శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని మహేంద్ర కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో 24వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీవారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పూజారులచే జరిగిన ఈ కళ్యాణానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ పటిష్టమైన ఏర్పాట్లు చేయగా, మహిళా భక్తుల కోలాటం, శ్రీవారి ఊరేగింపు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
