నిమ్జ్‌ నిరీక్షణకు తొలగిన తెర….!

నిమ్జ్‌ నిరీక్షణకు తొలగిన తెర….!

◆”-: రూ:10628 కోట్ల పెట్టుబడులతో మౌలిక వసతులు

◆”-: పలు కంపెనీలకు 1186 ఎకరాల భూముల కేటాయింపు

◆”-: తొలి దశలో..”కంపెనీల ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపనలు”..!

◆”-: కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, నిర్మలా జగ్గారెడ్డిల చొరవతో చురుగ్గా పనులు పరిశ్రమల ఏర్పాటుతో వేలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఊపొందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం

◆-: నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాట్లపై “(నేటి ధాత్రి)” ప్రత్యేక కథనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్, పలు పరిశ్రమల ఏర్పాటు కోసం 201355.. 51 . 49 మేర కేంద్ర పెట్టుబడులతో ఏర్పాటు చేసిన “జాతీయ పెట్టు బడులు ఉత్పాదకమండలి” (నిమ్జ్‌) ప్రాజెక్టు ఏర్పాటుకు 14 సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు తెరపడింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ల చొరవతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు చక చక కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్‌ ప్రాజెక్టు పనుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ఏర్పాటుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్, ఝరాసంఘం మండలా ల్లోని 17 గ్రామాల్లో.. దాదాపు 12600 ఎకరాల్లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేపట్టింది.ఈ నెల మార్చ్ 2న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, విశాలాక్షి, జహీరాబాద్ ఆర్థిఓ దేవుజా, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, పరిశ్రమల యాజమాన్యంతో..”పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన” తదితర అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సేకరించిన నిమ్జ్‌ భూముల్లో సర్వే చేపట్టి, హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రసక్తే లేదని, పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

శరవేగంగా మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం..

ఈ పాటికే పలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ముమ్మురంగా పనులను చేపట్టింది. తొలి విడతగా న్యాల్ కల్, ఝరాసంఘం మండలాల్లో 3500లను గుర్తించిన భూముల్లో 3245 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు మార్చ్ తొలి వారంలో కసరత్తు చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, డీఎస్పీ, తహసిల్దార్లు, సీఐ, పోలీస్ బృందం రక్షణలో స్థానిక భూ నిర్వాసితులతో చర్చించి ఈ పాటికే సేకరించిన భూముల్లో సర్వే చేపట్టి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్తు, సీసీ రోడ్లు, నీటి సౌకర్యం, కార్మికుల కోసం షెడ్ల ఏర్పాట్లు, తదితర పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

1186 ఎకరాల్లో.. రూ:10628 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు..

తొలిదశ పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారంలో భాగంగా అధికార యం త్రాంగం పలు పరిశ్రమల ఏర్పాటుకు 1186 ఎకరాలను కేటాయిం చింది. కేటాయించిన భూముల్లో “హ్యుందాయ్” (కార్ల పరిశ్రమ) కంపెనీ ఏర్పాటు కోసం కంపెనీ యాజమాన్యం ఇటీవలే కేటాయించిన భూము లను పరిశీలించింది. 511ఎకరాల్లో రూ:1000 కోట్లతో ఈవీఎం టెక్నాలజీ సంస్థ ఈ పాటికే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా 675 ఎకరాల్లో రూ.8528 కోట్లతో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. రూ:2100 కోట్లతో ఎలక్ట్రానిక్ కార్ల తయారీకి ఈ వాటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రాజెక్టుల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పూర్తిచేరినట్లు తెలుస్తోంది.

హద్దురాళ్లను తొలగిస్తే చర్యలు, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం..

పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టి హద్దురాళ్లను ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగిస్తే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అధికార బృందానికి ఆదేశించారు. నిమ్స్ ఆధీనంలోని భూముల్లో రైతులు సాగుచేసిన పంట లకు నష్టం కలిగించకూడదని, తప్పనిసరిగా పంటలకు నష్టం వాటిల్లితే సంబంధిత భూ.నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ స్థానిక అధికార బృందానికి ఆదేశించినట్లు సమాచారం.

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం…

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం.

◆-: మాపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవి కావు.

◆-: మా భూముల పై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాతే పరిహారం అందించారు.

◆-: చిలేపల్లి తండా మహిళా రైతు గేనీ బాయ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరా సంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్ ) ఏర్పాటుకు 2012లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్ పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 7,500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. నిమ్జ్ భూ సేకరణలో భాగంగా చీలపల్లి తాండ పరిధిలోని సర్వే నంబర్ 151 లో ఆరుగురు రైతుల పైన 20.33 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమి రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు అధికారులు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదయింది. ఇట్టి భూమిలో ఆరుగురు రైతులు గత 30 సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిమ్జ్ భూసేకరణ లో భాగంగా ఇట్టి భూమి నష్టపరిహారం అధికారులు మాకు ఇవ్వలేదు. ఇట్టి విషయంపై మేము తెలంగాణ హైకోర్టుకు అప్పిలు చేసినాము.. నిమ్జ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు మా యొక్క కేసును వాపు తీసుకున్నచో నష్టపరిహారం ఇస్తామని తెలిపినారు. తెలంగాణ హైకోర్టులో ఇట్టి కేసును 119/2012 కేసును మేము విత్ డ్రా చేసుకున్నాము. ఇటి కేసు విత్ డ్రా చేసుకున్నట్లు జూన్/ 7 /2024లో కేసును రాజీ కుదుర్చుకున్నట్లు నిమ్జ్ ప్రత్యేక అధికారులకు సమర్పించిన తదుపరి వారు విచారణ వారు పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు ల చుట్టూ తిరిగి కేసుల నుండి రాజి కుదుర్చుకున్న తర్వాత నిమ్జ్ అధికారులు ఇట్టి సర్వే నంబర్ భూములపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాకు నష్టపరిహారం అందించారు. మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా కుటుంబ సభ్యులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఆసత్యపు ఆరోపణలపై మా కుటుంబ సభ్యులం ముక్తకంఠంతో త్రీవంగా ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారు. ఈ విషయంలో కొందరు కావాలని మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బులకు ఆశపడి ఇతరులు చెప్పుడు మాటలు విని మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆరోపణలు నిరాధారణమైనవి కావు. ఈ సమావేశంలో జాదవ్ ధర్మీబాయి, సుమిత్ర బాయ్, మోతి బాయ్ , రేఖ భాయ్, సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version