న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం…

న్యాయం ప్రకారమే నష్టపరిహారం అందుకున్నాం.

◆-: మాపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు నిర్ధారమైనవి కావు.

◆-: మా భూముల పై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసిన తర్వాతే పరిహారం అందించారు.

◆-: చిలేపల్లి తండా మహిళా రైతు గేనీ బాయ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరా సంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్ ) ఏర్పాటుకు 2012లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్ పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 7,500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. నిమ్జ్ భూ సేకరణలో భాగంగా చీలపల్లి తాండ పరిధిలోని సర్వే నంబర్ 151 లో ఆరుగురు రైతుల పైన 20.33 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమి రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు అధికారులు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగా నమోదయింది. ఇట్టి భూమిలో ఆరుగురు రైతులు గత 30 సంవత్సరాల నుండి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నిమ్జ్ భూసేకరణ లో భాగంగా ఇట్టి భూమి నష్టపరిహారం అధికారులు మాకు ఇవ్వలేదు. ఇట్టి విషయంపై మేము తెలంగాణ హైకోర్టుకు అప్పిలు చేసినాము.. నిమ్జ్ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు మా యొక్క కేసును వాపు తీసుకున్నచో నష్టపరిహారం ఇస్తామని తెలిపినారు. తెలంగాణ హైకోర్టులో ఇట్టి కేసును 119/2012 కేసును మేము విత్ డ్రా చేసుకున్నాము. ఇటి కేసు విత్ డ్రా చేసుకున్నట్లు జూన్/ 7 /2024లో కేసును రాజీ కుదుర్చుకున్నట్లు నిమ్జ్ ప్రత్యేక అధికారులకు సమర్పించిన తదుపరి వారు విచారణ వారు పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు ల చుట్టూ తిరిగి కేసుల నుండి రాజి కుదుర్చుకున్న తర్వాత నిమ్జ్ అధికారులు ఇట్టి సర్వే నంబర్ భూములపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాకు నష్టపరిహారం అందించారు. మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మా కుటుంబ సభ్యులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఆసత్యపు ఆరోపణలపై మా కుటుంబ సభ్యులం ముక్తకంఠంతో త్రీవంగా ఖండిస్తున్నాం. మాకు ప్రభుత్వ అధికారులు పూర్తి విచారణ అనంతరం మాకు నష్టపరిహారం అందజేశారు. ఈ విషయంలో కొందరు కావాలని మాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బులకు ఆశపడి ఇతరులు చెప్పుడు మాటలు విని మమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆరోపణలు నిరాధారణమైనవి కావు. ఈ సమావేశంలో జాదవ్ ధర్మీబాయి, సుమిత్ర బాయ్, మోతి బాయ్ , రేఖ భాయ్, సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్లో నిమ్జ్‌ జోష్…

జహీరాబాద్లో నిమ్జ్‌ జోష్

◆:- అందరి దృష్టి జహీరాబాద్ వైపు

◆:–ఇది వరకే వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు

◆:- దేశం నలుమూలల నుంచి పెట్టుబడులు

◆:- తారుస్థాయికి చేరుతున్న రియల్ ఎస్టేట్

◆:- అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు

ఒకప్పుడు నిమ్జ్‌ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్‌) మొదటి దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెరపడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. అందరి దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: ఒకప్పుడు నిమ్స్ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ కట ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దా లుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్‌) మొదటి దశకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టే ట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ప్రభుత్వం నిమ్స్ ఫస్ట్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెర పడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. పదేళ్ల కాలపరిమితితో 2012లో మొదలైన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్‌) కల, పుష్కరం పాటు కలగానే ఉండిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, భూముల
ధరల పెరుగుదల … తదితర అంశాలు ఒకప్పుడు కేవలం చర్చలకే పరిమితమయ్యాయి, కానీ, ఇప్పుడు ఆ నిరీక్షణకు తెర పడింది. నిమ్స్ ప్రాజెక్ట్ మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అందర్ దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.

పుంజుకున్న రియల్ వ్యాపారం..

కొంతకాలంగా మందగించిన భూముల వ్యాపా రం ఒక్కసారిగా వేగం పంజుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడిదా రులు, మళ్ళీ ఆహీరాబాద్ వైపు దృష్టి సారించారు. నిమ్ మొదటి దశ అభివృద్ధి పనులకు నవంబర్ నెలలో లేఔట్ పనులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటిం చదంతో, భూముల ధరలు అమాంతం పెరిగాయి. జాతీయ రహదారుల పొడవునా ఉన్న భూముల ధరలు ఏకంగా వికరం రూ.4 కోట్లు దాటగా, ఇతర రహదారు. లపై కూడా రూ. కోటి కంటే ఎక్కువగా పలకుతున్నాయి. నిమ్డ్ ప్రాజెక్ట్ మొత్తం 12.635 ఎకరాల్లో విస్తరించనుం డగా మొదటి దశలో 3.245 ఎకరాలకు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2369 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ పురోగతి వ్యాపారులకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.

దేశం నలుమూలల నుంచి పెట్టుబడులు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడంతో, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబదులు జహీరాబాద్ కు తరలివచ్చు అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు: మొదలైతే, దానికి అనుబంధంగా ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనికి తోడు విమా నాశ్రయాలు అదనపు ఆకర్షణలున్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125. కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రం బీదర్ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్టుబడల ఆకర్షలు. ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగేందుకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి. నిమ్స్ మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, కేవలం స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు. జహీరాబాద్ వైపు చూస్తున్నారు. భారీ పరిశ్రమలు. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలైతే వేలాది ఉద్యోగాలు వస్తాయి. దీంతో నివాస ప్రాంతాల అవసరం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు భూములతో పాటు ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అనేక కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మార్చేసేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

భవిష్యత్తు వైపు చూపు..

నిమ్జ్‌ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపాదాన్ని మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కొత్త పరిశ్రమలు, ఉపాది అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు జహీరాబాద్ ను ఒక కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా మారు స్తాయి. ఎంతోకాలంగా నిరీక్షించిన ఈ శుభవార్తతో. జహీరాబాద్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. భూముల వ్యాపారం మళ్లఈ జోరందుకోవడమే కాకుండా, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఇదో మైలు: రాయిగా నిలుస్తోంది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version