మల్యాల గ్రామపంచాయతిలో కేవైసీ అప్డేట్స్ మరియు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు….

మల్యాల గ్రామపంచాయతిలో కేవైసీ అప్డేట్స్ మరియు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు.

చందుర్తి, నేటిధాత్రి:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మల్యాల బ్రాంచ్ మరియు స్థానిక అధికారుల సమన్వయంతో మల్యాల గ్రామపంచాయతిలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ జి ఎం సురేష్, మల్యాల బ్యాంక్ మేనేజర్ తిరుపతి, చందుర్తి ఎంపీడీవో రాధా,చందుర్తి ఎంపీఓ ప్రదీప్ కుమార్, అలాగే సర్పంచ్ శ్రీ శారద, మరియు ఉపసర్పంచ్ అనపర్తి నరేష్, వార్డ్ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ మందాల ఆబ్రహం, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, సెక్రటరీ నరేందర్ హాజరై గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేవైసీ అప్‌డేషన్, మ్యూల్ అకౌంట్ల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఆర్థిక అక్షరాస్యత అవగాహనా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో…

ఆర్థిక అక్షరాస్యత అవగాహనా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో

ఇబ్రహీంపట్నం.నేటిదాత్రి

 

మండలంలోని, వర్షకొండ గ్రామం లో యూనియన్ బ్యాంకు మరియు విడ్స్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో అవగాహనా సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.బ్యాంకు అందిస్తున్న వివిధ సేవల ద్వారా సామాన్య పౌరుడు ఎలా ఆర్థికంగా అక్షరస్యాతను సాదించగలడో అందరికి అవగాహన కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోనకంటి వెంకట్,ఉప సర్పంచ్ జయ.నర్సయ్య, గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, మరియు, బ్యాంకు మిత్ర, అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్, వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన..

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన

సృజనాత్మకత పెంపొం దించే దిశగా విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలకేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు శనివారం స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. పోస్ట్ కార్డు రాసి పంపించే విధాన ము, డబ్బులు జమ, డబ్బు లను తీసే విధానంలో మెలు కువలు అవగాహన కల్పిం చారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం ప్రజలకు ఉపయోగ పడతాయని తెలిపారు అదే విధంగా బ్యాంకు వల్ల ప్రయో జనాలు, రేషన్ షాపు వల్ల ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఆలోచించే తత్వం, సృజనా త్మకత పెంపొందించే దిశగా నడవడం కోసం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేవతి, సుభాష్ చంద్రబోస్, పిఈటి దన్ పాల్, మల్లేశం, సుధాకర్ విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version