ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

FLN ద్వారా విద్యార్థులకు బోధించాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలంలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా భోజనం చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతగా వండించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ లేఔట్ లు

నోటీసులకే పరిమితమైన అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 16:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, అక్రమ కట్టడాలు ఒకవైపు ఉంటే మరోవైపు అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, అధికారులు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమై పూర్తిస్థాయిలో అరికట్టడంలో విఫలమయ్యారు,ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమాలు చేస్తుంటే నోటీసులు ఇస్తుంటే ఉంటే లాభం ఏమిటి అని ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు రూపంలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ఇందుకు కారణం రాజకీయ ఒత్తుల్లా ? లేక ఏదైనా ప్రలోభాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి, ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలంలో దాదాపు 20 నుంచి 25 లేఔట్ లు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా వేశారు,
అయిన కూడా అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు అంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది, ఇదే క్రమంలో భాగంగా ఈ విషయంపై గంగవరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వివరణ కోరగా అక్రమ కట్టడాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినా కూడా నిర్లక్ష్యప్రయంగా నిర్మిస్తున్నారని వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని
ఈ సందర్భంగా ఆయన
తెలిపారు,అదే విధంగా లేఔట్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చామని వారిపై కూడా ప్రభుత్వ నియమాల పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు,ఏది ఏమైనా అగ్రికల్చర్ భూములను మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా కమర్షియల్ గా మార్చుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అగ్రికల్చర్ భూములన్ని లేఔట్ గా మారి పూర్తిస్థాయిలో వ్యవసాయం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా గంగవరం మండలం పై అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి, అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు నిర్మించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది,
మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది…

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
(జమ్మికుంట: నేటిధాత్రి)
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి సందర్శించారు ఆస్పత్రులోని రికార్డ్స్ పరిశీలించారు అన్ని వార్డులను సందర్శించి రోగులతో సమస్యలపై మాట్లాడారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పనితీరును రోగులతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు భరోసా కల్పించే విధంగా వైద్యం అందించాలని జవాబుదారితనంగా పనిచేయాలని ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించే విధంగా వైద్యులు అలాగే సిబ్బంది మెదులుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ కు సూచించారు.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

చాలా అద్భుతంగా అనిపించింది నిత్యా మీనన్

 

చాలా అద్భుతంగా అనిపించింది నిత్యా మీనన్

నిత్యామీనన్ (Nithya Menon) వరుస సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘తలైవాన్, తలైవి (Thalaivan Thalaivii) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 25న థియేటర్స్లోకి రాబోతుంది. ఈ సినిమాతో పాటు నిత్యామీనన్, ధనుష్ (Dhanush )సరసన ‘ఇడ్లీ కడై’ (Idli Kadai)లోనూ నటిస్తోంది. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఇడ్లీ కడాయి సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను.

పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని షూటింగ్ సెట్లో అడగ్గానే ఎందుకు చేయను అని రంగంలోకి దిగా. నా జీవితంలో ఫస్ట్ టైమ్ పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు తయారుచేసు. ఆ మరునాడే నేను జాతీయ అవార్డును తీసుకోవడానికి వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అది చాలా అందంగా ఉంది. అప్పుడు నాకు సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నారు. ‘ఇడ్లీ కడై’ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేది కాదు” అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెగా హీరో.. క్యూట్ కపు అంటూ కామెంట్స్

 

మెగా హీరో.. క్యూట్ కపు అంటూ కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) టాలీవుడ్ క్రేజీ జంటలలో ఒకటి. వీరిద్దరు సీక్రెట్గా ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. నవంబర్ 1, 2023లో వాళ్ళిద్దరి వివాహం జరిగింది. ఇక ఈ కపుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట బాగా వేకెషన్స్కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

వాటిని సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉన్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ఈ జంట వేరే దేశంలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘సూర్యాస్తమయ మానసిక స్థితి’ అనే క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు.

ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి

మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి- పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని, చిగురుమామిడి మండలంలో సీపీఐ పూర్వవైభవం కోసం మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మండలంలోని ఇందుర్తి గ్రామంలో గల అమరజీవి కూన ముత్తయ్య స్మారక భవన్ సీపీఐ కార్యాలయంలో ఇందుర్తి రెవిన్యూ పరిధిలోని రెండు ఎంపీటీసీ స్థానాల గ్రామాలైన ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లె, గునుకులపల్లె గ్రామాల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం సీపీఐ ఇందుర్తి గ్రామశాఖ కార్యదర్శి ఎం.డి.ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది. చిగురుమామిడి మండల కేంద్రంలోని అమరజీవి ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో చిగురుమామిడి ఎంపీటీసీ స్థానం సమావేశం అల్లేపు జంపయ్య అధ్యక్షతన జరిగింది. సుందరగిరి ఎంపీటీసీ స్థానం సమావేశం మావురపు రాజు అధ్యక్షతన జరిగింది. లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల ఎంపీటీసీ స్థానం సమావేశం కయ్యం తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరుగా ఉన్న చిగురుమామిడి మండలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు సైతం కోల్పోయారని, ఈప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వారంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వారి, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని వారి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకు పోవడం కోసం మండలంలో ఎర్రజెండాను ఎగురవేసి తిరిగి గత వైభవం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై నాయకులపై ఉందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం కోసం పార్టీ నాయకత్వం ముందుండాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ ప్రజాపతినిధులు గ్రామ, మండల స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం, ఈప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేసినట్లుగా లేవని, ఆయా పార్టీ నాయకులకే, కార్యకర్తలకే పథకాలు అందాయని, అర్హులైన వారికి అందలేదని, కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే పేదలకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని, న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ఈసమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి బూడిద సదాశివ, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, గ్రామశాఖ కార్యదర్శులు ఎం.డి.ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, అల్లేపు జంపయ్య, ఎలగందుల రాజు, కయ్యం తిరుపతి, బోట్ల పోచయ్య, నాయకులు కూన లెనిన్, రాకం అంజవ్వ, గంధె కొమురయ్య, తాల్లపెల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో
విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

సీఎం రేవంత్ రెడ్డి, దొంతి చిత్రపటానికి క్షీరాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి, దొంతి చిత్రపటానికి క్షీరాభిషేకం.

#ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తే లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో బిల్లు వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా గ్రామానికి చెందిన బాధావత్ మౌనిక సుమన్ ఖాతాలో లక్ష రూపాయలు జమ కావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ కూడలిలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల 10 సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేసి అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసి నిర్దిష్ట సమయంలో వారి ఖాతాలో డబ్బులు జమ చేయడంతో గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు లబ్ధిదారులందరూ ఇండ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చార్ల శివారెడ్డి, భూక్య బౌసింగ్, జిల్లా మునిందర్, బేతి భరత్, నల్లగొండ సుధాకర్, డ్యాగాల కృష్ణ, బత్తిని మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య బాలాజీ, ప్రేమ్ సింగ్, సుమన్, బాదావత్ బాలాజీ, భూక్య రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

అనుపమ ‘పరదా’ మూవీ అప్డేట్..

 

అనుపమ ‘పరదా’ మూవీ అప్డేట్..

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారింది. ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అనుపమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. త్వరలో ‘జానికి v/s స్టేట్అఫ్ కేరళ’ మూవీతో ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో సురేష్, అనుపమ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 18న థియేటర్స్లోకి రాబోతుంది. దీంతో పాటు అనుపమ ‘పరదా’ (parada)సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. దీనికి ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ ఆనంద మీడియా బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), టాలీవుడ్ హీరోయిన్ సంగీత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సోఫియో ఫాంటసీ కాన్సెప్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినీ ప్రియులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ‘యాత్ర నార్యస్తు” సాంగ్ లిరికల్ వీడియో జులై 17న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించింది. “స్త్రీ హృదయాన్ని ప్రతిధ్వనించే పాట రాబోతుంది” అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ముసుకులో ఉన్న ఆమె పోస్టర్ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

నన్ను ఎవరూ ఆపలేరంటూ అమితాబ్ బచ్చన్

 

ఇక నన్ను ఎవరూ ఆపలేరంటూ అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇప్పటికీ వరుస సినిమాలు, షోస్లో కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. చివరగా బిగ్బి ‘కల్కి’ మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆయన ఏ ప్రాజెక్ట్ చేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. నిత్యం అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)పై ప్రశంసలు కురిపిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా, అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఒక ఏడాదిలో ఐ వాంట్ టు టాక్, హౌసుల్-5 (Housefull-5), కాళీధర్ లాపత (Kalidhar laapatha), వంటి మూడు విభిన్నమైన సినిమాల్లో నటించాడు.

ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఆ మూడు చిత్రాల్లో పాత్రలు పోషించాడు. ఆయా సినిమాల్లో నాకు ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది. ఈ రోజుల్లో ఇలా చూడటం ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక పాత్రను పూర్తిస్థాయిలో అంగీకరించి.. అద్భుతంగా నటించాడు. నటుడిగా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియజేశావే. ఇంకా ఈ సంవత్సరం ముగియలేదు. ఇంకా ఎన్ని విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నావో. ఒక తండ్రిగా నా తనయుడిని ప్రశంసించడాన్ని ఎవరూ ఆపలేరు. ” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి ఎస్పీ కిరణ్ ఖరే.

భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని, అన్ని పోలీసు స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రకృతికి అందం మొక్కలేననీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

నిన్ను ప్రేమిస్తున్నాని నీకు తెలుసంటూ .!

నిన్ను ప్రేమిస్తున్నాని నీకు తెలుసంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలా ‘అమ్ము’ (Ammu) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన చిన్నది.. ఆ తర్వాత టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Sathyadev) తో కలిసి ‘గాడ్సే’ (Godse) అనే సినిమా చేసింది. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu) అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అందులో అడవిలో ఓ పాత బడ్డ టీవీ దగ్గర పడుకుని ఫొటోసి కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ టీవీకు ఆనుకొని కొన్ని క్యూట్ స్టిల్స్ కూడా తీసుకుంది.

ఇక ఈ పిక్కు.. ‘గోల్డెన్ అవర్ భిన్నంగా ఉంటుంది, ముఖ్యంగా మీరు చీకటిని చూసినప్పుడు.. చిత్రాల ద్వారా మనం చెప్పగలిగే ఈ కథలను నేను ఇష్టపడుతున్నాను. అతని పనిని నేను ఇష్టపడుతున్నాను అండ్ లెన్స్ వెనుక ఉన్న వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. దశాబ్దానికి పైగా అతని గురించి నాకు తెలుసు.. ఇక గౌరవం సంపాదించి దానిని నిలుపుకునే అరుదైన వారిలో అతను ఒకడు.. స్మిజ్స్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు’ అంటూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారగా.. పాత టీవీని పడేయడానికి జంగిల్కి వెళ్లావా అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి
(జమ్మికుంట: నేటిధాత్రి)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నిజయోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉడతల ప్రణవ్ బాబు కు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన దేశిని కోటి. దొంత రమేష్. సుంకర రమేష్.జిల్లాల తిరుపతిరెడ్డి.సతీష్ రెడ్డి.మేకల తిరుపతిరెడ్డి. నల్ల కొండల రెడ్డి.శ్రీనివాస్.తదితరులు సత్కరించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలిపించాలని విభేదాలు లేకుండా పనిచేయాలని ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్..

ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..ప్రజా సంపదను అడ్డగోలుగా దోపిడీ చేస్తుందని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజ వనరులను నిలువుగా దోపిడి చేస్తూ..లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నేడు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు ఇసుక మాఫియాను పెంచి పోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చేసిన ఇసుక దందా వల్ల టేకుమట్ల మండలంలోని మానేరు వాగులో ఇసుక దిబ్బలు లేకుండా పోవడంతో భూగర్భ జలాలు అడుగంటుకు పోయాయని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయన అనుచరులు సైతం ఇసుక దందా చేయడం వల్ల ఇసుక దిబ్బలు పూర్తిగా లేకుండా పోతున్నాయని, దీంతో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటుకుపోయి రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచిన గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..వారి అనుచరులు ఇసుక మాఫియాపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏమిటని నిషిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఆరి తేరిన ఈ దొంగల ముఠా చీకటి కోణంలో ఇసుకను అక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. జెసిబిల సహాయంతో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తోడేళ్ల లాగా తోడుస్తూ..ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి..రాత్రిపూట పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో, దేవాలయాల నిర్మాణాల పేరుతో, అభివృద్ధి పనుల పేరుతో అధికారుల వద్ద అనుమతి పత్రాలు తీసుకొని అక్రమ ఇసుక దందాకు తెరలేపిన ఘనుడు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇదే తరహాలో ఇసుక దందాకు తెర లేపితే..ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక దందాను ఆపకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
త్వరలో జరగబోయే స్థానిక స్థానిక సమరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా శ్రమించి..బార్డర్ లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వలె కష్టపడి పనిచేసి టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ..నేడు ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ..స్థానిక సమరంలో గెలవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక సమరంలో ఎండగట్టాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడు మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బిజెపి సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి భూత అధ్యక్షులు అశోకు రామ్మోహన్ రావు మండల నాయకుడు దొమ్మటి రవీందర్ దేశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

రెవెన్యూ డివిజన్ కోసం ఉదృతమైన పోరాటాలు..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఉదృతమైన పోరాటాలు

జేఏసీ ఆధ్వర్యంలో అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం. ర్యాలీ.

జేఏసీ చైర్మన్ వకళాభరణం నరసయ్య పంతులు

చేర్యాల నేటిదాత్రి

JAC Chairman Vakalabharanam Narasaiah Pantulu

చేర్యాల మద్దూరు దుల్పిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అయినను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కొత్తగా వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అయినను కాలయాపన చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వకలాభరణం నరసయ్య పంతులు దుయ్యబట్టారు ఈ సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం ర్యాలీ నిర్వహించి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వానికి ప్రజలతో కలిసి నిర్వహించారు జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల ఆకాంక్షను గుర్తించాలని లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

JAC Chairman Vakalabharanam Narasaiah Pantulu

ఈ కార్యక్రమంలో బిజెపి బీఆర్ఎస్ సిపిఎం కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె..

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె

కరీంనగర్, నేటిధాత్రి:

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version