బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలల పురోగతికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు
మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వాటిని ఎంఈఓ కార్యాలయం లో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వినతి పత్రంను ఎంఈఓ అందుబాటులో లేనందున కంప్యూటర్ ఆపరేటర్ మామి డి రజిత పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అంద జేశారు.

 

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో గోడలకు పెచ్చులు ఊడిపోయి శిధిలా వస్థకు చేరుకున్నాయి వాటిని పునర్మించాలని మరియు కంప్యూటర్ క్లాసులు చెప్పా లని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకోవ డానికి ఆటస్థలం ఏర్పాటు చేయాలి కోతుల సమస్యల నుండి విముక్తి కల్పించాలి కంప్యూటర్ క్లాస్ లను నేర్పిం చాలి మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ బాల,బాలికల పాఠశాలలు ఎందుకని విద్యా ర్థుల సంఖ్య తక్కువ ఉన్నం దున ఒకే దగ్గర తరగతులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ ,బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పురాణం చంద్రశేఖర్, బిఆర్ ఎస్వి జిల్లా నాయకులు అంబాటి అఖిల్ పాల్గొన్నారు

చదివిన పాఠశాలపై మమకారంతో.!

చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి

-తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య దంపతుల కుమార్తె నాగరాణి నిరుపేద కుటుంబంలో పుట్టింది. పేదరికం చదువుకు అడ్డం కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. చిన్నప్పటినుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యనభ్యసించింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుమారునికి అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే క్రమశిక్షణకు నిలయాలని, మనం కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిరిపూరి నాగరాణి నిరూపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మిరిపూరి నాగరాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటపల్లి మహేష్, ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, సునీతా దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజన పథకం,ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చిన్న కిష్టాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాటోత్ ప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, సర్వన్ తండ, ఎస్ టీ కాలనీ, మంగలి తండ గ్రామాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శనగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా జాటోత్ ప్రసాద్ మాట్లాడుతూ, నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, యువతి, యువకులు తమ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా చైతన్య పరచాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సయ్య, కిరణ్, గ్రామ యువకులు ఎం. సురేష్, అంగన్వాడీ టీచర్ లు మాలోత్ నీలా దేవి, బోడ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version