సీఎం రేవంత్ రెడ్డి, దొంతి చిత్రపటానికి క్షీరాభిషేకం.
#ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తే లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో బిల్లు వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా గ్రామానికి చెందిన బాధావత్ మౌనిక సుమన్ ఖాతాలో లక్ష రూపాయలు జమ కావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ కూడలిలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల 10 సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేసి అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసి నిర్దిష్ట సమయంలో వారి ఖాతాలో డబ్బులు జమ చేయడంతో గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు లబ్ధిదారులందరూ ఇండ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చార్ల శివారెడ్డి, భూక్య బౌసింగ్, జిల్లా మునిందర్, బేతి భరత్, నల్లగొండ సుధాకర్, డ్యాగాల కృష్ణ, బత్తిని మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య బాలాజీ, ప్రేమ్ సింగ్, సుమన్, బాదావత్ బాలాజీ, భూక్య రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.