మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి.పి.నీరజ ఆదేశాల మేరకు 26 జూన్ 2025 రోజున (ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) సందర్భంగా రాధిక జైస్వాల్ సీనియర్ సివిల్ జడ్జి కం సెక్రటరీ, జిల్లా న్యాయ సేవాదికర సంస్థ సిరిసిల్ల పట్టణంలోని నెహ్రునగర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.
మత్తు పదార్థాల వాడకం ద్వారా ఏర్పడు అనర్థాల గురించి మత్తు ద్వారా చేస్తున్న తప్పులు అటువంటి తప్పులకు పడేటటువంటి శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల న్యాయవాద సంఘం అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మల్లేష్ యాదవ్, రిజర్వ్ ఎస్సై సాయికిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి,నాగుల భాగ్యరేఖ, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం
-గడ్డం కేశవామూర్తికి ఎన్టీఆర్ అవార్డు రావడం హర్షనీయం
-సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంచలన రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డును ఆయన పొందారు. విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రధానం చేసింది.
గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి మెమొంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.
అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు. పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు.
వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం కేశవామూర్తి అన్నకు ఈ అవార్డు రావడం హర్షనీయమని, జర్నలిస్టులకు ఎంతో గర్వకారణమని, ప్రస్తుతం రాణిస్తున్న జర్నలిస్టులకు ఆయన స్ఫూర్తిదాయకమని సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ ఆయన సేవలను కొనియాడారు.
డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం ఉదయం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ న్యాయమూర్తి, డి. ఎస్. పి సైదా, ఆర్డీవో, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గంట్లకుంటా గ్రామంలో పల్లెబాటలో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..
పెద్దవంగర మండలంలోని గంట్లకుంటా గ్రామంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై, వారి జీవన పరిస్థితులు, అవసరాలు, సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు..
గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తాగునీటి సమస్య, పింఛన్లు, రోడ్ల పరిస్థితులు, ఆరోగ్య సదుపాయాలపై తమ అభ్యర్థనలు వివరించారు..
ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. గంట్లకుంటా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చూపిస్తున్న ఆదరణ, విశ్వాసం నా బాధ్యతను పెంచింది. ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. రహదారులు, నీటి సౌకర్యాలు, ఆరోగ్య కేంద్రం వంటి మౌలిక వసతులపై కృషి కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలి. మనకు అభివృద్ధి కావాలంటే మన పార్టీకి ఓటు వేయాలి. నేడు మీరు చూపిన ప్రేమను రేపు ఓటుగా మార్చాలి. ఈ పల్లెబాట ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే లక్ష్యం..
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా నాయకత్వం నిరంతరం శ్రమిస్తోంది. ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి పథంలో నడవాలి అనేది మా పార్టీ సంకల్పం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, యువత, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. పల్లెబాట పర్యటన ప్రజల ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది..
పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ విధిగా దోమ తెరలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.అంతేకాకుండా సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజంలోని పేదలకు,అభాగ్యులకు అండగా నిలవడానికి అందరికి అవకాశం ఉందని కాబట్టి సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అలాగే పేద గిరిజనుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రజల అవసరాలను సీజనల్ వారీగా గుర్తిస్తూ విశిష్ట సేవలందిస్తున్న ఫౌండేషన్ వారిని ప్రతేక్యంగా అభినందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని దోమ తెరలతో ఆరోగ్యానికి భరోసా అని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రశ్నిస్తే దాడుల జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తున్నాం
గండ్ర యువసేన అధ్యక్షుడు, గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గండ్ర యువసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తదితర విషయాలలో జరిగిన అవినీతి గురించి పత్రికల్లో వార్తలు రాశాడని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే దాడులు చేయడం మానుకోవాలని , దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష్య సాధింపు చర్యలు మానుకొని, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని , ప్రశ్నిస్తే దాడులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు
రాష్ట్రమంత్రి సీతక్క చేతు ల మీదుగా అవార్డు ప్రధా నం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కానిపర్తి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు,సంచలన రాజ కీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావుస్మారక అవార్డు పొందారు. విజయ వాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్ర సాద్ తో పాటు గడ్డం కేశవ మూర్తికి ఈ అవార్డును ప్రధా నం చేసింది.
గురువారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదు గా అవార్డును అందుకున్నా రు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించి మెమొంటోతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో జర్నలిస్టు గా పనిచేస్తున్న కేశవమూర్తి ఇప్పటి వరకు అరడజన్ పుస్తకాలను స్వయంగా రచించి ప్రచురించారు.
అలాగే 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీలను రాసి జనసారథులు పేరిట పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ లలో కూడా ప్రధాన భూమిక పోషించారు. మూడేళ్లపాటు వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట పురస్కారంతో పాటు జాతీయస్థాయిలో అనేక అవార్డులను కేశవమూర్తి పొందారు.
పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవార్డు ప్రధానంతో జర్నలిస్టు రంగానికి కేశవమూర్తి మరింత గౌరవం తీసుకువచ్చారని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పాత్రికేయులు వ్యాఖ్యానించారు. వరంగల్ వాయిస్ ఎడిటర్ కేశవమూర్తికి ఈ అవార్డు లభించడం పట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రజాప్రతినిధులు, రాజకీయ వేత్తలు, అధికారులతోపాటు, జర్నలిస్టులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
వనపర్తి లో అవసరం లేని చోట సిసి రోడ్ల నిర్మాణం పై అధికారులపై ఏ సీ బీ అధికారులకు ఫిర్యాదు
ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి నెటిదాత్రి :
వనపర్తి పట్టణంలో మున్సిపల్ టి యు ఎఫ్ యూ డి సి ప్రభుత్వ ని లతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం అవసరం లేని చోట వేస్తున్నారని మంచిగా ఉన్న రోడ్లను తొలగించి ప్రభుత్వ నిధులతో సి సి రోడ్లు వేయించి అభివృద్ధిని పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారని అదేవిధంగా సిసి రోడ్లు నాణ్యతగా వేయడం లేదని అధికారుల పర్యవేక్షణ కాంట్రాక్టర్ పర్యవేక్షణ లేదని వర్షంలో కూడా సిసి రోడ్డు వేయడం వల్ల నాణ్యత కోల్పోతుందని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 630 99 76 569 విలేకరులకు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం నూతన కాలువ ల నిర్మాణం వాటిపై సందర్శించామని ఆయన పేర్కొన్నారు అధికారుల అవినీతి కాంట్రాక్టర్ చిన్న చోటా నాయకుల జోబులు నింప డానికి సీసీ రోడ్డు మురికి కాల్వలు ఓంకర టింకర నాసిరకంగా కట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి లో ప్రభుత్వ సొమ్ము అధికారుల జేబుల్లోకి చోటా నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని సాక్షాదా రా లతో అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల తరఫున హ్యూమన్ రైట్స్ చీఫ్ సెక్రటరీ ఏసీబీ సిఎండిఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజా భవన్ హైదరాబాద్ కు ఫిర్యాదు చేస్తామని చేస్తామని ఆయన తెలిపారు . ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ చోటా నాయకులకు జేబులు నింపుతూ వనపర్తి పట్టణ అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సి సి రోడ్లను నూతనంగా నిర్మించే కాలువలను తనిఖీ చేసిన వారిలో జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ గౌనికాడి యాదయ్య కొత్త గొల్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ రామస్వామి కురుమూర్తి రాము వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ మందమర్రి: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం మరియు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు.
సింగరేణి జీఎం దేవేందర్ మాట్లాడుతూ, “చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు అనే మహమ్మారి నుండి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని అన్నారు.
మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి,” అని కోరారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శంకర్ పల్లి వద్ద భయభ్రాంతులు: రైళ్ల రాకపోకలకు విఘాతం
శంకరపల్లి, నేటి ధాత్రి
శంకర్ పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందీ శంకర్ పల్లి రైల్వే స్టేషన్.
శంకర్‌పల్లి- నాగులపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ లెక్క చేయలేదు.శంకర్ పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో ఆమెను గమనించిన స్థానికులు శంకర్ పల్లి, నాగులపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కారును వెంబడించారు.
కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. చివరికి నాగులపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు. దీన్ని సీజ్ చేశారు. దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. బెంగళూరు- కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లల్లో ఆపివేశారు.ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. రైల్వే ఆస్తులను ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందు వల్ల సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఉత్తమ సమాజ నిర్మిద్దాం విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి : ఎస్సై రాజు మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
వర్దన్నపేట (వరంగల్ జిల్లా ) ,నేటిధాత్రి:
వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా (యాం టీ డ్రగ్ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా వెస్ట్ జోన్ జనగాం, మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండ్ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించే ర్యాలీ విద్యార్థులు, పోలీస్ అధికా రులతో కలిసి ఇవాళ (గురువారం) నిర్వహించబడిరది. ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింప చేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం-మనందరి బాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు.డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపుని చ్చారు . అనంతరం వారు మాట్లడుతూ. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ , ఎస్సై రాజు , పోలీస్ సిబ్బంది, విద్యార్థులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పంచాయితీ కార్యదర్శులకు డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ.
నర్సంపేట,నేటిధాత్రి:
గ్రామ పంచాయితీల పరిధిలోని వివిధ రకాల పన్నులు వంద శాతం వసూల్ చేయాలని నర్సంపేట డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.గురువారం దుగ్గొండి మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి కే రాజీవ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్లు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ రికార్డులన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి దగ్గరలోని అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఓ వెంచర్ లో అక్రమాలు జరిగాయని గురువారం కలెక్టర్ కు రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య ఫిర్యాదు చేశారు. సర్వే నెం. 102లో 2ఎకరాలు, సర్వే నెం.105లో 0.20 గుంటల భూమి కబ్జా చేశారని ఫిర్యాదులు తెలిపారు. ఆక్రమణకు గురైన భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ. 4 కోట్ల విలువ ఉందని అక్రమంగా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన వెంచర్ యజమాని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థినీ విద్యార్థులకు మందమర్రి పోలీస్ అధికారులు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రుల పిల్లలకు సూచించారు గంజాయి మత్తులో పడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇటువంటి అరాచకాల్ని అరికట్టడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి, సింగరేణి జిఎం, లైన్స్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బిల్డింగ్ తండా గ్రామంలో MGNREGS నిధుల కింద మంజూరైన రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి గ్రామానికి పంచాయతీ భవనం ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని, గ్రామపంచాయతీ భవనం గ్రామ అభివృద్ధి ప్రజల అవసరాలను తీర్చే దిశగా గ్రామపంచాయతీ కార్యాలయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనతో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే.ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, దత్తాత్రేయ, తిరుపతి, కె.ఎస్.ఆర్ వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.
బెల్లంపల్లి నేటిధాత్రి :
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సమావేశం కామ్రేడ్ భాశెట్టి గంగారం భవన్లో గురువారం రోజున ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు పరచాలి అని ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్నవ మారనా హోమాన్ని వెంటనే రద్దు చేసుకొని వారితో శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలి, గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ పోరు భూములను పట్టాలు ఇవ్వాలి అలాగే ఎన్నిక హామీల్లో భాగమైన పేద వర్గాల కు నూతన రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో ఉన్న బొగ్గు గనుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంటికి రాయి యాజమాన్యం చెల్లించాలి, బొగ్గు గాని కార్మికులకు సొంత ఇంటి పథకంలో భాగంగా రెండు గంటల భూమి వారికి సంబంధించిన బడ్జెట్ సపోర్ట్ ను యాజమాన్యం కల్పించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు మంచిర్యాల జిల్లాలో బలమైన నిర్మాణం కలిగి ఉన్న నేపథ్యంలో పార్టీ ఆఫీసు కు జిల్లా కేంద్రంలో ఒక ఎకరం భూమి కేటాయించాలి 2024. 25 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి గని కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించాలి.
సింగరేణి నూతన బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, బెల్లంపల్లిలో బస్సు డిపోను నిర్మించాలి అని అన్నారు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ సిపిఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య పట్టణ కార్యదర్శి ఆడపుq రాజమౌళి, సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ , జిల్లా సభ్యులు గుండా చంద్రమాణిక్యం, డి ఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, సీనియర్ మహిళా కామ్రేడ్ గుండ సరోజ, బొల్లం సోని, బియ్యాల ఉపేందర్, కొండు బానేష్, అక్కేపల్లిబాబు సార్, రత్నం రాజం ,తిరుపతి గౌడ్, మంతెన రమేష్, బండారి శంకర్, బోర్ల సమ్మయ్య, గోలేటి రాజలింగు, నస్పూరి తిరుమలేష్, గుండ ప్రశాంత్, అంబాల ప్రభుదాస్ నస్పూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వాపురంపాడు వలస ఆదివాసి గ్రామము మరియు అనంతారం గ్రామము లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రాం అనంతరం యువతకు వాలీబాల్సు మరియు వారి కుటుంబాలకు దోమతెరలను (ఎన్జీవో సహకారంతో) అందించిన తర్వాత ఏడుల్లబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్య క్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ శాంతి దీక్ష (శాంతియుత నిరసన) అనుమతి కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో పెట్టి నటువంటి హామీలు నెరవేర్చా లని ఉద్యమకారులకు ఇచ్చి నటువంటి హామీలను నెర వేర్చాలని ఈనెల 30న మండల కేంద్రంలో శాంతి దీక్ష ఒక రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం హను మకొండ జిల్లాఅధ్యక్షుడు పొడి శెట్టిగణేష్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారిసురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గిద్దమారి రామన్న, జిల్లా నాయకుడు గంట శ్యాం సుందర్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శిచల్లాశ్రీనివాస్ రెడ్డి శాయంపేట మండల నాయ కులు ఎండిరఫీ తుమ్మ ప్రభా కర్ ,దుంపల మహేందర్ రెడ్డి,మండల కోశాధికారి కాను గుల నాగరాజు, దూదిపాల జోగిరెడ్డి పాల్గొన్నారు.
వనపర్తి ఆవోప ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పట్టణ ఆ వో ప ఆధ్వర్యంలో గోపాల్పేట్ మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా చాకల్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశామని వనపర్తి పట్టణ అవపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవోప ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా ప్రతి సంవత్సరం బ్యాగులు పంపిణీ చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఆవోప ప్రధాన కార్యదర్శి ఎల్ రవికుమార్ ఆర్థిక కార్యదర్శి సంబు వెంకటరమణ పట్టణ ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు గోనూరు వెంకటయ్య ప్రసాద్ రావు కటకం శ్రీధర్ భాస్కర్ శివ బాలేశ్వర్ పోలిశెట్టి మురళి కండే భాస్కర్ రత్న కుమార్ దోమ శివ సాయి నాగరాజ్ బి పరమేశ్వర్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు .ఈ మేరకు వనపర్తి పట్టణ అవో ప వారికి ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు TGSWR గురుకుల కళాశాల చిన్న బోనాల నందు డిజిటల్ పేమెంట్స్ మరియు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి జయరాజ్ మాట్లాడుతూ ,బ్యాంకింగ్ సేవలను సులభంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అని,యూపీఐ పేమెంట్,ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం లావాదేవీలను వినియోగించుకోవాలని అన్నారు.అలాగే వెంకటరమణ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ బెట్టింగ్ అప్స్,లెండింగ్ అప్స్,ఫేక్ వెబ్సైట్లు ,డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని రకాల లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి అన్నారు.సైబర్ నేరానికి గురైతే 1930 కాల్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు అధికారులు అబ్దుల్ రెహమన్ గారు,జిల్లా లీడ్ బ్యాంకు అధికారి మల్లికార్జున్ ,కళాశాల ప్రిన్సిపాల్ జసిమిన్ థెరిస్సా ,ఆర్ధిక అక్షరాస్యత కౌన్సిలర్స్ పాల్గొనడం జరిగినది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.