బాల్యం పై పుస్తకాల భారం…?

బాల్యం పై పుస్తకాల భారం…?

పెరుగుతున్న బడి పుస్తకాల బరువు…

కిలోల కొద్ది బరువును విద్యార్థుల వీపునకు తగిలిస్తున్న వైనం…

పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుందా?..

బరువుకు మించిన బడి సంచి…

విద్యార్థులకు తప్పని తిప్పలు…

అమలు కానీ నో బ్యాగ్ డే…

పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి…

నేటి ధాత్రి

 

 

 

-మహబూబాబాద్ -గార్ల :- ప్రైవేటు,కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడితో కూడిన విద్య బోధనతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.అడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్త కాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది.ఏటా పై తరగతికి వెళ్తుంటే, పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది.

 

 

 

 

 

ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు,బ్యాగు నిండా పుస్తకాలతో నాలు గైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలా మంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యల తో సతమతమవుతు న్నారు.విద్యార్థులకు గుణాత్మక నైపుణ్యత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం చెబుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు.పుస్తకాల భారం తగ్గించాలని,2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ప్పటికీ,వాటిని అమలు చేయడం లేదు,దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.

 

 

 

 

మరోవైపు పిల్లలపై పుస్తకాల భారం వలన వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.పాఠశాల బ్యాగుల బరువు, తరగతి గదిలో అవసరమయ్యే పుస్తకాల సంఖ్య, ఇంటి వద్ద చదవాల్సిన హోంవర్క్ పుస్తకాల పరిమాణం అన్నీ కలిపి పిల్లలపై అధిక భారాన్ని పెంచుతున్నాయి.బరువైన పుస్తకాలు మోయడం వలన వెన్నునొప్పి,కండరాల నొప్పులు, భుజాల నొప్పి వంటి శారీరక సమస్యలు వస్తాయి. పుస్తకాల భారం పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

 

 

 

 

చదువుపై ఏకాగ్రత తగ్గడం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.అవసరం ఉన్న లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి కిలోల కొద్ది బరువులను విద్యార్థుల వీపునకు తగిలిస్తున్నారు. పోటీ చదువుల పేరిట అటు తల్లిదండ్రులు,ఇటు పాఠశాల యాజమాన్యాలు పిల్లలపై పుస్తకాల భారం మోపుతున్నారు.ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులు ఇష్టమొచ్చినట్లు పుస్తకాలు అంటగడుతున్నారు.

 

 

 

 

 

దీంతో పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారనుంది. పాఠశాలలు పుస్తకాల సంఖ్య తగ్గించాలి అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేలా ఆయా పాఠశాలల్లో ర్యాక్స్ ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలల్లోనే ఉంచుతూ,హోంవర్క్ పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని విద్యావంతులు, మేధావులు,ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. పిల్లలకు పుస్తకాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా విద్యాబోధన ఉండాలని ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం…

బాల కార్మిక వ్యవస్థ చిట్టి చేతులను చిత్రహింసలు పెడుతుంది…

భారమైన శ్రమకు బలైపోతున్న బాల బాలికల చేత పలక బలపం పట్టించాలి…

పిల్లల బంగారు భవిశ్యత్తు కు బాటలు వేద్దాం…

పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి…

చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలి…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి…

నేటి ధాత్రి:

మహబూబాబాద్-గార్ల:-ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి,కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు,పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే.పరిశ్రమలు, వ్యవసాయం, ఇటుక బట్టీలు,నిర్మాణ రంగం, కర్మాగారాలలో,హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, బిక్షాటన, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు.పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు.ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం,ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు.నేటి బాలలే రేపటి పౌరులు,చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలు,కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోంది.బాలకార్మిక వ్యవస్థ చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోంది.బాల కార్మిక వ్యవస్థ తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాలల శారీరక,మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాల కార్మిక వ్యవస్థ అంటాము.అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశ నికే పరిమితం కాలేదు.అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాల కార్మికులు ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాల కార్మికులు ఉంటే, 2012 ముగిసే నాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాల బాలికల జనాభాలో పదకొండు శాతం మంది బాల కార్మికులే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బాల కార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహారన్ ఆఫ్రికాలో ప్రతి ఐదుగురు బాలబాలికల్లో ఒకరి కంటే ఎక్కువమంది బాల కార్మికులు ఉంటున్నారు. మొత్తం బాల కార్మికుల్లో 85 మిలియన్లు అంటే 5.4% మంది ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక శాతం మంది బాల కార్మికులు ఉన్నారు. ఈ రంగంలో అత్యధికంగా 98 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ఆర్థిక మంద్యం, సంక్షోభం వల్ల బాల కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా బాల కార్మికుల సంఖ్య పతనమైంది. దీనికి కారణం బాల కార్మికులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక మంద్యం, సంక్షోభం ప్రభావాలు స్వల్పంగా ఉండటం ఒక కారణమైతే, మాంద్యం సమయంలో బాల కార్మికులకు ఉపాధి లభించకపోవడం మరో కారణం. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 ఏళ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాల బాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో బాల కార్మికులుగా ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. 2009-10లో 5-14 ఏళ్ల వయసున్న బాల కార్మికుల సంఖ్య 49. 84 లక్షలు. ప్రతి పదిమంది బాల కార్మికుల్లో 9మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు శారీరక హింసకు గురవుతున్నారు. దాదాపు 50 శాతం మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు. బాల కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు. కాబట్టి వారికి హక్కులు, కనీస వసతులు మృగ్యమవుతాయి. తేలిగ్గా మోసానికి గురవుతారు. వారికి కష్టానికి తగ్గిన వేతనం లభించదు. శ్రమ దోపిడీకి గురవుతారు.నిర్దిష్ట పనిగంటలు లేవు. పరిశ్రమలు,హీనమైన, హెయమైన వాతావరణంలో బాల కార్మికులు పనిచేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు హోటల్లో, దుకాణాలలో, గృహాలలోను సేవకులుగా పనిచేస్తున్నారు.వారి శక్తికి మించి అధిక గంటలు పని చేస్తూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలు పెద్ద పెద్ద బరువులు మోస్తుంటారు. తరచుగా గాయపడుతుంటారు. కొంతకాలానికి పూర్తిగా శక్తిని కోల్పోతున్నారు. శ్వాస కోస వ్యాధులతో బాధపడుతున్నారు. తివాచీ పరిశ్రమల్లో పనిచేసే బాలలు కంటి చూపు కోల్పోతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే బాలలు ప్రమాదాలకు గురవుతున్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలి. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. బాల కార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. ఈ చట్టాలు అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం ఉండాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించాలి. భారమైన శ్రమకు బలైపోతున్న బాలబాలికల చేత పలక బలపం పట్టించాలి. బాల కార్మిక వ్యవస్థ బాలికల అక్రమ రవాణా,బాల్యవివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు సహకరించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలోని ప్రతి పౌరుడు ముందుండాలి,బాల కార్మికులకు విముక్తి కల్పించాలి.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,డిజిటల్ బోధన,యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం,అటల్ టింకరింగ్,ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు.వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా బాత్రూములతో పాటు వివిధ వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాలను సహా వివరంగా వివరించడంతో పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ముందస్తు బడిబాట కార్యక్రమం.

ముందస్తు బడిబాట కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహి స్తున్నారు. మంగళవారం హెడ్మాస్టర్ నాగ సుభాషిని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగారు. బడి ఈడు పిల్లల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు ఉచితంగా దుస్తులు, నోట్ పుస్తకాలతో పాటు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంధ్యారాణి, రమేష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం.

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
(నేటి ధాత్రి)
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం

 

 

 

అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం పొందిన దౌపాటి మహేష్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. అడ్డగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10, పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.30 వేల నగదును సేకరించి అందుబాటులో ఉన్న స్నేహితులు బుధవారం మృతుడి తల్లికి అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు దౌపాటి మహేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మల్లేష్, పయ్యావుల రమేష్, గూడెపు నరేష్, తాడోజు లక్ష్మణా చారి,కత్తుల నరేష్,చుక్క లోకేష్,తోట నగేష్, బాలెంల శంకర్, కప్పల మహేష్ పలువురు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version