన సైద్ధాంతిక వైరుధ్యాలతో పోరాటం చేయక తప్పదు. బీజేపీ సాంస్కృతిక వివరణ హిందీ`హిందూ`హిందూస్తాన్‌ మాత్రమే కాదు తమిళనాడులు వేల్‌`మురుగన్‌`తమిళ ఔన్నత్యం అనేఅంశాలపై ఆధారపడివుంటుంది. 

ప్రస్తుత పరిణామాలు క్రమంగా ఓటు బాక్స్‌ల్లో ప్రభావం చూపేవిగా మారతాయా అన్నది వేచి చూడాలి. ఒక్కటిమాత్రం నిజం ఒక ముందు ఎంతోకాలం తమిళ ఆత్మ కేవలం బ్యాలట్‌ బాక్స్‌ లకు మాత్రమే పరిమితం కాబోవన్నది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం. దేవాలయాలు, కొండలు, ‘హరోం హర’ అంటూ బిగ్గరగా పఠించే భక్తుల హృదయాల నుంచి ఇవి రూపుదిద్దుకుం టాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

`నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌

`తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌

`జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌

`తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ రోజా ఇంటికి వెళ్లిందే కేసీఆర్‌

`రోజా ఇంటిలో రాయలసీమ మీద ప్రేమ ఒలకబోసిందే కేసీఆర్‌

`ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నదీ కేసీఆర్‌

`రాయలసీమకు నీళ్లిద్దామని కేసీఆర్‌ అంటే ఆనాడే అడ్డుకున్నది కాంగ్రెస్‌

`పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే చూసిందే కేసీఆర్‌

`జగన్‌తో కయ్యం కన్నా నెయ్యం కోరుకున్నదే కేసీఆర్‌

`వైఎస్‌. పావురాల గుట్టలో పాయిరమైపోయిండన్నది కేసీఆర్‌

`అదే వైఎస్‌ కొడుకు జగన్‌తో రాజకీయం నెరిపిందీ కేసీఆర్‌

`అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనిపించుకున్నదే కేసీఆర్‌

`ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారనేది కేసిఆరే.

`రాయలసీమకు నీళ్లొద్దా అని అనేది కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసీఆర్‌

`తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే

`ఉద్యమ కాలంలో అందరూ చూసిందే!

`తెలంగాణలో నీళ్ల కోసమని పాదయాత్ర చేసినట్లు నటించడం తెలుసు.

`బీఆర్‌ఎస్‌ విస్తరించాలని ఆంద్రాకు నీళ్లిద్దామని నమ్మించడం తెలుసు.

`ప్రధాని కావాలన్న పగటి కలలు కనడం తెలుసు

`ప్రజలు బండకేసి కొడితే కండ్లు బైర్లు కమ్మి మళ్ళీ కొత్త నాటకం ఆడడం తెలుసు

`మళ్ళీ సెంటిమెంట్‌ రాజేసి రాజకీయాలను ఏలాలనుకుంటున్నాడు

`పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నాడు

`మళ్ళీ నీళ్ల రాజకీయం మొదలుపెట్టి నిప్పులు పోస్తున్నాడు

నాకు తెలిసిందే నిజం..నేను చెప్పిందే వేదం..నాకున్నదే జ్ఞానం.. మిగతా వారిదంతా అజ్ఞానం..నాది రజో గుణం..నేను సృష్టించిందే తపోవనం..అని పగటి కలలుకనడంలో కేసిఆర్‌ ఫస్ట్‌..తెలంగాణ తెచ్చింది నేనే అని అసత్య ప్రచారం చేసి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చాడు. అమర వీరుల త్యాగాల పునాదులు, తెలంగాణ వాదుల అలుపెరగని పోరాటంతో వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని మోసం చేసి సిఎం కుర్చీలో కూర్చున్నాడు. అడుగడుగునా తెలంగాణను ఆగం చేస్తూనే వచ్చాడు. ప్రజల సొమ్మంతా నీళ్లలో పోసి పనికి రాని కాళేశ్వరం నిర్మాణం చేశాడు. కమీషన్లను దండుకొని కోట్లు గడిరచాడు. నాసిరకం నిర్మాణం చేసి కాళేశ్వరాన్ని మూడేళ్లకే కూలేశ్వరం చేశాడు. తెలంగాణ ప్రజల సొమ్ము నీళ్లలా ఖర్చు చేసి, ఎందుకూ పనికి రాని పనులు చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

కాళేశ్వరం అద్భుత సృష్టి నాదే అని కేసిఆర్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు నాకేం సంబంధం లేదంటున్నాడు. బొట్టు బొట్టు రక్తం కరిగించి, కాళేశ్వరం కట్టానన్నాడు. పిల్లర్లు కుంగిపోయి, కూలిపోయే పరిస్థితి వచ్చే సరికి నా తప్పేం లేదంటున్నారు. కాళేశ్వరం నిర్మాణం కేసిఆర్‌ కోసం ప్రయత్నం మొదలు పెట్టినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. తెలంగాణ మేధావులు, సాగునీటి రంగ నిపుణులు, యూనివర్శిటీల ప్రొఫెసర్లు ఇలా ఎంతో మంది వద్దని వారించారు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. ఏ ఒక్కరూ కాళేశ్వరం గురించి పాజిటివ్‌గా మాట్లాడిరది లేదు. అయినా మూర?ంగా కేసిఆర్‌ ముందుకు వెళ్లాడు. నీళ్ల గురించి నాకే చెబుతారా? అని ప్రశ్నించిన వాళ్ళందరినీ ఎగతాళి చేశాడు. అప్పుడు అందరూ చెప్పిందే నిజమైంది. కేసిఆర్‌ చెప్పిన సుద్దులన్నీ నీటి మీద రాతలయ్యాయి. తెలంగాణ ఆగమైంది. తెలంగాణ అప్పుల పాలైంది. కాళేశ్వరం తెల్ల ఎనుగైంది. నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసిఆర్‌. తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసిఆర్‌. దేశంలోని అన్ని నదుల నుంచి సుమారు30 వేల టిఎంసిల నీరు సముద్రం పాలౌతుందని అన్నాడు. దేశ వ్యాప్తంగా బీడువారిన భూముల్లో బంగారు పంటలు ఉండేందుకు అద్భుతమైన ప్రాజెక్టులు కట్టొచ్చన్నారు. మరి కేసిఆర్‌ కట్టిందేమిటీ! ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పనులలో భాగంగా కాలువల తవ్వకాలు కూడా 85 శాతం పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. ఇదంతా దాదాపు 35 వేల కోట్లతో పూర్తి జరిగేది. అదే సమయంలో తెలంగాణలో వున్న పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడేది. అప్పటి వరకు తెలంగాణలో పెండిరగ్‌లో వున్న ప్రాజెక్టుల పూర్తికి సుమారు. రూ .6500 కోట్లతో ఎక్కడిక్కడ సజీవజల తెలంగాణ ఆవిషృతమయ్యేది. కానీ అందుకు విరుద్ధంగా తుమ్మిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని మాయమాటలు చెప్పి కాళేశ్వరం తెరమీదకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మాణం చేయాలో అధ్యయనం చేయడానికే రూ. 6కోట్లు ఖర్చు చేశారు. అంటే తెలంగాణ సంపదను ఎలా నీళ్ళలా ఖర్చు చేయాలనుకున్నారో శాంపిల్‌ చూపించారు. ఆఖరుకు లక్షాఇరవై వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా లక్ష్యాన్ని సాధించారా? అంటే అదీ లేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా వినియోగించుకునే నీరు కేవలం 240 టిఎంసిలు. అందులో 34 టిఎంసిలు పరిశ్రమలకు, మంచినీటి అవసరాలకు కేటాయించారు. మిగిలిన 206 టిఎంసిలు తెలంగాణ మొత్తం ఎలా సస్యశ్యామలమైందో, ఆ లెక్కల మర్మమేమిటో కేసిఆర్‌ కు మాత్రమే తెలియాలి. తెలంగాణ రాక ముందు సుమారు 25 లక్షల పంపుసెట్లు వుండేవి. అందులో పురాతన బావులు, తర్వాత తవ్విన బావులు మొత్తం 7 లక్షలున్నాయి. తెలంగాణలో వున్న మొత్తం సాగుకింద వున్న భూములన్నింటికీ సరిపడ నీరందించేవి. కాళేశ్వరం వచ్చిన తర్వాత భూ గర్భ జలాలు విపరీతంగా పెరిగినట్లైతే బావుల మీద వ్యవసాయానికి అవసరమైన నీరు పుష్కలంగా అందేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల సాగు భూమి కూడా రియల్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే గతం కన్నా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. హైదరాబాదు చుట్టు పక్కల ఎటు చూసినా సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో సాగు మాయమైంది. సాగు నీటి అవసరం లేకుండా పోయింది. మరి కాళేశ్వరం వల్ల కాలువల ద్వారా, భూ గర్భ జలాల ద్వారా సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? కోటిన్నర ఎకరాలు ఎలా సాగయ్యింది. ఈ లెక్కలలో ఏ ఒక్కదానికి పొంతన లేదు. అంటే కాళేశ్వరం వల్ల పెద్దగా ఒరిగింది లేదు. అందుకే కేసిఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే..అని కొత్త రాగం అందుకున్నాడు. రైతులు కొత్త ఆయకట్టు చేపడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చిండు. తెలివిగా కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలని చూసిండు. జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసిఆర్‌. అదే సమయంలో తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్లి, తెలంగాణ ముడుపులు చెల్లించుకునే పూజలు అని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. తాను అనుకున్న సరికొత్త డ్రామాను రక్తి కట్టించేందుకు మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లాడు. రాయలసీమ మీద ప్రేమ ఒలకబోశాడు. అప్పటికే బిఆర్‌ఎస్‌ ఆలోచనలు కేసిఆర్‌ మదిలో మొదలయ్యాయి. రెండు సార్లు వరుసగా గెలవడంతో భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలు పెట్టుకున్నాడు. నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చి కొత్త నాటకం రక్తి కట్టించాడు. కాళేశ్వరం పేరు చెప్పి దేశమంతటా గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. డిస్కవరీ ఛానల్‌ లో దేశంలోని అన్ని బాషలలో కాళేశ్వరం మీద డాక్యుమెంటరీ తయారు చేసి ప్రచారం చేసుకున్నాడు. ఇంతలో టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ గా మార్చుకొని కొత్త రాజకీయం మొదలుపెట్టారు. కానీ అందుకు కాళేశ్వరం సహకరించలేదు. కేసిఆర్‌ కుటిల రాజకీయం కాళేశ్వరమే బైటపెట్టింది. కేసిఆర్‌ ను తెలంగాణ రాజకీయాలకే దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కొత్త నాటకం కేసిఆర్‌ మొదలుపెట్టిండు. ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం, బిఆర్‌ఎస్‌ విస్తరణ కోసం రాయలసీమ సస్యశ్యామలం చేద్దామని కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ సమయంలోనే కేసిఆర్‌ కుటిల రాజకీయం గమనించి కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కేసిఆర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎండగట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వరద జలాల పేరుతో నికర జలాలు నిత్యం 11 క్యూసెక్కులు తరలించుకుపోయే వాళ్లు. ఏపిలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే ఎందుకు మౌనం వహించారు. ఆ సమయంలో జగన్‌తో కయ్యం కాకుండా నెయ్యం ఎందుకు నెరుపుకున్నాడు. అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసిఆర్‌ అన్నది అందరికీ తెలుసు. తెలంగాణ నిధులతో నీళ్లలో నిప్పులు రాజేసి, బనక చర్ల మంటలు రాజేసిందే కేసిఆర్‌. ఉద్యమ సమయంలో ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారన్నది కేసిఆరే. అధికారంలో వున్నప్పుడు రాయలసీమ రైతులు చల్లగా వుండొద్దా! రాయలసీమలో పంటలు పండొద్దా! రాయలసీమ సస్యశ్యామలం కావొద్దా! సముద్రం పాలౌతున్న నీటిని రాయలసీమ వాడుకుంటే తప్పేంటి? రైతులు ఎక్కడైనా రైతులే అంటూ కబుర్లు చెప్పింది కేసిఆరే. ఇప్పుడు మాట మార్చి తెలంగాణకు అన్యాయం జరుగుందని గగ్గోలు పెడుతోంది కేసిఆరే. ఇంతటి ఊసరవెళ్లి లక్షణాలున్న నాయకుడు కేసిఆర్‌ తప్ప ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసిఆర్‌.

తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే. కేసిఆర్‌ అసలు స్వరూపం ఉద్యమ కాలంలో అందరూ చూసిందే! కేసిఆర్‌ రెండు నాలుకల దోరణి బనకచర్ల విషయంలో మరో సారి తేటతెల్లమైంది. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం గతంలో ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు చెల్లదు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. కేసిఆర్‌ వ్యవహార శైలి తెలియంది కాదు. ఇంకా కేసిఆర్‌ను నమ్మేందుకు జనం సిద్ధంగా లేదు. బనకచర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం వుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ బనకచర్లను సమర్థించలేదు. ఎక్కడా ఆహ్వానించినట్లు ఎలాంటి ప్రకటన రాలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు గాయ్‌ గాయ్‌ చేసినంత మాత్రాన అబద్దం ఎప్పుడూ నిజం కాదు. కేసిఆర్‌ మాటలు జనం ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేరు. పదేళ్లలో కేసిఆర్‌ చేసిన విధ్వంసం చూశారు. కాళేశ్వరం పేరుతో ఎలా దోచుకున్నారో తెలుసుకున్నారు. ఎంత అవినీతికి కేసిఆర్‌ కుటుంబం పాల్పడిరదో కళ్ల ముందు కనిపిస్తూనే వుంది. ఇంకా తిమ్మిని బమ్మి చేసే కేసిఆర్‌ కుటిల రాజకీయాలకు కాలం చెల్లింది. బనకచర్ల మీద బిఆర్‌ఎస్‌ మాట్లాడకుంటేనే మంచిది. గురివింజ తన నలుపునెరగదు అన్నట్లు తప్పుల మీద తప్పులు చేసిన కేసిఆర్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అవినీతి చక్రవర్తిగా మారి కోట్లు కొల్లగొట్టిన కేసిఆర్‌ ను వదిలించుకున్నారు. నెత్తిన పెట్టుకున్న ప్రజలనే మోసం చేసిన కేసిఆర్‌ను బండకేసి కొట్టిన జనం మళ్లీ ఆదరించే ప్రసక్తి లేదు. కేసిఆర్‌ ఎంత తాపత్రయపడినా లాభం లేదు. జనానికి అన్నీ తెలుసు. ప్రజలకు కేసిఆర్‌ మోసాలన్నీ తెలుసు.

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

Ketaki

 

 

ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి- ఇరుగురాల భూమేశ్వర్

పెగడపల్లి, నేటిధాత్రి:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర రెడ్డి ఫంక్షన్ హాల్ లో సిపిఐ తోమ్మిదవ మండల మహాసభ జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇరుగురాల భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు సమరశీల పోరాటాలు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పారదర్శకతను పాటించాలని, గత ప్రభుత్వాల విధానాలని ఈకాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్టంగా చొరవ తీసుకోవాలన్నారు. ఒక శతాబ్దం పూర్తి చేసుకున్న పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను చూసిందని, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతుందన్నారు. ఈసుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాట త్యాగాల గుర్తులు ఉన్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో రాచర్ల సురేష్, గుడ్ల శ్రీనివాస్, బొమ్మన శంకర్, బొమ్మన బాబు, దీకొండ రవికుమార్, శ్రీగిరి రాజకుమార్, ఆత్మకూరి రాజేశం, సిపల్లి బాబు, బత్తుల రామకృష్ణ, కోలాపురి హనుమంతు, మల్యాల అంజయ్య, మల్లారపు భూమయ్య, మల్యాల ఎర్రయ్య, నాగవత్ గంగానాయక్, లింగంపల్లి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ లో జరిగిన ఏబీవీపీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు గుజ్జల ప్రేమ్ కుమార్ ని భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా ప్రకటించారు విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో అనేక కృషి చేశారనిఅన్నారు ఈ సందర్భంగా నూతనంగా జయశంకర్ భూపాలపాలి జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన గుజ్జల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క ఈ యొక్క బాధ్యతను ఇచ్చినందున కు రాబోయే రోజులలో అనేక ఉద్యమాలు నిర్వహించి సంస్థాగతంగా జిల్లాలో ఏబీవీపీని బలోపేతం చేసే విద్యార్థి పరిషత్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు నాకు సహకరించిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా జాన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబుకి ధన్యవాదాలు తెలిపారు నూతనంగా ఎన్నికైన సాయి,బంటీ విఘ్నేష్ తదితరులు అభినందనలు తెలిపారు

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలి

కులాలుగా చైతన్యం కావాలి – సమూహంగా ఏకం కావాలి

ఎమ్మార్పీఎస్ ఉద్యమం అట్టడుగు వర్గాలకు కేంద్రబిందువు

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు-బెజ్జంకి అనిల్ మాదిగ

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన కులాల్లో సామాజిక చైతన్యానికి రగిలించిందని అన్నారు. ప్రతి కులం తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి సంఘాల ఏర్పాటు చేసుకొని పోరాట బాటలోకి వచ్చాయని అన్నారు.

 

 

 

వారికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని సహకారాన్ని మంద కృష్ణ మాదిగ అందించారు. అందువల్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. అందులో బాగానే ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పెంపు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించిందని అన్నారు.

 

 

ఈఫలితాలన్ని వర్గాలు పొందుతున్నారని అన్నారు. అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అణగారిన కులాలన్ని ఏకులానికి ఆకులం చైతనమై మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మహజనులుగా ఏకమై తెలంగాణ రాజకీయల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదిశగా అన్ని కులాలు ఆలోచించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించిన నేపథ్యంలో జూలై 7న జరుగు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అన్ని గ్రామాల్లో అన్ని కులాల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

 

ఈకార్యక్రమంలో కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముద్దం నాగేష్, మాజీ ఎంపిటిసి కర్ర బాపురెడ్డి, మాజీ మండల్ పరిషత్ ఉపాధ్యక్షులు సముద్రాల అంజయ్య మాదిగ, కేడిసిసి మాజీ జిల్లా డైరెకట్టర్, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, సముద్రాల శివరామకృష్ణ మాదిగ, దోమకొండ నరేష్ మాదిగ, దోమకొండ గోపి మాదిగ, బొడ్డు రాజేందర్ మాదిగ, పర్లపెల్లి అంజయ్య మాదిగ, లంకదాసరి రాజు మాదిగ, దోమకొండ సుధాకర్ మాదిగ, లంకదాసరి మొండయ్య మాదిగ, లంకదాసరి చెంద్రయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు.

డిహెచ్పిఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచిన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరికి అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని బోయిని అశోక్ అన్నారు. కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈసమావేశంలో అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఇండస్ట్రియల్ లోన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్, చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అశోక్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి గ్రామ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు చేర్పించు కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు పార్నంది రాజకుమార్, బోయిని పటేల్, మహిళ నాయకురాలు శారద ఎస్ నాంపల్లి, అందే సంపత్, అందే వెంకట్, ఏ.పుల్లయ్య, రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత !

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

గుండాల సిఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్,గుండాల ఎస్సై సైదా రహుఫ్,కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
కేసుల కు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్ట్ లు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలోని యువతకు గుండాల సిఐ రవీందర్, కొమరారం ఎస్సై నాగుల్ మీరా వాలీబాల్ కిట్టును అందించారు.ఈ కార్యక్రమంలో గుండాల, కొమరారం పిఎస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి

నర్సంపేట నేటిధాత్రి:

 

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత రైతు భరోసా ఎకరాకు రూ 15 వేలు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా రైతులకు ఎకరాకు రూ 19 వేలు బాకీ ఉన్నదని అట్టి రూపాయలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత
2023 – 24 రబీ లో ఒక్కో ఎకరాకు రూ,2500/- ఇవ్వకుండా మొత్తం
మొత్తం నాలుగు సీజన్లకు కలిపి ఒక ఎకరా ఉన్న రైతు కు రైతు భరోసా రూ.పంతొమ్మిది వేల రూపాయలు బాకీ ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహారాములు, క్లస్టర్ ఇన్చార్జి లు మోతే జై పాల్ రెడ్డి,మోతే పద్మ నాభా రెడ్డి,కోడారి రవి,మోటురి రవి,కందుల రాజి రెడ్డి,సంగెం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌

**ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:


మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలని వాటి వలన కలిగే అనార్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వెంకన్న, భాగ్యశ్రీ, రవీందర్, పద్మ, కొమురల్లి, ఎం ఆర్ సి. సిబ్బంది వేణు, శ్రీనివాస్, శివకుమార్, చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు.

దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని 30 లక్షల రైతుల యొక్క 25వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అలాగే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్ళకు, గుట్టలకు, వెంచర్లకు, రోడ్లకు కాకుండా పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సన్న వడ్లు పండిస్తే క్వింటాల్ కు 500 చొప్పున బోనస్ చెల్లించడంలాంటి పథకాలతో రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం గర్వకారణమన్నారు. ఈ ఘనత దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందిన్నారు. సబ్సిడీలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే..బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టి కేవలం వారి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా సబ్సిడీ ట్రాక్టర్లను ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని తీసుకురావాలనే ఆలోచన క్యాబినెట్ సమావేశంలో తీసుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ..అటు సంక్షేమం..ఇటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ..తెలంగాణ రైసింగ్ నెంబర్ 1 విజన్ 2047తో ముందుకు వెళుతుంటే ఇది ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు వారి స్థాయిని మరిచి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపైన గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గానీ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.

ప్రశాంతతకు దైవచింతన మార్గం.

ప్రశాంతతకు దైవచింతన మార్గం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: ప్రశాంతతకు దైవచింతన మార్గం అని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు.
ఝరాసంగంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ప్రవచనామృతం అందించారు. మహిళలు సీరియల్స్కు బదులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వంటలు చేస్తూ దేవుడి నామస్మరణ చేయడం మంచిదని తెలిపారు. ధనవంతులు పేదలకు దానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

*యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ *

నర్సంపేట నేటిధాత్రి:

 

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి.
నర్సంపేటలో ఐక్య విద్యార్థి సంఘాలు సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల సందీప్,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముక రవి.ఎంఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాధికారులు విఫలమయ్యారన్నారు. విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఇచ్చే మాముళ్ళకు అలవాటు పడి వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. విద్యకు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఉన్న వాటిని అమలు చేయడంలో విద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు బుక్స్ , డ్రెస్సుల పేరుతో వేల రూపాయలను వసూలు చేస్తూ విద్యా కేంద్రాల్లో షాపులు పెట్టి మరి నడుపుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు స్వాతిక,కీర్తన,అలేఖ్య,సిద్దు,ప్రభాస్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్

నర్సంపేట నేటిధాత్రి:

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.
జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్ ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతినిత్యం విద్యార్థులకు సేవలు అందిస్తూ అవినీతిని అంతం చేస్తానని తెలియజేశారు.

error: Content is protected !!
Exit mobile version