న్యాల్కల్ మండల నీటివనరుల గణన పూర్తిచేయాలని ఆదేశం…

న్యాల్కల్ మండల నీటివనరుల గణన పూర్తిచేయాలని ఆదేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల పరిధిలోని అన్ని నీటివనరుల గణనను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని తహసీల్దార్ ప్రభులు అధికారులను ఆదేశించారు. న్యాల్కల్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, నీటివనరుల గణన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వానికి ఖచ్చితమైన వివరాలు అందజేయాలని ఆయన సూచించారు. గణనలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నివేదికలను సమయానికి పంపాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ, మండల గణాంక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా…

1897లో మహారాజుల విందు.. డిన్నర్‌లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసా?

 

బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు 1897 జనవరి 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం..

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హిస్టోరియన్ నేహా వర్మానీ 130 ఏళ్ల క్రితం నాటి మహారాజుల డిన్నర్ మెనూను బయటపెట్టారు. మెనూకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 1897 జనవరి 31వ తేదీన బరోడా మహారాజు.. గ్వాలియర్ మహారాజుకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు సంబంధించిన మెనూలో ఒక్క భారతీయ వంటకం కూడా లేకపోవటం గమనార్హం. ఆ డిన్నర్‌లో ఇద్దరు మహారాజులు కేవలం ఫ్రెంచ్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.

వరంగల్‌లో దట్టమైన పొగమంచు….

వరంగల్‌లో దట్టమైన పొగమంచు.

100 ఫీట్ల రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పైపులు

పైపులు తొలగించండి మేడం.. మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల విన్నపం

నేటిధాత్రి, వరంగల్:

 

వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసిన వేళ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై మధ్యలో నిలిచిపోయిన పైపులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుమధ్యలోనే ఉన్న ఈ పైపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్డుపై స్పష్టత తగ్గిన పరిస్థితుల్లో పైపులు ఎక్కడున్నాయో తెలియక వాహనాలు అటువైపు దాటేందుకు ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళ స్కూల్‌కు వెళ్లే చిన్నారులు, స్కూల్ బస్సులు, ఆటోలు, ఉద్యోగులకు తీసుకెళ్లే వాహనాలు, చిరు వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డుకు మధ్యలో ఎలాంటి డివైడర్ లేకపోవడం, పైగా ఈ పైపులు అలాగే ఉండిపోవడంతో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న పైపులను వెంటనే తొలగించి, భద్రత కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కేసీఆర్ పాలనను ప్రశంసించిన 2025`26 ఆర్థిక సర్వే

· పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి

· కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలను పట్టించుకోని సర్వే

· సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలనుంచి 2.2 కోట్ల ఎకరాలకు వద్ధి

· కాళేశ్వరం ప్రాజెక్టుతో రెట్టింపయిన ధాన్యం దిగుబడులు

· నీటిఎద్దడితో కటకట పడిన రాష్ట్రం…అన్నపూర్ణగా వెలిగిన వైనం

· తాగునీటిని అందించే మిషన్ భగీరథకు ప్రశంసలు

· మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ

· రాష్ట్రంలో తలసరి ఎనఎస్‌డీపీ 212% వది

· జీఎస్‌డీపీ 224.38% వద్ధి నమోదు

· రైతుబంధు ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం

హైదరాబాద్, నేటిధాత్రి: 

కాళేశ్వరం ప్రాజెక్టును “కూలేశ్వరం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శల దాడి చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జనవరి 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2025`26 ఆర్థిక సర్వే, 2014` 2023 మధ్యకాలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదవీకాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందంటూ ప్రశంసలు కురిపించడం రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం! విచిత్ర మేమంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను 2025, జులై 31న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథ కం నిర్మాణం, నిర్వహణ విషయంలో గత బీఆరఎస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ 665 పేజీల సుదీర్ఘ నివేదికను ఈ కమిషన్ రూపొందించింది. కాళేశ్వరం తప్పిదాలకు కర్త, కర్మ,క్రియ కేసీఆరేనని నివేదికలో కమిషన్ కుండబద్దలు కొట్టింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కుంగిన నేపథ్యంలో సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయం లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ప్రచారం చేస్తూ వస్తోంది. గత స్థానిక ఎన్నికల్లో, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ ప్రభు త్వం కేసీఆర్ పై విమర్శల దాడిలో ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే ప్రస్తావిస్తుండటం గ మనార్హం.

విచిత్రమేమంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా కేసీఆర్‌పై ఆరోపణల దాడులు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంసించడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌భగీరథ పథకం కారణంగా 2014లో రాష్ట్రంలో 1.31కోట్ల ఎకరాలుగా వున్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి 2.2కోట్ల ఎకరాలకు పెరిగిందని పేర్కొంది. ఇక ఆర్థికంగా రాష్ట్రం పనితీరు ఈ పదేళ్ల కాలంలో అద్భుతంగా వున్నదని స్పష్టం చేసింది. జీఎస్‌డీపీ 224.38% వద్ధి నమోదు చేయగా, తలసరి ఎనఎస్‌డీపీ 212% వద్ధి చెందడం నిజంగా రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి చిహ్నమని పేర్కొంది. ఇదే సమయంలో విద్యుత్ వినియోగం, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషమని వివరించింది. దేశ జనాభాలో మూడుశాతం జనాభా కలిగిన ఈ రాష్ట్రం జాతీయస్థాయి ఉద్యోగాల్లో 5% వాటాతో, 1.7లక్షల ప్రభుత్వ, 7లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన సాధించిందని పేర్కొంది. నీటిసరఫరా, నిధులు, ఉపాధి కల్పన రంగాల్లో ఈ దశాబ్దకాలంలో అ ద్భుతమైన పనితీరు ప్రదర్శించిందని స్పష్టం చేసింది. 

ఐటీ, ఫార్మా, తయారీ, ఎంఎసఎంఈల రంగంలో కూడా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని వెల్లడించింది. మిషన్ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా 27,625 చెరువుల పునరుద్ధరణతో పాటు, మహిళాసాధికారత, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతి విషయంలో మంచి ఫలితాలు రాబట్టిందన్నది. మొత్తంమీద చెప్పాలంటే ఈ కాలం రాష్ట్ర చరిత్రలో ఒక “స్వర్ణయుగం”గా మిగిలిపోతుందని ముఖ్యంగా అభివద్ధి దిశగా అద్భుతమైన పరిణామ క్రమాన్ని నమోదు చేసిన కాలమిదని ప్రశంసించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ పథకం రాష్ట్ర రూపురేఖలనే మార్చి వేసాయని స్పష్టం చేసింది.

కేసీఆర్ పదవీకాలంలో ఎనిమిదేళ్ల పాటు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి రూ.6.7లక్షల కోట్లు రాష్ట్రం జతచేసిందంటూ ప్రశంసించింది. 2014కు ముందు ఇది కేవలం రూ.2.67లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేసింది. మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి టీ`ఐపాస్ విధానం సత్వర అనుమతులకు దోహదం చేసి అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఐటీ రంగంలో ఉద్యోగాలవకాశాలు మూడురెట్లు పెరగడమే ఇందుకు ఉదాహరణ అని స్పష్టం చేసింది. అంతేకాదు అభివద్ధిలో మహిళలను కలుపుకుపో యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన “డబ్ల్యుఈ`హబ”, మహిళా పారిశ్రామిక వేత్తలను అద్భుతమైన రీతిలో ప్రోత్సహించిందని పేర్కొంది. నిజానికి దేశంలోనే ఈ హబ్‌ను ప్రా రంభించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సష్టించింది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిపోయిందని ఆర్థిక సర్వే ప్రశంసించింది. 2014కు ముందు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 8.5% వుండగా బీఆరఎస్ అధికారంలో వున్న పదేళ్ల కాలంలో దీన్ని 2.6%కు కట్టడి చేయగలిగిందని ఉదహరించింది. నిజంగా ప్రభుత్వం అద్భుత పనితీ రుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే. ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరిగి సామాన్యులు ఇక్కట్ల పాలవడం తథ్యం. ఏ ప్రభుత్వమైతే ధరలను అదుపులో వుంచగలుగుతుందో అది ప్రజలకు మేలుచేసే ప్రభుత్వంగా భావించాలి. 

2014‘23 మధ్యకాలంలో తమ పరిపాలనా కాలాన్ని బీఆరఎస్ నేతలు “బంగారు తెలంగాణ” గా చెబుతుంటారు. తమ ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మహిళాభివద్ధి, సాగు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దష్టిపెట్టి అభివద్ధి చేసిందని ఈ నాయకులు చెబుతున్న అంశాల్లోని సత్యాన్ని 2025‘26 ఆర్థిక సర్వే వెల్లడించింది. మిషన్ భగీరథ ప్రధానంగారా ష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సదుపాయ కల్పనకోసం ఉద్దేశించింది. నీటి ఎద్దడి ప్రాంతాలకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎంతో మేలుచేసింది. ముఖ్యంగా నీటి సదుపాయం అందుబాటులోకి రావడంతో, ఒకప్పుడు బీడు భూములుగా వున్న ప్రాంతాలు మంచి ఫల సాయాన్నిచ్చే సుక్షేత్రాలుగా మారిపోయాయి. ఈ సత్యాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా అంగీకరించాల్సిందే. ఇక ఫ్లెíఓవర్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, రోడ్డు సదుపాయాల కల్పన వంటి అభివద్ధి పనుల ద్వారా, హైదరాబాద్ ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ బాగా పెరిగింది. 

ఇక వ్యవసాయరంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన మరో గొప్ప విజయం, రైతులకు 24/7 విద్యుత్ సదుపాయాన్ని కల్పించడం. అంతేకాదు అంతకుముందు కరంటు కోతతో సతమతమ య్యే రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. దేశంలో దీన్ని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, “రైతుబంధు” పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం వంటివి బీఆరఎస్ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన పథకాలు. నిజం చెప్పాలంటే రై తుబంధు అమలును చూసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదేమాదిరి పథకాన్ని ప్రవేశపెట్టి, రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద కొంత మొత్తాన్ని జమచేయడం మొదలుపెట్టింది. రైతుబంధు స్ఫూర్తితో దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇటువంటి పథకాలనే అమలు చేస్తుండటం వర్తమాన చరిత్ర. వద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు “ఆసరా”పేరుతో పింఛను పథకాన్ని అమలు చేసింది. ఇక ఔత్సాహికులైన దళి తులు ఎవరైనా సొంతంగా ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకుంటే, నూటికి నూరు శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయంఅందించే “దళిత బంధు” పథకాన్ని బీఆరఎస్ ప్రభుత్వం ప్ర వేశపెట్టి అమలు చేసింది. ఇదిలా వుండగా, బీఆరఎస్ హయాంలో పెద్దఎత్తున గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం విశేషం.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మొత్తం 10 జిల్లాలుండేవి. జనాభా, విస్తీర్ణం దష్ట్యా పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను బీఆరఎస్ ప్రభుత్వంచేపట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కతికి వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కషి చేసింది. ఇందులో భాగంగా బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను అందరికీ తెలిసేవిధంగా కషిచేసింది. అంతేకాదు వినోదరంగం ముఖ్యంగా సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యానికి లేదా విలన్ పాత్రలకు మాత్రమే వుపయోగించేవారు. కేసీఆర్ పుణ్యమాని ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ యాసలో సినిమాల చిత్రీకరణ జరగడమే కాదు అవి బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుండ టం వర్తమాన విశేషం. మహిళల భద్రతకోసం “షీటీమ్స”ను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలుతీసుకోవడం విశేషం. సమర్థవంతంగా అమలు చేసిన సంక్షేమ, పాలనాపరమైన సంస్కరణలకు గుర్తింపుగా రాష్ట్రం అనేక “స్కాచ్ అవార్డులను” అందుకుంది.

తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు తెచ్చిన కేసీఆర్ ఇందుకు ఒక ఐకాన్‌గా నిలిచారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా, రాష్ట్ర చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పాలనలో లోపా లుండవచ్చు, అమలులో పొరపాట్లు జరిగుండవచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఇవి త ప్పవు. రాష్ట్రం సాధించిన అభివద్ధే ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా నిలుస్తుంది. దీన్ని 2025`26 కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక స్పష్టంగా వివరించింది. ప్రత్యర్థుల విమర్శలు సహజం. వారు లోపాలను ఎత్తిచూపుతుంటారు. అది చేయకపోతే వారికి మనుగడ వుండదు. చేయని పనులకు విపరీత ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో, చేసిన పనిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ల డం కూడా అధికారంలో వున్నవారికి అత్యంత అవసరం. ఇది ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడకుండా కాపాడుతుంది!

మూడు కార్పొరేషన్లుగా జీహెచఎంసీ?

· పరిపాలనా సౌలభ్యం కోసమంటున్న ప్రభుత్వం

· విపక్షాలను దెబ్బతీసే వ్యూహమంటున్న బీఆరఎస్

· హైదరాబాద్ మేయర్ చేజిక్కించుకోవడానికే ఈ వ్యూహం: విపక్షాలు

· కాంగ్రెస్, ఎంఐఎంలకు ప్రయోజనం

· విలీనం చేసే కొత్త ప్రాంతాల్లో రెట్టింపు కానున్న ఇంటి పన్నులు

· వార్డుల సరిహద్దుల విభజన అశాస్త్రీయం: బీజేపీ

· కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్డుల విభజన?

· విభజనపై కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదు

· విభజనతో ఆర్థిక భారం: విమర్శకులు

· ఢిల్లీని విడగొట్టి మళ్లీ విలీనం చేశారు కదా: గుర్తుచేస్తున్న విమర్శకులు

· ఇప్పటికైతే విభజన ఉద్దేశం లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

· కార్పొరేషన్లతో సహా, రాష్ట్రంపై పట్టుకు రేవంత్ దూకుడు

హైదరాబాద్, నేటిధాత్రి: 

పస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే జీహెచఎంసీని మొత్తం మూడు కార్పొరేషన్లుగా విడగొట్టాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి, జీహెచఎంసీని హైదరాబాద్ కార్పొరేషన్ (కోర్ సిటీ), సైబరాబాద్ కార్పొరేషన్ (వెస్ట్), మల్కాజ్‌గిరి కార్పొరేషన్ (తూర్పు) విభాగాలుగా విడగొట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ప్రణాలిక ప్రకారం హైదరాబాద్ కార్పొ రేషన్ పరిధి లో సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోý£్కండ, చార్మినార్, రా జేంద్రనగర్, షంషాబాద్‌లు వుంటాయి. ప్రస్తుతం లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద వున్న జీహెచఎంసీకార్యాలయమే దీని ప్రధాన కార్యాలయంగా కొనసాగనుంది. ఇక సైబరాబాద్ కార్పొరేషన్‌లో కూకట్‌పల్లి, ఖుద్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు వుండనున్నాయి. ఈ కార్పొరేషన్‌ను అధికారికంగా శేరిలింగంపల్లి కార్పొరేషన్‌గా వ్యవహరించే అవకాశముంది. మాదాపూర్‌లోని నేషనలఅకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(ఎనఏసీ)లో దీని కేంద్ర కార్యాలయం పనిచేయనుంది. ఇక మల్కాజ్‌గిరికార్పొరేషనల్ పరిధిలోకి తూర్పు జోన్ లయిన మల్కాజ్‌గిరి, ఎల్.బి.నగర్, ఉప్పల్ ప్రాంతాలు వుండనున్నాయి. తార్నాకలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచఎండీఏ) భవనంలో ఈ కార్పొరేష న్ ప్రధాన కార్యాలయం వుండే అవకాశముంది. కౌన్సిల్ రద్దయిన తర్వాత స్పెషల్ కమిషనర్ మొత్తం కార్పొరేషన్ బాధ్యతలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం 2053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న జీహెచఎంసీలో మొత్తం 300 వార్డు లుండగా, దీన్ని మూడు కార్పొరేషన్లుగా విభచించిన తర్వాత, హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 150, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో 74 వార్డులు వుండనున్నాయి. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ని మొత్తం మూడు యూనిట్లుగా విభజించాలన్న ప్రభుత్వ యోచన వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే పాలనాపరమైన సౌలభ్యతకోసం, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలన్న లక్ష్యమే ఇం దుకు కారణమని ప్రభుత్వం చెబుతున్నా, విపక్షాలు ముఖ్యంగా బీఆరఎస్ మాత్రం ఈ ఆలోచన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వం ప్రస్తుతం వున్న జీహెచఎంసీని మూడు భాగాలుగా అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లు విడగొట్టాలని యోచిస్తున్నది. ఈవిధంగాచిన్న యూనిట్లుగా విడగొట్టడం వెనుక విపక్షాల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న రాజకీయ లక్ష్యం వున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవిధంగా విడగొట్టిన మూడు కార్పొరేషన్లపై తన పట్టును మరింత బలంగా విస్తరించవచ్చునన్నది రేవంత్ ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. 2023ఎన్నికల్లో బీఆరఎస్ మంచి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాలను ముÅ£్కలు చేయడం ద్వారా పార్టీ నడ్డి విరవడమే కాకుండా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా రూపొందించే వ్యూహం దీని వెనుక వున్నదని తెలుస్తోంది. ఈ పునర్విభజన కాంగ్రెస్‌కు అనుకూలమైన రీతిలో వుండే విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట బోయే ఈ ప్రక్రియలో ఆల్ ఇండియా ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఒక జోన్‌లో అ త్యంత శక్తివంతమైనదిగా రూపొందడమే కాదు, కింగ్‌మేకర్ పాత్రను పోషించనుంది. అయితే ప్రభుత్వం స్వార్థంతో కొన్ని వనరులు, భూమిపై ఆధిపత్యం సంపాదించేందుకే ఇటువంటి నిర్ణ యం తీసుకుంటోందని, బీఆరఎస్ సహా విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ని యంతత్వ వైఖరికి నిదర్శనం తప్ప మరోటి కాదని విమర్శిస్తున్నారు. ఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దోహదం చేస్తుందన్నది వీరి వాదన. ఇందుకు ఉదాహరణగా ఢిల్లీని చూపుతున్నారు. గతంలో మెరుగైన పాలన పేరుతో దేశరాజధాని నగరాన్ని ఇదే విధంగా విభజించిన తర్వాత తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా విభజన నిర్ణయం సముచితం కాదని అర్థమై ఎట్టకేలకు నగరాన్ని మొత్తం ఏకం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దష్టిలో పెట్టుకోవాలని వీరు గట్టిగా చెబుతున్నారు. 

కేవలం కాంగ్రెస్, ఎంఐఎంలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో జీహెచఎంసీని మూడు విభాగాలుగా విడగొడుతున్నారని బీఆరఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఇది పూర్తి అశాస్త్రీయమైన విభజనఅంటూ ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకోసం కూడా ప్రభుత్వం ఈ విభజన ప్రక్రియకు తెరతీసిందని ఆరోపిస్తున్నాయి. కొత్తగా వీలీనమయ్యే ప్రాంతాల విషయంలో పారదర్శకత లేకపోవడం, పెరిగిన పన్నుల భారాలు, మౌలిక సదుపాయాల అంశాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలపైఈ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విభజనవల్ల మేయర్ పదవి కాంగ్రెస్, ఎంఐఎంలచేతుల్లోకి వెళుతుందని, అధిక విలువలున్న భూములను నియంత్రించే దురుద్దేశంతోనే ప్రభుత్వంఈ అనైతిక విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందంటూ బీజేపీ విమర్శిస్తోంది. దీన్ని అభివద్ధి ప్రాజెక్టు అనేదానికంటే “రెడ్ ఎస్టేట” ప్రాజెక్టు అని పిలవొచ్చని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అంతేకాదు కొత్త వార్డుల సరిహద్దులను సరైన సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా గీసారని, ఫలితంగా ప్రస్తుతమున్న పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోవడమే కాదు, తమకు గట్టి బలం వున్న ప్రాంతాలు విభజన చెందడంవల్ల పట్టు కోల్పోతామన్న ఆందోళనను బీఆరఎస్, బీజేపీలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు కార్పొరేషన్లలో కొత్తగా చేర్చే ప్రాంతాలకు చెందిన ప్రజలు, ఇప్పటికీ ఎటువంటి మౌలిక వసతులు ఏర్పడనప్పటికీ, రెట్టింపు ఇంటి పన్నులు కట్టాల్సి వస్తుందన్న ఆం దోళన వ్యక్తమవుతోంది. ఏవిధమైన విస్తరణలేని ప్రస్తుత జీహెచఎంసీలోనే మౌలిక సదుపాయా లు అరకొరగా వున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు విస్తరణ పేరుతో కొత్త ప్రాంతాలను కూడా కలిపేయడం వల్ల మౌలిక వసతుల పరంగా కార్పొరేషన్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందన్న విమర్శ లున్నాయి. ముఖ్యంగా రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి వసతుల కల్పన పరంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీకాకుండా ఇంతపెద్ద ప్రక్రియ చేపడుతున్నప్పుడు ప్రభుత్వం విపక్షాలను, ఆయా ప్రాంతాల ప్రజలను సమావేశపరచి నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఏకపక్షంగావిభజన చేయడం ఎంతవరకు సమంజసమన్నది అసలు ప్రశ్న. 

జీహెచఎంసీపై తాను తీసుకోబోయే నిర్ణయం విషయంపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖాత చేయడంలేదు. మెరుగైన పాలనతో పాటు ప్రజలకు మంచి పాలన అందించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేస్తోంది. విచిత్రమేమంటే కాంగ్రెస్‌లోనే ఈ నిర్ణయంపై విభేదా లున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇటువంటి కీలక నిర్ణయం తీసుకునేముందు తమ అభిప్రా యాలను పరిగణలోకి తీసుకోలేదని కొందరు నాయకులు మదనపడుతున్నట్టు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది రేవంత్ తీసుకోబోయే ఈ నిర్ణయాన్ని కేవలం ఏకపక్షమని, రాజకీయ ప్రయోజనాలమాట అట్లావుంచి దీర్ఘకాలంలో ఇప్పుడు మనం అంచనా వేయలేని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈనిర్ణయం బూమరాంగ్ అయితే సరిదిద్దుకోలేని తప్పుగా మారుతుందని కూడా వారు భయపడు తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం తప్పని భావించి మళ్లీ జీహెచఎంసీని ఏకం చేయాలనుకున్నా ఢిల్లీలో మాదిరిగా ముక్కలు చేసిన వాటిని తిరిగి ఏకం చేయడం దుస్సాధ్యమన్నది కూడా వారి అభి ప్రాయంగా కనిపిస్తున్నది. ఇదిలావుండగా జీహెచఎంసీని మూడు ప్రాంతాలుగా విడగొట్టట్టే అంశంపై ఈ ఏడాది ప్రారం భంలో సీరియస్‌గా చర్చించినప్పటికీ, విభజన ప్రక్రియకు సంబంధించిఒక నిర్ణయానికి రానట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తు న్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నే కొందరు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే, మరికొందరు సమ ర్థించినట్టు చెబుతున్నారు. ప్రస్తుత జీహెచఎంసీ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఒకనిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈనెల 10వ తేదీతో జీహెచఎంసీ టర్మ్ ముగిసిపోతున్న నేపథ్యంలో, ఐ.టి.శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికైతే జీహెచఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడ గొట్టే ఆలో చన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేయడం కొసమెరుపు!

ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు….

ప్రభుత్వ పాఠశాలలో సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జూకల్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ బేస్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించామని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ చిర్రా రఘు హాజరై సాఫ్ట్ బాల్ బేస్ బాల్ క్రీడల గురించి మాట్లాడారు ఈ పోటీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ మంచిక అభినవ్ వినయ్ కుమార్ సారధ్యంలో జిల్లాలోని 12 మండలాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరై వారి ప్రతిభను చాటారని మాట్లాడడం జరిగింది . ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన విద్యాశాఖ ఏఎమ్ఓ పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల వలన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పేరు రావడం శుభ పరిణామమని మాట్లాడడం జరిగింది ఈ పోటీలలో గెలుపొందిన వారిని తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ బేస్ పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు బండి ప్రసాద్ గాజర్ల శ్రీనివాస్ తెలియజేశారు ఈ క్రీడా పోటీలలో ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి బండి ప్రసాద్ నూకల లింగయ్య గాజర్ల శ్రీనివాస్ పూర్ణిమ సమ్మయ్య హేమలత కళ్యాణి సులోచన దొడ్డ శ్రీలత రాధికా రాణి స్వరూప సంఘ రఘుపతి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి ఘటించిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు….

శ్రద్ధాంజలి ఘటించిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…

 

మండలంలోని కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అశ్వాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ పొడియం అడమయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నిమ్మల వెంకన్న,సత్రపల్లి సాంబశివరావు,మండల కన్వీనర్ కొమరం కాంతారావు,ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ లు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వారు మాట్లాడారు అశ్వాపురం గ్రామం ఏర్పడిన నాటినుండి గ్రామ అభివృద్ధి కొరకు సిపిఎం పార్టీ అండతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారని వారన్నారు పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని అడమయ్య పోడు భూముల పోరాటం మండలం లోని అనేక గ్రామాల్లో పోడు భూముల పోరాటం వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని మంచినీరు, రేషన్ కార్డులు ఇతర సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటంలో పాల్గొన్నాడని వారన్నారు గ్రామం ఏర్పడిన ముందు తరం గ్రామస్తులలో ఒకడని ఊరుని నిలబెట్టిన వ్యక్తిగా అడమయ్య చరిత్రలో నిలిచారన్నారు ఈరోజు అడమయ్య లేకపోవడం పార్టీకి తీరని లోటని వారు అన్నారు ఆశయాలు కొనసాగించాలని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు అడబాయ కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తూ కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కోవ్వాసి వెంకటేశ్వర్లు, పద్దం బాబురావు, పదం సత్యం తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధిని చూసి ఓటు వేయండి : మాజీ ఎమ్మెల్యే మలి పెద్ద సుధీర్ రెడ్డి…

అభివృద్ధిని చూసి ఓటు వేయండి : మాజీ ఎమ్మెల్యే మలి పెద్ద సుధీర్ రెడ్డి

* అలియాబాద్ లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే మల పెద్ద సుధీర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ లోని 7, 8వ వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అందించారని అన్నారు. ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలియాబాద్ లోని 7వ అభ్యర్థి తంటం యాదగిరి, 8వ అభ్యర్థి కంఠం శ్వేత కృష్ణారెడ్డి లను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రమేష్, మాధవరెడ్డి, బాలేష్, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం…

అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు,అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేయాలని తెలిపారు.ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని,గత ప్రభుత్వ పాలకుల వలనే పరకాల పట్టణం వెనుకబడిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.పట్టణంలో సిసి రోడ్,డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు మరిన్ని వసతులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 వంట గ్యాస్,నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ చీరలు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎస్పీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

మున్సిపాలిటీ ధర్మసమాజ్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం ఝాన్సీ సుమన్ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని,మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గడ్డం సుమన్,గడ్డం శివకుమార్, గడ్డం విశ్వనాథం, మధుసూదన్,గజవెల్లి రాజు, గడ్డం సతీష్,గడ్డం వెంకటయ్య,గడ్డం ఆంజనేయస్వామి,గడ్డం రాజమ్మ,దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం…

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం

◆-: పేదల కష్టాలు తెలిసిన కుటుంబం మాది.. 5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా!

◆-: రంజోల్ మాజీ సర్పంచ్ ఆశయ సాధనలో ‘అమ్ముల మధులత’.. ‘ఎయిర్ కండిషనర్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో 5వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన అమ్ముల మధులత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన అజెండాను, వార్డు అభివృద్ధిపై తనకున్న దూరదృష్టిని ప్రజలకు వివరించారు.
సేవాయే పునాది – మామయ్య ఆశయమే నా మార్గం గతంలో రంజోల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు, తన మామయ్య గారు కొన్ని దశాబ్దాల పాటు సర్పంచ్‌గా సేవలందించారని అమ్ముల మధులత గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. “మా మామయ్య గారి హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయన చూపిన సేవా మార్గమే నాకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, నేడు నేను మీ ముందుకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చాను,” అని మధులత తెలిపారు.ఇంటి వద్దకే పాలన – అర్హులకే పథకాలు ప్రజలు గెలిపిస్తే వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. “ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం నిజమైన అర్హులకే అందేలా చూడటమే నా ప్రథమ లక్ష్యం. వార్డులోని ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా, అవసరం ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి సాయం చేసేలా నా పాలన ఉంటుంది,” అని ఆమె స్పష్టం చేశారు.ఎయిర్ కండిషనర్ (AC) గుర్తుకే మీ ఓటు(ఫిబ్రవరి 11న) జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నెంబర్ 4 వద్ద ఉన్న తన ఎన్నికల గుర్తు ‘ఎయిర్ కండిషనర్’ (Air Conditioner) పై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం సేవ చేయాలనే దృక్పథంతో వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలను ఆమె కోరారు.

తాళ్లూరి సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ…

తాళ్లూరి సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ.

కారేపల్లి నేటిదాత్రి

ఖమ్మం జీల్లా సింగరేణి మండల కెంద్రం లోని అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్న తాళ్ళురి సుందర్ రావు ఇటీవల అనారోగ్యతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సర్పంచ్ మెదరి టోని సుందర్ రావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని నేను మికు ఎల్లవెళల అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
వారి దశాదిన కార్యక్రమానికి వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కాలనీ యూత్ దామెర్ల నాగి వడ్ల కొండ సాంబా చికూర్తి రమెష్ చికుర్తి లవన్ ఆదెర్ల రాములు చిలుముల కమలాకర్ తాళ్ళురి రాజా తాళ్ళురి రాజు కాకాటి సాయి తదితరులు కార్యక్రమంలో పాల్గోన్నారు.

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం…

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం

◆-: మునిసిపల్ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీలో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నా

◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో ప్రారంభమై 16 వార్డుల అభ్యర్థులకు మద్ధతుగా బీదర్ బేస్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 ఏండ్ల బి.ఆర్.స్ పాలనలో కోహిర్ పట్టణం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు, ఎ బస్తీకి కి వెళ్లినా ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం,ఒక్కరు కూడా వారి పాలనలో వారిని పట్టించుకున్నా పాపాన పోలేదు. అందుకని మీకు మాట ఇస్తున్నాం మన పార్టీ ప్రకటించిన 16 వార్డు సభ్యులను మీరు ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధిని మీ ముందుకు తీసుకువచ్చి గెలిచిన సభ్యులతో పని చెప్పించే బాధ్యత నాది.అందుకని రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమా పథకాలు అమలుఅవుతున్నాయి..ఈ అభివృద్ధి పరంపర ఇలాగే కొనసాగలంటే అధికార పార్టీకి ఓటు వేసి కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరడం జరిగింది.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శంషీర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియోద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్,16 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోహిర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

కొత్తకోట లో బీ ఆర్ ఎస్ ప్రచారంలో మాజీ ఎంపీ రావుల…

కొత్తకోట లో బీ ఆర్ ఎస్ ప్రచారంలో మాజీ ఎంపీ రావుల

వనపర్తి నేటిధాత్రి వనపర్తి జిల్లా

 

 

 

కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల తరుపున మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు చేసినమాజీ ఎమ్మెల్యే, మాజీ రావుల చంద్రశేఖర్ రె డ్డి వెంట మాజీ ఎంపీపీ గుంతమౌనిక మల్లేష్ బీ ఆర్ ఎస్ నేతలు ఉన్నారు

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

21 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

స్థానిక 21వ వార్డ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని 21 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ స్పష్టం చేశారు.21 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో లో సింగరేణి ఖాళీ స్థలాల్లో పట్టాలు ,76 జీవో ద్వారా ఇళ్లపట్టాలు రానివారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వీధుల్లో రోడ్లు, డ్రైన్లు, సరైన మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు…

ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు

* ప్రమాదంలో ముగ్గురికి కాళ్ళు విరిగి,
మరో ఇద్దరికీ వెన్నెముకకు గాయాలయ్యాయి
* క్షతగాత్రులను పరామర్శించిన దేవర సమతారెడ్డి
, ఆగిరెడ్డి, మంగలి బాల్ రాజ్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఆగిఉన్న కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి వ్యక్తులపైకి దూసుకొచ్చి
పలువురికి తీవ్ర గాయాలయిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలో చోటుచేసుకుంది. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డులోని రంగారెడ్డి కాలనీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో పాల్గొన్న వార్డు ప్రజలు , ప్రచారం ముగించుకుని సీపీఐ కాలనీలో ఏర్పాటుచేసిన టెంటు వద్ద బోజనాలు చేసేందుకు వచ్చి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు సేద తీరుతున్నారు. అదే సమయంలో హైద్రాబాద్ కు చెందిన TS 09FW0024 (మహీంద్రా థార్) కారు
వ్యక్తి రెవెన్యూ కార్యాలయానికి భూమి రిజిస్ట్రేషన్ కు వచ్చి జనాలకు దగ్గరగా హడావుడిగా కారును నిలిపి వెళ్లిపోయారు. కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయటం మర్చిపోవటంతో కారు నెమ్మదిగా కదులుతూ పక్కనే భగత్ సింగ్ కాలనీకి చెందిన ఒడ్డె జంగమ్మ, మంగలి సరస్వతి, గుండాల మంగమ్మ, సన్నాయిల జయమ్మ, ఒడ్డె రాములమ్మ (70)లపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒడ్డె జంగమ్మ (60) మంగలి సరస్వతి (26)గుండాల మంగమ్మ (60) కు కాలు విరిగాయి. రాములమ్మ, జయమ్మ (62) లకు నడుముకు,వెన్నుకకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలించారు.

• క్షతగాత్రులను పరామర్శించిన దేవర సమతారెడ్డి

చేవెళ్లలో జరిగిన కారు ప్రమాదం ఘటన తెలుసుకున్న చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి దేవర సమతా వెంకట్ రెడ్డి, చేవెళ్ల పిసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, బండారి ఆగిరెడ్డి, మాజీ ఎంపిపి మంగలి బాల్ రాజ్, విషయం తెలియగానే హుటా హుటిన ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి గాయపడిన వారిని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మంగలి యాదగిరి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, 17 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మూడవత్ క్రిష్ణ నాయక్, నాయకులు అతేల్లి రవీందర్ రెడ్డి, బేగరి శ్రీనివాస్,పలువురు ఉన్నారు.

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్. భరత్ నగర్ .గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. భవన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగాపనిచేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో .దూసుకెళ్తున్నారని అలాగే ఇదివరకు చేసిన పాలకులు రాష్ట్రాన్ని ప్రజలనుకోలుకో లేకుండా .రాష్ట్రాన్ని అప్పుల.పాలు చేశారని దానిని అధిగమించుకుంటూ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకు వస్తున్నారని ఇందులో భాగంగా మహిళ అభివృద్ధి ప్రత్యేక లక్ష్యంగా మహిళా సంఘ భవనానికి .ఈజీఎస్ నిధుల ద్వారా మహిళా సమైక్య భవనానికి 10 లక్ష రూపాయలు మంజూరు కాగా ఈరోజు భవన నిర్మాణానికి సర్పంచి చిట్యాల దేవేంద్ర వెంకన్న చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని ఇట్టి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్ పెద్దలకి నాయకులకు ప్రతి ఒక్కరికి మహిళా .సౌమ్యక్య సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు. గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి. శిరీష.ఏపిఎం. చంద్రయ్య.సీసీలు. బాలరాజు.యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు .మునిగేలరాజు. భాను. నాగరాజు. మహిళా సమ్మెక్యసంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బోరు మోటర్ రిపేరు చేయించిన సర్పంచ్….

బోరు మోటర్ రిపేరు చేయించిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బోరు మోటర్ రిపేర్ చేయడం జరిగింది. సందర్భంగా మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ. వచ్చే వేసవి కాలంలో తాగు నీటి సమస్య రాకుండా ఉండడానికి ఈరోజు మండే పల్లి గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో అంగన్వాడి సెంటర్ దగ్గర చేతి బోరు రిపేరు చేయించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విలలో గ్రామపంచాయతీ పాలకవర్గం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తున్నాయి ఏమైనా సమస్యలు ఉంటే గ్రామంలో పాలకవర్గ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచి గాధగోని సాగర్ ఉపసర్పంచ్. యాస మధు. కారోబార్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

నాగుర్ల కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…

నాగుర్ల కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

ఫర్టిలైజర్ రాష్ట్ర అధ్యక్షుడి గా ఇటివలె నూతనంగా ఏకగ్రీవం గా ఎన్నికైన నాగుర్ల వెంకటేశ్వర్ల కు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన నడికూడ ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకటి నాగేష్,వాంకె రాజు, నారగాని రాజేష్ తదితరులు ఉన్నారు.

ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

11వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

ప్రజా సేవ చేస్తూ, 11వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటానని బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాజీ నగర్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు లోని సమస్యలను పరిష్కరిస్తానని గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 11వ వార్డు ప్రజలను, ఓటర్లను కోరుతున్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

error: Content is protected !!
Exit mobile version