తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని సత్కరించిన..

*ఎర్రరెడ్డి పాళ్యం గ్రామ ప్రజలు…

తిరుపతి నేటి ధాత్రి

తుడా చైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి ని, రేణిగుంట మండలం,ఎర్రరెడ్డి పాళ్యం గ్రామనికి చెందిన నాయకులు భాస్కర్ యాదవ్, కృష్ణ, మోహన్, గోపి,శివ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు డాలర్స్ దివాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారుతుడా నిధులతో తమ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని తుడా చైర్మన్ కి వినతిపత్రం అందజేశారు. తప్పకుండా తుడా నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా శ్రేయోభిలాషి దివాకర్ రెడ్డి తుడా ఛైర్మెన్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన దివాకర్ రెడ్డి హయాంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version