మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మామ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో 26 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లిఖిత రామకృష్ణ గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి:*
నర్సంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో 26 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లిఖిత రామకృష్ణ గౌడ్ గెలుపు బాటలో ముందున్నారు. నర్సంపేట పట్టణ లిక్కర్ వ్యాపారవేత్త, వరంగల్ జిల్లా గ్రంధాల సంస్థ మాజీ డైరెక్టర్, గంప రాజేశ్వర్ గౌడ్ చిన్న కోడలు గత వారం రోజులుగా సాగుతున్న స్వతంత్ర అభ్యర్థి విద్యావంతురాలు లిఖిత ఎన్నికల ప్రచారం అవార్డులో ప్రజలకు, యువతకు ఎంతో ఫూర్తిదాయకం కానున్నది. తన మామ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో ప్రజా సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన గంప లిఖిత ప్రచారంలో దూసుకుపోయారు. వార్డు ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక వార్డు యువత,ప్రజలతో కలిసి, గడప గడప ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి గంప లిఖిత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ 26వ వార్డు ప్రజల సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. గతంలో మా కుటుంబం నుండి నా తోటికోడలు గంప సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. వార్డు అభివృద్ధికి పూజిస్తాయిలో పనిచేశామని అన్నారు. అదే స్ఫూర్తితో నర్సంపేట పట్టణంలో ఉన్న అన్ని వార్డులలో 26వ వార్డును ఉత్తమ వార్డుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న మున్సిపాలిటీ నిదుల నుండి సంక్షేమ ఫలాలు తెచ్చి పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని లిఖిత రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ కంప రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు అందిస్తామని తెలిపారు. సేవా భావంతో ఉన్న తన కుటుంబం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా కౌన్సిలర్ ఆకాశమిచ్చారని అదే స్ఫూర్తితో మా చిన్న కోడలు లిఖిత రామకృష్ణ గౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గంప రాజేశ్వర్ గౌడ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో తాజా మాజీ కౌన్సిలర్ కంప సునీత, వార్డు ఎన్నికల ఇన్చార్జి యువకులు, మహిళా యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు
12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు
బద్దం ఏల్లారేడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేసిన బావండ్లపల్లి యుగేందర్
కరీంనగర్, నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వ కార్మికవర్గ వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధిత గోడ ప్రతులను గణేష్ నగర్ లోని బద్దం ఏల్లారెడ్డి భవన్ లో కార్యాలయంలో విడుదల చేసారు. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తులు మరియు అవసరమైన ప్రజా సేవల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం, కార్మిక హక్కులను హరించివేయడం మరియు సామాజిక భద్రత నిరాకరణ, యువత మరియు శ్రామిక ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను పలుచన చేసిన, కార్మిక సంఘాలను బలహీనపరిచి, “వ్యాపారం చేయడం సులభతరం” పేరుతో సంస్థాగతమైన దోపిడీకి కారణమైన నాలుగు కా
వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండలం ముంగి చౌరస్తా యస్.ఆర్.కె. ఫంక్షన్ హాల్ లో జరిగన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం మహ్మద్ బాబు మియా కుమారుని వివాహా వలిమా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వై.తరుణ్, మాజీ సర్పంచ్ శివరాజ్ పాటిల్,శేఖర్,యస్.గోపాల్,శ్రీకాంత్,నబిసాబ్,మల్ శెట్టి,చెంగల్ జైపాల్,ఉమేష్, శ్రీనివాస్ రెడ్డి,సంగన్న, మోహిజ్,సంగోబా తదితరులు పాల్గొన్నారు
నాగబంది యాదగిరి ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిధాత్రి .
ఆర్యవైశ్య సంఘము గౌరవ అధ్యక్షుడు నాగబంది యాదగిరి ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి పరామర్శించారు ఈమేరకు త్వరగా కోలుకుని ఆర్యవైశ్య ల కు ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు 33 వార్డుల లో కాంగ్రెస్ అభ్యర్థలను గెలిపించాలని యాదగిరి ని ఎమ్మెల్యే కోరారు నాగబంది కుటుంబ సభ్యులు కమలమ్మ గీత శ్రీను కు ఎమ్మెల్యే మేగారెడ్డి ధైర్యం కల్పించారు
మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరైనారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది అలాగే పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను నూతన మండలాలు నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులోని భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేశారు కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ జిల్లాలను తగ్గిస్తామని అంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తీసేస్తామని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూపెట్టాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం సిసి రోడ్ల నిర్మాణం స్మశాన వాటికల నిర్మాణం సైడ్ డ్రైనేజీలు కోర్టు భవనం మిషన్ భగీరథ నీరును పట్టణ ప్రజలకు అందివ్వడం జరిగింది వారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు అలాగే మహిళలకు 2500 ప్రతినెల ఇస్తా అని హామీ ఇచ్చారు ఆ హామీని కూడా అమలు చేయలేదు కల్యాణ లక్ష్మి ధార మహిళలకు తులం బంగారం ఇస్తా అని పగడ్బాలు పలికారు కానీ ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. వానకాల సీజన్ స్టార్ట్ అయింది అంటే రైతులకు ఎరువులు యూరియా అందక రైతులు చెప్పులను ఎరువుల దుకాణాల ముందు లైన్ లో పెడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకు నిదర్శనం రైతులు చెప్పులు లైన్లో పెట్టడమే. దీనికి నిదర్శనం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడూరియా కోసం ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు అలాంటి పరిపాలన అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని వారు అన్నారు రైతులు కష్టాలు పడుతున్నారని ఆలోచించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు రైతు బీమా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అలాగే రైతులకు ఏకారాన పదివేల రూపాయలు రైతుబంధు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని వారు అన్నారు సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదు కార్మికులకు పేరు మార్పిడి సమస్యతో అనేక బాధలు పడుతున్నారు అయినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదు సింగరేణిలో ఉన్న నిధులను పార్టీ అవసరాల కోసం వాడుకుంటున్న సీఎం మన కాంగ్రెస్ పార్టీ సీఎం కావున వారికి తగిన గుణపాఠం ప్రజలు ఓటు ద్వారా చెప్పాలి అని వారు అన్నారు భూపాలపల్లిలో నిరంతరం బొగ్గు లారీలు ఇసుక లారీలతో అనేకమంది వాహనదారులు యాక్సిడెంట్లు ప్రాణాలు దానితో మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి నాకు చెప్పడంతో వెంటనే ఆ రోజులలో భూపాల పెళ్లికి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం సాంక్షన్ జీవో తీసుకురావడం జరిగింది కానీ దానిని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు భూములు సేకరించి పనులు చేపట్టడం లేదు వారు మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా చేస్తారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గండ్ర గౌతంరెడ్డి టీజీపీకే నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి
* అలియాబాద్ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున సోమవారం మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇంటి ఇంటి కి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని ఓటర్ లను కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు బండి లక్ష్మీ రాంరెడ్డి, తూము యమున శ్యామ్, తంటం నర్సింహా, సగ్గు శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, ముద్దం మధుసూదన్ రెడ్డి, బోయిన రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు సైలెన్స్ డేగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, కాలనీలు వార్డుల్లో సంచరించరాదని సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
ఆర్థిక అక్షరాస్యత అవగాహనా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో
ఇబ్రహీంపట్నం.నేటిదాత్రి
మండలంలోని, వర్షకొండ గ్రామం లో యూనియన్ బ్యాంకు మరియు విడ్స్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో అవగాహనా సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.బ్యాంకు అందిస్తున్న వివిధ సేవల ద్వారా సామాన్య పౌరుడు ఎలా ఆర్థికంగా అక్షరస్యాతను సాదించగలడో అందరికి అవగాహన కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోనకంటి వెంకట్,ఉప సర్పంచ్ జయ.నర్సయ్య, గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, మరియు, బ్యాంకు మిత్ర, అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్, వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల బీజేపీ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు.డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసం కృషి చేసే వారికి కాకుండా డబ్బున్న వారికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి సంపాదించేందుకే వారు ప్రయత్నిస్తారని,అలాంటి వారికి ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు.బీజేపీ అభ్యర్థులు అవినీతి లేకుండా అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి బండారి గిరి ప్రసాద్ యువ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల కోసం నిలబడ్డాడని అన్నారు. పరకాల పట్టణ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యువ నాయకులను గెలిపించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చేసిన ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు. బీజేపీ పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న నాయకుల కృషిని పార్టీ నేతలు అభినందించారు.ఈ ప్రచారంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం భాగంగా సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే పల్సర్ మోహియోద్దీన్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ . పూర్తిగా విఫలమైందని బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈద్గా మైదానంలో వద్ద, మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన సమావేశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో లో బీజేపీ కేవలం కుల మతాల డి మధ్య చిచ్చులు పెట్టి ఓట్లను దండుకొని దేశంలో శాంతి పద్ధతులకు భంగం వాటిల్లో విధంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా తప్పుడు ఆలోచనతో బీజేపీకి మరియు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఓటు వేస్తే ఆ ఓటు మురుగునీటి కాలువలు వేసినట్టేనని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఏఐఎంఐఎం పార్టీ కృషి చేస్తుందన్నారు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి మోకాళ్ళ అడ్డు వేసిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం హజ్ హౌస్, స్మశాన వాటిక స్థలం,షాది ఖానాలకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వాటన్నిటిని రద్దు చేసిందని విమర్శించారు. హిందూ ముస్లింలు రెండు కండ్ల లాంటి వాళ్లు తమరి పూర్తిగా లౌకిక పార్టీ అన్నారు.తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించక పోతే అభివృద్ధి కోసం నిధులివ్వమని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, నిధుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం తాము కొట్లాడి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బి ఆర్ ఎస్ అభ్యర్థుల ను గెలిపించి కాంగ్రెస్ పార్టీ కి, రేవంత్ రెడ్డి కి బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన బాష విని పిల్లలు పాడవుతారని, ఇళ్లలో పెద్దలు ఛానల్ మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీ ప్రచార భాగంలో గౌరీ సహబ్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ రఫీ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ కృష్ణాపుర్ అధ్యక్షులు యునుస్ దిగ్వాల్ అధ్యక్షులు వాజీత్ షాకపూర్ అధ్యక్షులు పటేల్ మరియు నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు,
గణపురం మండలం, చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ప్రజాపాలన … ప్రగతి బాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది.ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ.. తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు.తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహారించారు. తెలంగాణ ను సాధించడంలో ముందుభాగంలో నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతపు బిడ్డ.నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు.. ఎన్టీఆర్ మొదట భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీతకు పునాదిరాయి వేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు.రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కాని ప్రభుత్వ పరిశీలనలో లేవు…
జిల్లా పునర్వీభజన పైన అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత దీని పైన ఆలోచన చేస్తాం. కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్నవారిని గమనించాలి.. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు.తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ ఫిట్ బోర్డును రద్దు చేస్తాం.. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైన కొందరు విష ప్రచారం చేస్తున్నారు.. మెడికల్ బోర్డు పైన విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపైన కూర్చొబెట్టాలి. సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సింగరేణి కార్మికులు నిండు మనసుతో పనిచేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది.ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది. వారికి నష్టం కల్గించే పనిచేయం.217 డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం. వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గత పాలకులు మాయ మాటలు చెప్పాడు.గత పాలకులు వెయ్యి ఎకరాల్లో ఎర్ర వల్లిలో , ఫామ్ హౌస్ 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్ , హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు.ఒక్క కేసీఆర్ క్లాస్ మెంట్ జాహంగీర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీర్ కుటుంబానికి వచ్చాయి. కాని పేదలకు డబల్ బెడ్రూం ఇళ్లు రాలేదు.. ఏడాది కి 2 లక్షల ఇళ్లు కడితే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే అవకాశం కేసీఆర్ కు ఉండేది.. కాని పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదు.. పేదలపైన ఆయనకు ప్రేమ లేదు.. భూపాలపల్లిలో రైతు పోరాట బాట, కార్మికుల పోరు బాట నేను గతంలో నిర్వహించాను.. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం.. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం.. వచ్చే బడ్జెట్ లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.. పేదల ఆత్మగౌరవం పెరిగేలా , ఆడబిడ్డలు ఆశ్వీరధించేలా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత మంజూరు చేస్తాం.. సరస్వతి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్నాం.. 1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆలయం నిర్మించాం.. సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్మించాం.. జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.కొండా సురేఖ, సీతక్క మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించారు.2027 లో రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా 3, 4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం.గోదావరి పరిహాక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం..ప్రజా ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి …అపుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.పదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లి కి బై పాస్ రోడ్డు తీసుకురాలేదు.. మాయ మాటలు చెప్పే వాళ్లకు ఓటు వేస్తే మోసపోతారు జాగ్రత్త.. తెలంగాణ లో మున్సిపాలిటీలు, కార్పేరేషన్ల కు 17,442 కోట్లు మంజూరు చేశాం.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు 6116 కోట్లు మంజూరు చేశాం.భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్ల నిధులు మంజూరు చేశాం..
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న గత పాలకుని తీరు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుంది .. గత పాలకులు ఇంటిల్లిపాలికి పదవులు ఇచ్చుకున్నాడు.. కాని పేదలకు ఏమీ చేయలేదు. ఎవరకి వారు వాళ్లు తమ సామాజిక వర్గం పేరుతో నన్ను పిల్చుకున్నారు.. ఎవరు ఎలా పిలిచినా సంతోషిస్తా. వేలకోట్ల ఆస్తులను పేదలకు దానం చేసిన గాందీ కుటుంబంపైన ఈడీ , సీబీఐ ని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరం పైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు.. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీతారలను వదలలేదు.భార్యభర్తలు ఫోన్లు విన్న పాపాత్ముడు ఎవరైనా ఉంటారా.. వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారు.వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి మాటలు విని ఆస్తులురాయించుకున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు దోచుకున్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రజల ఆశీర్వాదం ఉండాలి.. ఇందిరమ్మ చీరల్లో మా అక్కలు దసర పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు.. ఇందిరమ్మ చీర ను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు.ప్రతి యేడాది ఇందిరమ్మ చీరను సారె గా తప్పకుండా ఇస్తాం.. ఆడబిడ్డల ఆశ్వీరాధం ప్రజా ప్రభుత్వానికి ఎల్లపుడూ ఉండాలి.అనంతరం మహిళా సంఘాలకు 205 కోట్ల రూపాయలు బ్యాంకు లికేంజి అందాచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు డా కడియం కావ్య, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సింగరేణి కార్మిక సంగం చైర్మన్, గ్రంధాలయ సంస్థ చైర్మన్లు రాజబాబు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని మహేంద్ర కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో 24వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీవారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పూజారులచే జరిగిన ఈ కళ్యాణానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ పటిష్టమైన ఏర్పాట్లు చేయగా, మహిళా భక్తుల కోలాటం, శ్రీవారి ఊరేగింపు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి 33 వ వార్డులో 12 సంవత్సరాల పాటు ఉన్నారని వనపర్తి లోనే చదువుకున్నారని ఆయన పేర్కొన్నారు 33 వ వార్డు కౌన్సిలర్ గా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ ను అత్యధిక మెజార్టీతో వార్డు ప్రజలు ఆర్యవైశ్యులు ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాధవిని గెలిపించసాలని కోరారు వనపర్తి పెబ్బేరు లో అన్ని వార్డు లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి విజ్ఞప్తి చేశారు 33 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ ను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవికి సుమిచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు వనపర్తి ఆర్యవైశ్యులు ఏదైనా సమస్య వస్తే తనకు నేరుగా సంప్రదించాలని కోరారు 33 వ వార్డులో సీసీ రోడ్స్ నూతన డ్రైన్స్ శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి నిధులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు వనపర్తి ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే ఎన్నికల్లో తనను ఆశీర్వదించా రని అన్నారు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాధవి మాట్లాడుతూ 33 వ వార్డులో ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రేషన్ కార్డ్స్ ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారములో ఉన్నదని పూర్తిగా వారి సహకారం తో అభివృద్ధి చేస్తామని చేస్తానని ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాధవి ప్రజలకు హామీ ఇచ్చారు
◆-: మజ్లిస్ అభ్యర్థులను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. బారిస్టర్ ఒవైసీ ఇంటింటికీ వెళ్లి మజ్లిస్‌కు అనుకూలంగా తమ ఓట్లను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు కార్వాన్, అసెంబ్లీ సభ్యుడు శ్రీ కౌసర్ మొహియుద్దీన్, మజ్లిస్ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ ఒవైసీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువకులు బారిస్టర్ ఒవైసీని చూసేందుకు పరుగులు తీస్తున్నారు. “చూడు, చూడు, ఎవరు వచ్చారు, సింహం, సింహం, సింహం” అనే నినాదాలు కూడా ప్రజలు వినిపించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, మార్పు, అభివృద్ధి, న్యాయం మరియు శాంతిభద్రతల నిర్వహణ కోసం మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులందరినీ గాలిపటం గుర్తుకు ఓటు వేయడం ద్వారా విజయవంతం చేయాలని జహీరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్నత వర్గాలు నష్టపోయే వాతావరణం ఏర్పడిందని, జాతీయ మీడియా కూడా దీనిపై నిరంతరం విశ్లేషణ ద్వారా వ్యాఖ్యానిస్తోందని ఆయన అన్నారు.యూజీసీ రెగ్యులరైజేషన్ కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం కొనసాగించారు, దీని ఫలితంగా సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును నిలిపివేయాలని నిర్ణయించింది. తెలంగాణలో 7 మంది బీజేపీ ఎంపీలు ఎన్నికైనప్పుడు యూజీసీ రెగ్యులరైజేషన్ ఎలా ఆగిపోయిందని ఆయన బీసీ విభాగాలైన మునావర్ కా పోస్సేను అడిగారు. బీజేపీ వెనుకబడిన వర్గాలను కాదు, ఉన్నత వర్గాలను ప్రేమిస్తుందని దళితులు, వెనుకబడిన వర్గాలు పరిగణించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కూడా నిలిపివేయబడుతుందని ఆయన అన్నారు. బీజేపీ పాలిత 6 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్రలలో 80% ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. మియాన్ ఆటో రిక్షా డ్రైవర్ ఐదు రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు మాత్రమే చెల్లించాలని ముస్లింలకు వ్యతిరేకంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంతు బిశ్వ శర్మ చేసిన ప్రకటన అత్యంత ద్వేషపూరితమైనది, ఖండించదగినది మరియు ప్రజలను అవమానించడం అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారుజామున మజ్లిస్ ఎన్నికల గుర్తు అయిన కైట్ పై తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
పట్టణంలోని మాదారం కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడెల్లి మల్లమ్మ కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న 10వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిట్ట స్వప్న-దేవేందర్ భాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.ఎన్నికల వేల ఓటర్లను వల వేసుకోవడానికి మధ్యం మాంసం పంపిణి చేస్తున్న నాయకులను చూసాం కానీ గెలుపోటములు లెక్క చేయకుండా పేద కుటుంబాలను ఆదుకునే మహాత్తర కార్యక్రమాలు చేస్తున్న స్వప్న -దేవేందర్ లాంటి నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసే వాడై ఉండాలని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు మాకు అవకాశం ఇస్తే 10వార్డ్ అభివృద్ధితో పాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నిత్యం ప్రజల మధ్యే ఉంటామని హామీ ఇచ్చారు.భేశాజ్వలాలకు పోకుండా కుల మతాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్యామ్,చెరుకు సుధాకర్, బుస్స చిన్న భద్రయ్య, మంద సదానందం,గూడెల్లి దశరధం,గూడెల్లి రాజా రమేష్,మంద నాగరాజు,కోగిల శ్యామ్,కాలనీ వాసులు గూడెల్లి శివకుమార్, కొమురయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.
◆-: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. అష్ట తీర్థాల సంగమం, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రహదారులలో రంగురంగుల దీపాలను, తోరణాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక రోడ్ల మరమ్మతు చేశారు. కలెక్టర్ శరత్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పలు దఫాల అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక స్నానపు గదులు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు భద్రత, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారి గర్భాలయాన్ని బంగారు పూతతో మకర తోరణం చేయించారు.
సంగమేశ్వర స్వామి స్థల పురాణం:
ఝరాసంగ క్షేత్రంలో శివ లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఒకానొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కేతకీ వనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినప్పుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట. అదేరోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట. అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరిణిగా మార్చి దానికి అష్ట తీర్ధమని, అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడి ఆదారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.
మంజీర నదీతీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో కేతకి అంటే మొగలి పువ్వులతో పూజించాడట. అందుకనే ఈ స్వామిని కేతకీ సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.
11/02/2026 బుధవారం నాడు కేతకీ నహ్వానిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
స్వామివారి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి
14/02/2026 శనివారం నాడు శేష వాహన సేవ నిర్వహించనున్నారు.
తేదీ 15/02/2026 ఆదివారం నాడు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల నుండి స్వామివారికి లింగోద్భవ సమయమున స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకము.
16/02/2026 సోమవారం నాడు మహా రుద్రాభిషేకం, నంది వాహన సేవ,
17/02/2026 మంగళవారం నాడు ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం,
సాయంత్రం;5;30 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, రాత్రి 10 గంటలకు రథోత్సవం. తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి: ఆలయ ఈవో శివ రుద్రప్ప
కేతకి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప పేర్కొన్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపటి మహాశివరాత్రి జాగరణ కోసం ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం మీదనే ఆశలు బేరాలకోసం చిరు వ్యాపారుల ఎదురుచూపులు
గతంలో వ్యాపారాలతో కలకలలాడిన పరకాల నేడు కలతప్పింది
పరకాల,నేటిధాత్రి
ఒకప్పుడు వ్యాపార సందడితో కలకలలాడిన పరకాల పట్టణం నేడు నిశ్శబ్దంగా కనిపిస్తోంది.రద్దీగా ఉండే చిరు వ్యాపారాల స్థలాలు,ప్రాంతాలు ఇప్పుడు కస్టమర్ల లేమితో వెలవెలబోతున్నాయి. గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోళ్లతో కళకళలాడిన దుకాణాలు,చిరు వ్యాపారాలు ప్రస్తుతం గిరాకీ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా కూరగాయలు,పండ్లు, దుస్తులు విక్రయాలు గణనీయంగా పడిపోయాయి.చిరు వ్యాపారులు ఆదివారం మీదనే తమ ఆశలను నిలిపారు.వారంతా గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆదివారం వచ్చే బేరాలే తమకు కొంత ఊరటనిస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.పరకాల మార్కెట్,బస్టాండ్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల్లో కస్టమర్లు తగ్గిపోవడం వ్యాపారుల ఆందోళనను పెంచుతోందని చెప్పవచ్చు ఆదివారం సెలవు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పట్టణానికి రావడం, కుటుంబాలతో కొనుగోళ్లకు రావడం వల్ల కొంతమేర వ్యాపారం మెరుగుపడుతుందనే కాస్త ఆశ వ్యాపారుల్లో కనిపిస్తోంది.ఈ ఒక్క రోజైనా లాభం వస్తే వచ్చే వారం గడవడానికి తోడ్పడుతుందనే భావనతో వారు ఎదురు చూస్తున్నారు.పరిస్థితి మారి పాత రోజుల సందడి మళ్లీ తిరిగి రావాలని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఆదివారం వంటి సెలవు రోజులలో మాత్రమే కొంతమేర ఊరట లభిస్తోందని చిరు వ్యాపారులు అంటున్నారు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఒక రైతు ప్రాణాల మీదకు తెచ్చింది. రజాక్ పల్లి గ్రామానికి చెందిన వోజ్జ పరశురాములు విద్యుత్ షాక్ కు గురవడంతో రెండు చేతులు కాలిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు.
◆-: మాపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవి కావు.
◆-: మా భూముల పై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాతే పరిహారం అందించారు.
◆-: చిలేపల్లి తండా మహిళా రైతు గేనీ బాయ్..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరా సంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్ ) ఏర్పాటుకు 2012లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్ పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 7,500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. నిమ్జ్ భూ సేకరణలో భాగంగా చీలపల్లి తాండ పరిధిలోని సర్వే నంబర్ 151 లో ఆరుగురు రైతుల పైన 20.33 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమి రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు అధికారులు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదయింది. ఇట్టి భూమిలో ఆరుగురు రైతులు గత 30 సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిమ్జ్ భూసేకరణ లో భాగంగా ఇట్టి భూమి నష్టపరిహారం అధికారులు మాకు ఇవ్వలేదు. ఇట్టి విషయంపై మేము తెలంగాణ హైకోర్టుకు అప్పిలు చేసినాము.. నిమ్జ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు మా యొక్క కేసును వాపు తీసుకున్నచో నష్టపరిహారం ఇస్తామని తెలిపినారు. తెలంగాణ హైకోర్టులో ఇట్టి కేసును 119/2012 కేసును మేము విత్ డ్రా చేసుకున్నాము. ఇటి కేసు విత్ డ్రా చేసుకున్నట్లు జూన్/ 7 /2024లో కేసును రాజీ కుదుర్చుకున్నట్లు నిమ్జ్ ప్రత్యేక అధికారులకు సమర్పించిన తదుపరి వారు విచారణ వారు పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు ల చుట్టూ తిరిగి కేసుల నుండి రాజి కుదుర్చుకున్న తర్వాత నిమ్జ్ అధికారులు ఇట్టి సర్వే నంబర్ భూములపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాకు నష్టపరిహారం అందించారు. మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా కుటుంబ సభ్యులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఆసత్యపు ఆరోపణలపై మా కుటుంబ సభ్యులం ముక్తకంఠంతో త్రీవంగా ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారు. ఈ విషయంలో కొందరు కావాలని మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బులకు ఆశపడి ఇతరులు చెప్పుడు మాటలు విని మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆరోపణలు నిరాధారణమైనవి కావు. ఈ సమావేశంలో జాదవ్ ధర్మీబాయి, సుమిత్ర బాయ్, మోతి బాయ్ , రేఖ భాయ్, సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.