ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె
కరీంనగర్, నేటిధాత్రి:
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.