ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు.

ఎంపీటీసీ స్థానాల వారిగా సీపీఐ సమావేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి

మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి- పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని, చిగురుమామిడి మండలంలో సీపీఐ పూర్వవైభవం కోసం మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మండలంలోని ఇందుర్తి గ్రామంలో గల అమరజీవి కూన ముత్తయ్య స్మారక భవన్ సీపీఐ కార్యాలయంలో ఇందుర్తి రెవిన్యూ పరిధిలోని రెండు ఎంపీటీసీ స్థానాల గ్రామాలైన ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లె, గునుకులపల్లె గ్రామాల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం సీపీఐ ఇందుర్తి గ్రామశాఖ కార్యదర్శి ఎం.డి.ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది. చిగురుమామిడి మండల కేంద్రంలోని అమరజీవి ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో చిగురుమామిడి ఎంపీటీసీ స్థానం సమావేశం అల్లేపు జంపయ్య అధ్యక్షతన జరిగింది. సుందరగిరి ఎంపీటీసీ స్థానం సమావేశం మావురపు రాజు అధ్యక్షతన జరిగింది. లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల ఎంపీటీసీ స్థానం సమావేశం కయ్యం తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరుగా ఉన్న చిగురుమామిడి మండలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు సైతం కోల్పోయారని, ఈప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వారంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వారి, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని వారి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకు పోవడం కోసం మండలంలో ఎర్రజెండాను ఎగురవేసి తిరిగి గత వైభవం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై నాయకులపై ఉందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం కోసం పార్టీ నాయకత్వం ముందుండాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ ప్రజాపతినిధులు గ్రామ, మండల స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం, ఈప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేసినట్లుగా లేవని, ఆయా పార్టీ నాయకులకే, కార్యకర్తలకే పథకాలు అందాయని, అర్హులైన వారికి అందలేదని, కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే పేదలకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని, న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ఈసమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి బూడిద సదాశివ, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, గ్రామశాఖ కార్యదర్శులు ఎం.డి.ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, అల్లేపు జంపయ్య, ఎలగందుల రాజు, కయ్యం తిరుపతి, బోట్ల పోచయ్య, నాయకులు కూన లెనిన్, రాకం అంజవ్వ, గంధె కొమురయ్య, తాల్లపెల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version