ఆదివారం మీదనే ఆశలు బేరాలకోసం చిరు వ్యాపారుల ఎదురుచూపులు…

ఆదివారం మీదనే ఆశలు బేరాలకోసం చిరు వ్యాపారుల ఎదురుచూపులు

గతంలో వ్యాపారాలతో కలకలలాడిన పరకాల నేడు కలతప్పింది

పరకాల,నేటిధాత్రి

 

ఒకప్పుడు వ్యాపార సందడితో కలకలలాడిన పరకాల పట్టణం నేడు నిశ్శబ్దంగా కనిపిస్తోంది.రద్దీగా ఉండే చిరు వ్యాపారాల స్థలాలు,ప్రాంతాలు ఇప్పుడు కస్టమర్ల లేమితో వెలవెలబోతున్నాయి. గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోళ్లతో కళకళలాడిన దుకాణాలు,చిరు వ్యాపారాలు ప్రస్తుతం గిరాకీ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా కూరగాయలు,పండ్లు, దుస్తులు విక్రయాలు గణనీయంగా పడిపోయాయి.చిరు వ్యాపారులు ఆదివారం మీదనే తమ ఆశలను నిలిపారు.వారంతా గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆదివారం వచ్చే బేరాలే తమకు కొంత ఊరటనిస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.పరకాల మార్కెట్,బస్టాండ్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల్లో కస్టమర్లు తగ్గిపోవడం వ్యాపారుల ఆందోళనను పెంచుతోందని చెప్పవచ్చు ఆదివారం సెలవు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పట్టణానికి రావడం, కుటుంబాలతో కొనుగోళ్లకు రావడం వల్ల కొంతమేర వ్యాపారం మెరుగుపడుతుందనే కాస్త ఆశ వ్యాపారుల్లో కనిపిస్తోంది.ఈ ఒక్క రోజైనా లాభం వస్తే వచ్చే వారం గడవడానికి తోడ్పడుతుందనే భావనతో వారు ఎదురు చూస్తున్నారు.పరిస్థితి మారి పాత రోజుల సందడి మళ్లీ తిరిగి రావాలని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఆదివారం వంటి సెలవు రోజులలో మాత్రమే కొంతమేర ఊరట లభిస్తోందని చిరు వ్యాపారులు అంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version