జహీరాబాద్ అభివృద్ధి ఎంఐఎం పార్టీతో సాధ్యం…

జహీరాబాద్ అభివృద్ధి ఎంఐఎం పార్టీతో సాధ్యం…

◆-: ప్రచారంలో దూసుకుపోతున్న ఎంఐఎం పార్టీ

◆-: బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం భాగంగా సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే పల్సర్ మోహియోద్దీన్
అధ్యక్షులు అత్తర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ . పూర్తిగా విఫలమైందని బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈద్గా మైదానంలో వద్ద, మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన సమావేశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో లో బీజేపీ కేవలం కుల మతాల డి మధ్య చిచ్చులు పెట్టి ఓట్లను దండుకొని దేశంలో శాంతి పద్ధతులకు భంగం వాటిల్లో విధంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా తప్పుడు ఆలోచనతో బీజేపీకి మరియు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఓటు వేస్తే ఆ ఓటు మురుగునీటి కాలువలు వేసినట్టేనని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఏఐఎంఐఎం పార్టీ కృషి చేస్తుందన్నారు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి మోకాళ్ళ అడ్డు వేసిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం హజ్ హౌస్, స్మశాన వాటిక స్థలం,షాది ఖానాలకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వాటన్నిటిని రద్దు చేసిందని విమర్శించారు. హిందూ ముస్లింలు రెండు కండ్ల లాంటి వాళ్లు తమరి పూర్తిగా లౌకిక పార్టీ అన్నారు.తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించక పోతే అభివృద్ధి కోసం నిధులివ్వమని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, నిధుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం తాము కొట్లాడి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బి ఆర్ ఎస్ అభ్యర్థుల ను గెలిపించి కాంగ్రెస్ పార్టీ కి, రేవంత్ రెడ్డి కి బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన బాష విని పిల్లలు పాడవుతారని, ఇళ్లలో పెద్దలు ఛానల్ మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీ ప్రచార భాగంలో గౌరీ సహబ్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ రఫీ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ కృష్ణాపుర్ అధ్యక్షులు యునుస్ దిగ్వాల్ అధ్యక్షులు వాజీత్ షాకపూర్ అధ్యక్షులు పటేల్ మరియు నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు,

రాంపూర్ లో ఉపాధి హామీ పనులు ప్రారంభం…

రాంపూర్ లో ఉపాధి హామీ పనులు ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

జాతీయ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పనులను నిజాంపేట మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్, కార్యదర్శి చంద్ర హాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందరోజుల కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సతీష్ గౌడ్, దుర్గారావు తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు.

కేటీఆర్ సభకు ర్యాలీగా బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

కేటీఆర్ సభకు ర్యాలీగా బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా నేడు ప్రచారం చివరి రోజు కావడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరైన నేపథ్యంలో 18వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీతో కార్నర్ మీటింగ్ కు కార్యకర్తలతో వెళ్లడం జరిగింది

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా….

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా

బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆపిల్ బాల్

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సుభాష్ కాలనీ 29 వార్డు అభివృద్ధి చేస్తానని ఆపిల్ బాలు అన్నారు
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా 29వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాపిల్ బాల్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ కాలనీ 29వ వార్డు ప్రజలు ఒక్కసారి నేను గతంలో ఓడిపోయాను రెండోసారి బిజెపి పార్టీ నుండి కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను గెలిచిన వెంటనే సుభాష్ కాలనీ సైడ్ డ్రైనేజీలు సిసి రోడ్లు వాటర్ సమస్య లేకుండా చేస్తాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

కేతకి ఆలయ ఈవో పై ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు.

◆-: కేతకి ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలి.

◆-: కేతకిలో ఉన్నత అధికారుల అనుమతి లేకుండానే ఉద్యోగాల నియామకము.

◆-: కేతకిలో అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని ఉన్నతాధికారులు.

◆-: మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్పపై సర్పంచుల ఫోరం ఝరాసంగం మండల మాజీ అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ హైదరాబాదులోని దేవాదాయ,ధర్మాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కేతకి ఆలయానికి ఇన్చార్జి ఈవో గా కొనసాగుతున్న ఆయన ఉన్నతాధికారుల ఉత్తర్వు లు సైతం లెక్కచేయకుండా పనిచేయడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుందన్నారు.

ఉన్నత అధికారులు నుండి ఎలాంటి ఆదేశాలు లేకున్నా తాత్కాలిక నియామకాలు చేపట్టి కొందరికి ఉద్యోగ అవకాశం కల్పించారని ఆయన వివరించారు. కేతకి ఆలయ ఈవో భక్తుల నుండి అధిక మొత్తంలో డొనేషన్లు వసూలు చేసిన వారికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. కేతకి ఆలయ గోశాల పేరిట అధిక మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయంలో ప్రవేటు ఉద్యోగులు, ప్రైవేట్ పూజారులు, ప్రజా ప్రతినిధుల లపై , భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గత రెండు రోజుల క్రితం ఆలయ ఈవో ముందే కేతకి ఆలయ చైర్మన్ పట్ల ప్రవేట్ పూజారి దురుసుగా మాట్లాడిన ఆలయ ఈవో ఏమి అనకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆలయానికి ఈవో గా ఉన్న ఆయనను దాదాపు 20 ఆలయాలకు ఇన్చార్జి ఈవోగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కేతకి ఆలయ ఈవో మూలంగా కేతకి ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. స్థానికేతురుడైన శాశ్వత ఈఓ ను నియమించి కేతకి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొగ్గుల జగదీశ్వర్ పేర్కొన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ…

ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో, మీ విలువైన ఓటును 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, చోటు కల్పించాలని. అభివృద్ధికి బాటలు వేసి వార్డు ప్రజల రుణం తీర్చుకుంటారని పట్టణంలోని, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ కోసం ఆదివారం సాయంత్రం జహీరాబాద్ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ బీఆర్ఎస్ నాయకులు. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని, కాలువ నిర్మాణాలు, రహదారుల ద్వారా సమస్యలు తీర్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోను, కోట్లాది రూపాయలు వార్డుల వారిగా వెచ్చించి అభివృద్ధి పనులు చేసేందుకు, మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారానికి మంచి ఆదరణ వస్తుంది. ఎక్కడికి వెళ్లినా మహిళా ఓటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు.

మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి…

మరచిపోయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని, తెలంగాణ 60 ఏండ్ల వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగన్ గూడ, లాల్ గడి మలక్పేట్ గ్రామంల్లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొని, భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపియ్యాలని కోరారు.

 

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మ రెడ్డి, యువనాయకులు dr భద్ర రెడ్డి, మధుకర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

 

కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..

 కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం (Cyber Fraud) జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతు నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.8.84 లక్షలు కాజేశారు..

యూట్యూబ్ రీల్స్ ద్వారా మోసం..

రైతు రమేశ్ యూట్యూబ్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో, తక్కువ ధరకు పాడి గేదెలను హోమ్ డెలివరీ చేస్తామంటూ ఓ పోస్ట్ కనిపించింది. ఆ పోస్ట్‌లో ఉన్న సెల్ నెంబర్‌కు కాల్ చేయగా, అవతలి వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి డీల్ ఖరారు చేసినట్లు సమాచారం.

లింక్ పంపిన కేటుగాళ్లు..

పాడి గేదెలను హోమ్ డెలివరీ చేయడం కోసం ఆన్‌లైన్‌లో డబ్బులు పంపాలని సదరు రైతుకు ఓ లింక్‌ను పంపించారు. వారి మాటలు నమ్మిన రైతు రమేశ్.. విడతలవారీగా మొత్తం రూ.8.84 లక్షలు పంపించాడు. డబ్బులు పంపిన తర్వాత కూడా పాడి గేదెలు హోమ్ డెలివరీ కాకపోవడంతో రైతు రమేశ్ అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఈ ఘటనపై దోమకొండ పోలీస్ స్టేషన్‌లో రైతు రమేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ మోసం కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలకు పోలీసుల సూచనలు..

పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ పోస్టులను నమ్మి డబ్బులు పంపొద్దని సూచించారు. తక్కువ ధర, హోమ్ డెలివరీ అంటూ వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

 

కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు..

 కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ (White Waters Construction Scam) సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఈ సంస్థపై అధికారులు కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్యలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో వైట్ వాటర్స్ పేరుతో అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను చేపట్టిన ఈ సంస్థ, వందలాది మంది కొనుగోలుదారులను నిలువునా ముంచింది. సుమారు 500 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ. 270 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పేరుతో డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.

న్యాయం చేయాలి..

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌ యజమాని అజయ్‌పై సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవిత కాల కష్టాన్ని ప్లాట్ల కోసం పెట్టుబడిగా పెట్టామని తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాదం.. పోలీసులకు ఫిర్యాదు..

 

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రాపర్టీ రూమ్‌లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు..

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రాపర్టీ రూమ్‌లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం (Nampally Forensic Lab Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‌స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మొదట ప్రాపర్టీ రూమ్‌లో భారీగా నల్ల పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకి వ్యాపించాయని తెలిపారు. శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో వెల్లడించారు.

ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..

ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..

వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ప్రత్యేకమైన రోజట. ఒక గులాబీ పువ్వుతో పాటు కొన్ని గిఫ్ట్స్ ఇస్తే.. మీ ప్రపోజల్ మరింత స్పెషల్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా మారుతుంది..

ఇంటర్నెట్ డెస్క్: వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమను వ్యక్తపరచడానికి చాలా ప్రత్యేకమైనది. చాలా మంది గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కానీ గులాబీతో పాటు ఓ మంచి బహుమతి ఇస్తే.. ఈ రోజు మరింత గుర్తుండిపోయేలా ఉంటుంది..
టెడ్డీ బేర్:

చాలా మంది అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ఇష్టం. వాటిని ఎప్పుడూ తమతోనే ఉంచుకుంటారు. కాబట్టి మీరు ఒక అందమైన టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇస్తే.. దాన్ని చూసినప్పుడల్లా ఆమె మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

ఫ్లవర్ బొకే:

మీరు ఫ్లవర్ బొకే ఇవ్వడం ద్వారా ప్రపోజ్ డేని మరింత స్పెషల్‌గా చేయొచ్చు. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు బహుమతుల కంటే బొకేలను ఇష్టపడతారు. అందమైన పూల బొకే ప్రేమకు చిహ్నం. బొకేతో పాటు ఓ చిన్న గ్రీటింగ్ కార్డు ఇస్తే మరింత స్పెషల్‌గా ఉంటుంది.

కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు..

కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు..

 

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు అయింది. ప్లాట్స్ కట్టిస్తామని చెప్పి మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 500 మంది నుంచి రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది..

హైదరాబాద్: కూకట్‌పల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు అయింది. ప్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల ప్రకారం.. సుమారు 500 మంది నుంచి దాదాపు రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పదేళ్లుగా వివిధ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు తీసుకుంటూ వచ్చినప్పటికీ, హామీల మేరకు ప్లాట్లు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై సంస్థ యజమాని అజయ్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై సైబరాబాద్ EOWలో సుమారు వంద మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసూలు చేసిన నిధుల వినియోగం, ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి వంటి అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..

మంచు విష్ణుకు పోలీసుల నోటీసులు.. ఏ2గా నమోదు..

 

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి.. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు.

 ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) విశ్వవిద్యాలయానికి సంబంధించి.. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు (Manchu Vishnu) చంద్రగిరి పోలీసులు ఆదివారం నోటీసులు పంపించారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు.
విద్యార్థి సంఘాల‌ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు సమర్పించాలని చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో మంచు విష్ణును ఏ2గా, మంచు మోహన్ బాబును ఏ3గా చేర్చారు. కిడ్నాప్ కేసులో పీఆర్వో సతీశ్(A1)తో పాటు పలువురు బౌన్సర్లు ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆ పల్లె కన్నీరుపెడుతోంది..

ఆ పల్లె కన్నీరుపెడుతోంది..

 

పేయలవానిపెంటలో ఉపాధి కరువు గ్రామం వదిలి వలసెళ్లిన జనం నేటికి కనీస వసతుల్లేవు శిథిలమైన గృహాలు…బీళ్లుగా భూములు

ములకలచెరువు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అది మారుమూల గ్రామం… కొండలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న అందమైన ఊరు… ఉపాధి లేని గ్రామం… భూములున్నా బోర్లు వేసుకుని సాగుచేసే స్థోమత లేదు… ఫలితంగా భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి… ఉపాధి కరువై సగం ఊరు ఖాళీ అయ్యింది… బతుకు దేవుడా అంటూ పట్టణాలకు వలసెళ్లారు… ఏ వైపు చూసినా శిథిలమైన, తాళాలు పడ్డ ఇళ్లే కనపడుతున్నాయి… ఇళ్ల వద్ద వృద్ధులే అధికంగా ఉన్నారు…పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఊరు కనుమరుగవుతోంది. ఇదే పేయలవానిపెంట గ్రామ ఘోష..

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు…

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు

డీఆర్‌డీఏ సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంస

డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఈ-సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన డీఆర్‌డీఏ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పీడీ శ్రీదేవితో కలిసి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుప్పం పట్టణం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి నమోదయ్యేలా 24 గంటల వ్యవధిలో  ఈ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవిషయంలో సంతోషం వ్యక్తం చేశారన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాలు, మహిళా సంఘాలను బలోపేతం లాంటి కార్యక్రమాల అమలుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు, ఏపీఎంసీసీ, సభ్యులు పాల్గొన్నారు.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్…

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలింది. ఒకానొక సందర్భంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాక్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. 162 పరుగులతో ఛేదనకు దిగిన అమెరికా.. 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు విజయం లాంఛనమైంది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్‌లో వ్యభిచార దందా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో విటులు..

హైదరాబాద్‌లో వ్యభిచార దందా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో విటులు..

 

హైదరాబాద్‌ నగరంలో వ్యభిచార దందాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు..

 హైదరాబాద్‌ నగరంలో వ్యభిచార దందాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వసంతనగర్ ప్రాంతంలోని జై శ్రీ వెల్‌నెస్ బ్యూటీస్ (Jai Sri Wellness Beauties) అనే స్పా సెంటర్ కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. మసాజ్ సెంటర్ పేరుతో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

ఏహెచ్‌టీయూ రంగ ప్రవేశం..

ఈ సోదాల్లో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (Anti Human Trafficking Unit) అధికారులు కీలక పాత్ర పోషించారు. పక్కా ప్లాన్‌తో స్పా సెంటర్‌పై దాడి చేసి, అక్కడ జరుగుతున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. స్పా సెంటర్‌లో ఉన్న 9 మంది విటులను ఏహెచ్‌టీయూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు.

పోలీసుల చర్యలు..

విటులను అప్పగించిన తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార నిర్వాహకులు ఎవరు..?, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో మసాజ్ సెంటర్ల పేరుతో ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఆటలు సాగేది ఇక్కడే..

ఆటలు సాగేది ఇక్కడే!

 

వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు.

వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు. అవి నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్‌), వాంఖడే స్టేడియం (ముంబై), అరుణ్‌ జైట్లీ స్టేడియం (న్యూఢిల్లీ), ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై), ఈడెన్‌ గార్డెన్స్‌ (కోల్‌కతా), ప్రేమదాస స్టేడియం, సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (కొలంబో), పల్లెకెలె స్టేడియం (క్యాండీ).

అద్భుతంగా నిర్మించిన ఈ వేదికలో ఫైనల్‌ (పాక్‌ ఫైనల్‌కు రాకుంటే) సహా ఏడు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 11 అంతర్జాతీయ టీ20లు నిర్వహించారు.. వీటిలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఏడు మ్యాచ్‌లు, మొదట బౌలింగ్‌ చేసిన జట్లు నాలుగు మ్యాచ్‌లు నెగ్గాయి. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.

స్కాట్లాండ్‌కు కలిసొచ్చింది..

స్కాట్లాండ్‌కు కలిసొచ్చింది..

 

వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్‌.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ మెగా టోర్నీని బాయ్‌కాట్‌ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.

 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్‌.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ మెగా టోర్నీని బాయ్‌కాట్‌ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. దీంతో ఏడోసారి వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం చేజిక్కించుకొంది. 2007, 2009, 2016, 2021, 2022, 2024ల్లో స్కాట్లాండ్‌ పొట్టికప్‌లో పాల్గొంది. అత్యుత్తమంగా 2021లో సూపర్‌-12కు చేరింది. 2024లో నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో త్రుటిలో సూపర్‌-8కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. అయితే, ఈసారి యూరోపియన్‌ రీజినల్‌ క్వాలిఫయర్స్‌లో ఇటలీ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిన స్కాట్లాండ్‌ నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇటలీ, నెదర్లాండ్స్‌ పొట్టికప్‌ బెర్త్‌లు పట్టేశాయి. కానీ, బంగ్లాదేశ్‌ జట్టు వైదొలగడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు జాక్‌పాట్‌ తగిలింది.
పెద్ద జట్లకు పారాహుషార్‌..

గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఇటలీ, నేపాల్‌తో స్కాట్లాండ్‌ ఆడనుంది. తమకంటే బలమైన జట్లకు షాకిచ్చిన చరిత్ర స్కాట్లాండ్‌ సొంతం. 2021లో బంగ్లాదేశ్‌, 2022లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఇక, 2024లో ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఈసారి అనూహ్యంగా చాన్స్‌ పట్టేసిన స్కాట్లాండ్‌ ఎవరికి ఝలక్‌ ఇస్తుందో చూడాలి. గ్రూప్‌లో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లలో ఒక్కరికి షాకిచ్చినా చాలు.. స్కాట్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలు బలపడతాయి.

అనుభవజ్ఞుడైన కెప్టెన్‌..

ఆల్‌రౌండర్‌ రిచీ బెరింగ్టన్‌ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టును స్కాట్లాండ్‌ ప్రకటించింది. వీరిలో 11 మంది గత టోర్నీలో ఆడిన వారే కావడం విశేషం. కెప్టెన్‌ బెరింగ్టన్‌ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. 2007లో అరంగేట్రం నుంచి అతడు 300 మ్యాచ్‌ల్లో 8 వేల పరుగులు సాధించాడు. 100 వికెట్లు పడగొట్టాడు. ఇక వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌ అయిన మాథ్యూ క్రాస్‌ మరో ప్రధాన ఆటగాడు. బ్రాడ్లీ క్యూరీ పేస్‌ విభాగానికి నాయకత్వం వహించనుండగా.. యువ పేసర్‌ జైనుల్లా ఇహ్సాన్‌ తొలిసారి జట్టులోకి వచ్చాడు.

ఎంత ప్రైజ్‌మనీ రావచ్చు?

టోర్నీలో ఆడినందుకు ఆయా బోర్డులకు ఐసీసీ రూ. 2.75 కోట్ల నుంచి 4.60 కోట్ల వరకు చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రపంచకప్‌లో నెగ్గిన ప్రతీ మ్యాచ్‌కు చెల్లించే రూ.30 లక్షలు అదనం.

సూపర్‌-8కు చేరుకోలేకపోయినా..

నేపాల్‌, ఇటలీపై స్కాట్లాండ్‌ నెగ్గే చాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్‌ దాదాపు రూ. 5.50 కోట్ల వరకు ప్రైజ్‌మనీని పొందే అవకాశాలున్నాయి.

error: Content is protected !!
Exit mobile version