డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్

రాయికల్ , జూలై 30, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా ఉండాలి. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు. బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అని మరియు మన భారతదేశం ను డ్రగ్స్ లేని సమాజంగా మనమంతా కలిసి నిర్మిద్దాం. మీ దృష్టికి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి లేదంటే డయల్ తెలంగాణ పోలీస్ 112 కాల్ చేసి సమాచారాన్ని తెలపండి. అలాగే మిలటరీ జాబ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మా సైనిక గ్రూప్ అండగా ఉంటుంది అని జగిత్యాల ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇటీవలే ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారి భూపతిపూర్ గ్రామానికి చెందిన నూకల మల్లేశం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి, మాజీ సైనిక అధికారి నూకల మల్లేష్, పోలీస్ కానిస్టేబుల్ మనోజ్, శ్రీ నేతాజీ యూత్ అధ్యక్షులు అస్లాం,నరేష్, మధు, రాజేందర్, వేణుగోపాల్, కే.శేఖర్, రాజశేఖర్, వినయ్, లెక్చరర్ బృందం పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం ఉదయం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ న్యాయమూర్తి, డి. ఎస్. పి సైదా, ఆర్డీవో, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం:

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్
గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ
మందమర్రి: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.

 

 

 

 

ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.

 

 

 

 

ఈ సందర్భంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం మరియు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు.

 

 

 

సింగరేణి జీఎం దేవేందర్ మాట్లాడుతూ, “చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు అనే మహమ్మారి నుండి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని అన్నారు.

 

 

 

మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి,” అని కోరారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 

 

 

 

ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్ నేతృత్వంలో (బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సబ్ స్టాన్స్ అబూస్ ఆర్ వన్ బ్యాడ్ ఛాయిస్ కాన్ చేంజ్ ఏ లైఫ్) అనే నినాదాలతో స్థానిక జడ్.పి. హెచ్.ఎస్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మాబ్ (నృత్య ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన పొత్కపల్లి సెంటర్లో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అవగాహన సభలో ఎస్పై రమేష్ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకాన్ని యువత ఫ్యాషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ఇది భవిష్యత్తును నాశనం చేస్తుంది. మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మార్గనిర్దేశం చేయాలి,” అని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి. ‌

*మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*. ‌

**ఎంఈఓ లింగాల కుమారస్వామి ** ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:


మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఎంఈఓ లింగాల కుమారస్వామి ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ. విద్యార్థులు మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, స్మోకింగ్, మద్యపానంతో ఎంతో అన్నార్దాలు జరుగుతున్నాయని మాదక ద్రావ్యాల నిర్ములనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలని వాటి వలన కలిగే అనార్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వెంకన్న, భాగ్యశ్రీ, రవీందర్, పద్మ, కొమురల్లి, ఎం ఆర్ సి. సిబ్బంది వేణు, శ్రీనివాస్, శివకుమార్, చంద్రమౌళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్

విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు

చదువుతూనే మీ భవిష్యత్తు

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మూలధనం

విద్యార్థులకు చదివే నీ గమ్యానికి నిచ్చిన

చదివే జ్ఞానం పెంచుతుంది

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో
ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ మత్తును కలిగించే మారక ద్రవ్యాలను వాడకూడదని వాటిని వినియోగిస్తే కలిగే అనర్థాలు ఎంతో వివరించడం జరిగింది. ఆర్ధిక మోసాలకు కారణమైన అనవసరపు మెసేజ్ లు, వాటి లింకులు ఓపెన్ చేసి రిప్లై ఇస్తే కలిగే ఆర్ధిక నష్టాల పట్ల అవగాహన
కలిగించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ.తిరుపతి మాట్లాడుతూ
విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని చదువుకోసం కేటాయించి గొప్ప ప్రయోజకులు కావాలని అందుకోసం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మారక ద్రవ్యాలు వినియోగిస్తే మన శరీరంపై కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన .

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన

రామడుగు  నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల ట్రైనీ ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ వద్ద మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనీ ఎస్సై సతీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన ముఖ్యంగా యువతపై కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలను వివరించారు. అలాగే మత్తు పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల నివారణ చర్యలలో భాగంగా ఆప్రాంతంలో కుక్కల బృందంతో (డాగ్ స్క్వాడ్) తనిఖీ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి

డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
* జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి. గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రస్తుతం క్రాప్ కటింగ్ పరిశోధనలు జరుపుతున్నారని, వీరితో సమయం చేసుకుంటూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలో ముగుస్తున్నందున పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎం.పి.డి.ఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు.జిల్లాలో ఉన్న బార్లు, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు. బార్ నిర్వాహకులతో వాట్స్ అప్ గ్రూప్ తయారు చేయాలని ప్రతి రోజూ ఎప్పుడు మూసి వేస్తున్నారో సమాచారం అందించాలని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అవగాహన కార్యక్రమాల్లో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు. డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని వైద్యారోగశాఖ అధికారికి సూచించారు. కళాశాలలో సడన్గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇటుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనిఅన్నారు.
ఎస్పీ మహేష్ బి.గీతే మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని, డ్రగ్స్ చిన్న సంఖ్య లో ఉన్నా కూడా తప్పనిసరిగా సీజ్ చేయాలని, జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ బంద్ చేయాలని అన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో వైన్ షాప్ ఉండకుండా చూడాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, మా దగ్గర అవసరమైన మేర డ్రగ్స్ నిర్దారణ కిట్లు, నార్కోటిక్స్ గుర్తించే డాగ్స్ అందుబాటులో ఉన్నాయని వెంటనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్స్, హ్యాండ్ బుక్ లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి , అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష,విద్యా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్.

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

వరంగల్, నేటిధాత్రి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఈద శ్రీనాథ్, నాగపురి నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version