ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె..

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె

కరీంనగర్, నేటిధాత్రి:

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version