రూ.1000 కోట్ల నిధుల పనులకు సీఎం శంకుస్థాపనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T162511.209.wav?_=1

 

రూ.1000 కోట్ల నిధుల పనులకు సీఎం శంకుస్థాపనలు

ఈ నెల 5న నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి,సీపీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ఈ నెల 5న సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయుటకోసం వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్, భారీ బహిరంగ సభ స్థలాలను మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి పరిశీలించారు.కార్యక్రమంలో ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి,ఎస్బి ఏసీపీ జితేందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,డాక్టర్ పులి అనిల్,నర్సంపేట సొసైటి చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలీ,గంధం నరేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు రూపిక శ్రావణ్ కుమార్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పబ్బతి సతీష్ రెడ్డి, పోతారబోయిన చంద్రమౌళి, బాణాల శ్రీనివాస్, మేరుగు కిరణ్, గద్ద అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

మండలంలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T162109.715.wav?_=2

 

మండలంలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలో నేటి నుండి రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడతలో భాగంగా మండలంలోని గ్రామాలలో నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎంపీడీవో రామ రామ కృష్ణ తెలిపారు.మండలంలోని 14 గ్రామ పంచాయతీ సర్పంచ్, 138 వార్డు సభ్యులకు ఈనెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.6న నామినేషన్ల పరిశీలన,7వ తేదీన అప్పిల్ ,8న తిరస్కరణ,9వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మండలంలో 6 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించబడతాయని, కంఠాత్మకూర్ క్లస్టర్ పరిధిలో కంఠాత్మకూర్,ధర్మారం, రామకృష్ణాపూర్,కౌకొండ క్లస్టర్లో కౌకొండ,సర్వాపూర్ నడికూడ పరిధిలో నడికూడ, ముస్త్యాలపల్లి,చౌటుపర్తి, రాయపర్తి పరిధిలో రాయపర్తి,నర్సక్కపల్లి, పులిగిల్ల క్లస్టర్ లో పులిగిల్ల,వరికోల్,చర్లపల్లి క్లస్టర్ పరిధిలో చర్లపల్లి నార్లాపూర్ గ్రామాల నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.

గ్రామాభివృద్ధికై పాటుపడతా ఆశీర్వదించండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T161705.526.wav?_=3

 

గ్రామాభివృద్ధికై పాటుపడతా ఆశీర్వదించండి

◆- వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం(జహీరాబాద్),తమ గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని తనను అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఝరాసంగం మండలంలోని వనంపల్లి సర్పంచ్ అభ్యర్థి మాలి పటేల్ జగదీశ్వర్ పాటిల్ కోరారు.వనంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో పలు సమస్యలు నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.దళిత,వెనుకబడిన తరగతుల చెందిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని,వారి పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు మంజూరు చేయించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.ఎంతోమంది చదువుకుని గ్రామంలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని వారికి ఉపాధి పథకాలు మంజూరు చేయిస్తానన్నారు.చాలా మందికి పక్క గృహాలు లేకపోవడంతో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారని అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేయించడానికి కృషి చేస్తానన్నారు.అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు,రేషన్ కార్డులు మంజూరు చేయిస్తానన్నారు.రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రతి ఏటా నష్టపోతున్నారని కమర్షియల్ పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయించి మినీ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందన్నారు.
గ్రామంలో అవసరమైనచోట మురికి కాలువలు,సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీకి సొంతభవనం, ఎస్సీ,బీసీ కమ్యూనిటీ భవనాల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. వనంపల్లి నుండి సిద్దాపూర్,
మిర్జాపూర్ గ్రామాల వైపు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకై నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు.గ్రామం నుండి రామచందర్,టోప్యా నాయక్ తండాలు,సేరిగడ్డ పొలాల వైపు గల రోడ్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తానన్నారు.పంట పొలాలకు దారులు సక్రమంగా లేక రవాణా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటికి పక్కా రోడ్లు వేయిస్తానన్నారు.అందరికీ అందుబాటులో ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కోసం
అహర్నిశలు పాటు పడతానని అందరూ ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో సర్పంచుగా గెలిపించాలని అభ్యర్థి ఎంపీ జగదీశ్వర్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

ప్రశంసలు అందుకున్న బ్రాహ్మణపల్లి యూత్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T161004.738.wav?_=4

 

ప్రశంసలు అందుకున్న బ్రాహ్మణపల్లి యూత్

మంగపేట నేటిధాత్రి

 

బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఆర్ & బి రోడ్ కి ఇరువైపుల గుంతలు పడటం తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని గ్రామంలోని యువకులు తలా ఓ చేయి వేసి గుంతలు పూడ్చడం జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బ్రాహ్మణ పల్లి యూత్ అధ్యక్షులు బాడిశ ఆదినారాయణ గ్రామం లోని యూత్ కొమురం శ్రీ రామ్ మూర్తి మున్నా నిరంజన్ ఆనంద్ గంట నరేష్ థశరథం బొబ్బ సూర్య ప్రకాష్ కొమురం జగన్నాథం పాల్గొన్నారు

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T160559.882.wav?_=5

 

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డి ఎస్ ఓ పై ఆధారాలతో లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని రాచాల తెలిపారు. రైస్ మిల్లు కు సంబంధించి మిషన్లు మోటర్లు,ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే డి ఎస్ ఓ ధాన్యం కేటాయిస్తూ.ప్రభుత్వ.రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా కక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కొంత మంది అధికారుల చర్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.

సoగ్రామానికి వేళాయే..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T155614.418.wav?_=6

 

 

సoగ్రామానికి వేళాయే..

పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు షురూ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొద లైంది జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఇటీవల ఎన్నికల తేదీలు ప్రకటించడం వల్ల మండలం, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పార్టీ బలాబలాలు, వారి ఊహాలు రచించడంలో ముందున్నారు. మూడో విడుదల ఎన్నికల్లో భాగంగా మండలంలో 24 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల కోసం రేపు బుధవారం రోజున నామి నేషన్లు స్వీకరిస్తారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలు ఏర్పాటు చేశారు

లోకల్ ఫైట్ షూరూ

శాయంపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తంగా మారాయి అభ్యర్థులు ఓట ర్లను ఆకర్షించేoదుకు ముం దుకు రావడం ఎప్పుడు చర్చనీయంగా అంశంగా మారాయి. పార్టీ లందరూ ప్రజలందరిని ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల కేటాయింపు ప్రజల ఆధారంగా ఇవ్వాలని ప్రముఖ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి కాబట్టి లోకల్ ఫైట్ రసవత్తంగా సాగుతుంది ప్రజలు ఆలో చనలో పడ్డారు.

ఉద్యోగులు ప్రచారం జోలి కెళ్లొద్దు

గ్రామపంచాయతీ ఎన్నికల వేల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఐకెపి, ఆరోగ్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు పి ఆర్టీలు రిసోర్స్ పర్సనల్ పనిచేసే వారందరికీ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది వీరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన వీరి ఓటు హక్కును సాధారణ ఓటరుగా మాదిరిగా వినియోగించుకోవచ్చు. కానీ సాధారణ ప్రజానీకం మాదిరిగా ఏ పార్టీకి అనుకూలంగా ప్రచా రం చేయకూడదు. కానీ నచ్చి న పార్టీకి వ్యక్తి వెంట ప్రచారం లో సభలు సమావేశాలు విం దులు, వినోదాల్లో పాల్గొంటే వేటుపడుతుంది.

కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T155040.612.wav?_=7

 

కాంగ్రెస్ ప్రజా పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు కుటుంబాలు మంగళవారం రోజు టిఆర్ఎస్ పార్టీని వీడి ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమ పథకాల ప్రజలందరికీ దక్కుతున్నాయని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా పాలనలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి సొంత ఇంటి కలలు నెరవేర్చిందని అధికార పార్టీ అండగా నిలిచి మన గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని మహాసంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరబోతున్న కొత్తగూడా మండలం లోని ప్రతి ఒక్క పౌరునికి సాదర స్వాగతం తెలుపుతున్నామని
మనమందరం కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారు
గట్టి సారంగపాణి
బోడ శ్రీను
గట్టి పాపారావు..
తదితరులు
ఈ కార్యక్రమం లో
జిల్లా జనరల్ సెక్రెటరీ
బానోత్ రూప్ సింగ్,
జిల్లా నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు,
అధికార ప్రతినిధి ఇర్పరాజేశ్వర్
బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
కాయితోజు ఉపేంద్ర చారి,
కల్తీ నరేష్, వెలుదండి వేణు,ఇర్ప కొమ్మయ్య,,సిరిగిరి సురేష్,యాదగిరి కిరణ్, ఆటో వెంకట్, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,,,

తంగళ్లపల్లి నామినేషన్ల ముగింపు రోజు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T154208.558.wav?_=8

 

తంగళ్ళపల్లి మండలంలో ఈరోజు రెండో విడత నామినేషన్లు ఆఖరి రోజు కావడంతోఆశావాహులందరి నామినేషన్లు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు కావడంతో గ్రామాల్లోని గ్రామ ప్రజలు వార్డు ప్రజలు గ్రామాల్లోని గ్రామపంచాయతీలో నామినేషన్లు వేసినారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉన్నందున మండలంలో ప్రతి గ్రామ ప్రజలు నామినేషన్లు వేసిన ఆశావాహులు ఎవరు ఉంటారో ఎవరు బరిలో ఉండరోతెలియని పరిస్థితి ఉండడంతో ఎవరికి వారే గెలుస్తామని ధీమాలో ఉన్నారు. అలాగే మండలంలో ప్రతి నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోలీసులు పోలీసు సిబ్బంది ఎన్నికల రిటర్న్ అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఇట్టి నామినేషన్ పక్రిలో భాగంగా తమ విధులు నిర్వహిస్తు వచ్చేవారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే మండలంలో ఎలాంటి చెదురు మధుర సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామ గ్రామాన పోలీసుల పర్యవేక్షణలో రక్షణ బాధ్యతలు చేపడుతున్నారు అలాగే నామినేషన్ వేసే క్రమంలో ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరూ నామినేషన్ వేయడానికి వచ్చేవారు సంబంధిత అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ అన్ని అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించారు

ఊరంతా కలిసి..ఏకగ్రీవం చేశారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T153643.741.wav?_=9

 

ఊరంతా కలిసి..
ఏకగ్రీవం చేశారు.

నిజాంపేట: నేటి ధాత్రి

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు వేడెక్కాయి. పలు గ్రామాల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో గ్రామానికి చెందిన పాతూరి భాను ప్రసాద్ రెడ్డి ని గ్రామస్తులంత ఏకమై ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్న వయసులోని ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T152743.505.wav?_=10

 

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొత్త గట్టుసింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమి టీ ఎన్నుకున్నారు. ఈ సంద ర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ వారితో పాటు మండల అధ్య క్షుడు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, సదా శివ రెడ్డి, ఆలేటి రాకేష్, కొత్తగట్టు సాయి, పెంబర్తి వినయ్, అఖిల్, సునీల్ తదితరులు కలిశారు.

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T142916.012.wav?_=11

 

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడేల సమ్మయ్య మరియు కల్వచర్ల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం రోజున తెలంగాణ తొలి శాసనసభపతి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సార్ వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గ్రామపుర ప్రముఖులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T141157.951.wav?_=12

 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..!

◆- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి

◆:- ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం, ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుం టామని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన రాజకీయ దూషణలో జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకొని శాంతియుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు…

ర్యాలీకి చిన్న బ్రేక్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు

దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

టర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త నెమ్మదించాయి. సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చేలా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 2 తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,30,200గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి (Gold Rates on Dec
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,19,350. విజయవాడలో కూడా 24 క్యారెట్ పసిడి ధర రూ.1,30,200గా, 22 క్యారెట్ గోల్డ్ రేట్ 1,19,350గా ఉంది. చెన్నైలో వెండి ధర కిలోకు రూ.1,96,000 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా దాదాపు ఇదే ధర ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,88,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ స్పాట్ ధర ప్రస్తుతం 4,215 డాలర్లు. వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 57.22 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అమెరికా ఫెడ్ రేట్‌లో కోతపై స్పష్టత వచ్చే వరకూ గోల్డ్ రేట్స్‌ ఎగుడుదిగుడులు తప్పవనేది విశ్లేషకుల అంచనా.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

 

 

ఫొటో క్యాప్షన్,భారీ వర్షాల కారణంగా కొలంబోలోని కడువెల ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతం

గమనిక : ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి

శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఇప్పటి వరకు 193 మంది చనిపోయారని, 228 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.

వరదల వల్ల 26,114 కుటుంబాలకు చెందిన 9.68 లక్షల మంది ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిత్వా తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణంగా 250 కి.మీ. దూరం ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అది తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. ఆదివారం (నవంబర్ 30) సాయంత్రానికి తీరాన్ని సమీపిస్తుందని అంచనా

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను కారణంగా తమిళనాడుతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుపాను తూర్పు వైపుకు కదిలి ఇండోనేషియాలో భారీ నష్టాన్ని కలిగించింది.

ఈ వారం బంగాళాఖాతంలో మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్, శ్రీలంకకు దక్షిణంగా దిత్వా అనే రెండు తుపానులు దాదాపు ఒకేసారి వచ్చాయి.

“బంగాళాఖాతంలో ఇది చాలా అరుదైన సంఘటన” అని స్వతంత్ర వాతావరణ శాస్త్రవేత్త శ్రీకాంత్ అన్నారు.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను ప్రభావం తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్,శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్ 1న తుపాను వేగం గంటకు 45-55 కి.మీ.లకు (అప్పుడప్పుడు గంటకు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి) తగ్గుతుంది.

తుపానును దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

ఫొటో క్యాప్షన్,శ్రీలంకలోని కాండీ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీలంకలోని కాండీలోని సరసవిగమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని స్థానికులు బీబీసీతో చెప్పారు. కొండచరియలు విరిగిపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.

కొండ చరియలు విరిగి పడినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెప్పారు.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి మృతదేహాలను వెదికేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.

ఫొటో క్యాప్షన్,కొలంబో శివారు ప్రాంతం వెల్లంపిటియలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న స్థానికులు.

దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.

బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.

కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు, రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్‌ మ్యాచ్‌లో తుపాను బాధితుల కోసం శ్రీలంక క్రికెటర్లు ఒక నిముషం మౌనం పాటించారు.

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం

 

రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

చెన్నై: ‘దిత్వా’ తుఫాన్‌ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచే పెనుగాలులతో నగరం, శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. వేకువజామున కాసేపు విరామం తర్వాత ఉదయం 7 గంటల నుంచి వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
చేపాక్‌, ట్రిప్లికేన్‌ రాయపేట, మైలాపూరు, పట్టినంబాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, వాషర్‌మెన్‌పేట, టి.నగర్‌, కోడంబాక్కం, కీల్పాక్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతున వర్షపునీరు ప్రవహించింది. దీంతో వాహన చోదకులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాఫ్‌డే సెలవు ప్రకటించాయి. ఇక నగర శివారుప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్‌, సెంట్రల్‌ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్‌ తాంగళ్‌, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్‌ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్‌ జంక్షన్‌, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అండమాన్‌ విమానాల రద్దు…

నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్‌ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.

 

 ఒకింత కష్టంగానే క్యాట్‌..

 ఒకింత కష్టంగానే క్యాట్‌

 

ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్‌ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్‌లో….

ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్‌ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్‌లో ప్రశ్నల కాఠిన్య స్థాయిని క్రమంగా పెంచుతున్నారు. అదే సరళి ఈ ఏడాది క్యాట్‌లోనూ కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు సెషన్లుగా ఈ పరీక్ష జరిగింది. ఐఐఎంలు సహా ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి తొలి ప్రాతిపదికగా మాత్రమే క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) ర్యాంక్‌ను పరిగణిస్తారు. ఈ పరీక్షలో మూడు విభాగాలు – వరుసగా వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ), డేటా ఇంట్రప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌(డీఐఎల్‌ఆర్‌), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(క్యూఏ) ఉంటాయి. వీఏఆర్‌సీలో 24, మిగిలిన రెండింటి నుంచి 22 చొప్పున మొత్తం 68 ప్రశ్నలు ఈసారి అడిగారు.

డీఐఎల్‌ఆర్‌ విభాగంలో ట్రికీగా ప్రశ్నలు

ఈ ఏడాది క్యాట్‌లో పేరాగ్రాఫ్‌ జంబుల్‌ ప్రశ్నలు కూడా ఇచ్చారు. మల్టీపుల్‌ ఛాయి్‌స(ఎంసీక్యూ)తోపాటు జవాబును నేరుగా టైప్‌ చేయాల్సిన (టిటా) ప్రశ్నలకు ఈసారి సమ ప్రాధాన్యం లభించింది. డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నలు ట్రికీ(యుక్తి)గా ఉండటంతో అభ్యర్థులకు ఈ విభాగం కష్టంగా మారిందని కెరీర్‌లాంచర్‌ కోఫౌండర్‌ గౌతమ్‌పురి అభిప్రాయపడ్డారు. విధానంలో మార్పులు లేనప్పటికీ డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నల కారణంగానే అలా అనిపిస్తోందని టైమ్‌ సీనియర్‌ కోర్స్‌ డైరెక్టర్‌ రామ్‌నాథ్‌ కనకదండి తెలిపారు. మూడో సెషన్‌లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ కష్టంగా అనిపించిందని విద్యార్థులు తెలిపారు. మొదటి సెషన్‌లో అడిగిన ప్రశ్నల తీరు గత ఏడాదితో పోల్చుకుంటే కష్టంగానే ఉందని అంటున్నారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో మెజారిటీ ప్రశ్నలు అర్థమెటిక్‌, ఆల్జీబ్రా నుంచే అడిగారు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ కింద ఎలకా్ట్రనిక్‌ మ్యూజిక్‌, లా అండ్‌ మెంటల్‌ హెల్త్‌, నాయిస్‌ అండ్‌ సోషల్‌ ఆర్డర్‌, ఇన్‌కమ్‌ ఇనీక్వాలిటీ అండ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌పై పేరాగ్రాఫ్స్‌ ఇచ్చారు. రెండో సెషన్‌లో కాఠిన్య స్థాయి దాదాపు మొదటి సెషన్‌ స్థాయిలోనే ఉంది. 2022, 2023ల్లో మాదిరిగా కష్టంగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. డీఐఎల్‌ఆర్‌ విభాగం కష్టంగా ఉండగా, వీఏఆర్‌సీ, క్యూఏ మోడరేట్‌గా ఉన్నాయి. డీఐఎల్‌ఆర్‌లో మల్టీపుల్‌ ఛాయిస్‌, టిటా ప్రశ్నలు 11 చొప్పున అడిగారు. వీఏఆర్‌సీలో 10 నుంచి 12.. అంటే సగం వరకు ప్రశ్నలకు జవాబులు సులువుగానే గుర్తించవచ్చు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో ఆరేడు ప్రశ్నలకు జవాబులు కరెక్ట్‌గా గుర్తిస్తే 90 పర్సంటైల్‌, అదే 10-11 సరిగా గుర్తిస్తే 99 పర్సంటైల్‌ వస్తుందని అభ్యర్థులు చెబుతున్నారు. మూడో సెషన్‌ సైతం మొదటి రెండింటి మాదిరిగానే ఉందన్నది సమాచా రం. అయితే, మూడోది కష్టంగా ఉందని కొద్దిమంది విద్యార్థులుతెలిపారు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగం అందుకు కారణమని చెబుతున్నారు. ఈ సెషన్‌లో డీఐఎల్‌ఆర్‌ సులువుగా ఉంది. అర్థమెటిక్‌లో 8-9 ప్ర శ్నలు అడిగారు. రీడింగ్‌ కాంప్రహెన్సన్‌లో నాలుగింటికి రెండు కష్టంగా ఉన్నాయని కొందరు తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొమ్మటి ఇందిర రమేష్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T132520.447.wav?_=13

 

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దొమ్మటి ఇందిర రమేష్

పరకాల,నేటిధాత్రి

మండలం మల్లక్కపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొమ్మటి ఇందిర రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ తరపున మల్లక్కపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొమ్మటి ఇందిర రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.పరకాల మండల మాజీ వైస్ ఎంపీపీ,బీఆర్ఎస్ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి వాడి కారి మధుకర్,మాజీ సర్పంచులు భయ్య రాజేందర్,దుమాల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు బొజ్జం రవి,కార్యదర్శి దొమ్మటి మహేందర్,గ్రామస్తులు పాల్గొన్నారు.

గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్…

గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్

గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్‌మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

గరుడవేగ (Garudavega.com) కంపెనీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం సంస్థ సైక్లింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, వారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేలా ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ (Pedal to Progress) పేరిట 12 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీని నిర్వహించింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీ రామ్ దుర్వాసుల మాట్లాడుతూ Pedal to Progress కార్యక్రమం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. వారి ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ చైతన్యం తమ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఇంతకు ముందు కూడా ఓ వాకింగ్ ఈవెంట్‌ను నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని సూచించారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T130002.257.wav?_=14

 

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ, డా. కె.పట్టాభి రామారావు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

మంగళవారం నాడు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ,   డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రక్తదానం చేసిన న్యాయవాదులను మరియు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇరు బార్ అసోసియేషన్ లను మరియు రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు.

ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ల కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు..

సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు.. స్టాఫ్‌ మెంబర్‌ పుట్టిన రోజున సెలబ్రేషన్స్..

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు. కోట్లకు పడగలెత్తిన నీతా తన ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో చాటి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది 
నీతా అంబానీ తన టీమ్ మెంబర్ పుట్టిన రోజును దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేశారు. తన దగ్గర పని చేసే మహిళా ఉద్యోగి పుట్టిన రోజున నీతా అంబానీ దగ్గరుండి కేట్ కట్ చేయించారు. కేక్‌ తినిపించి మరీ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. టీమ్‌లోని మిగిలిన వారు ‘హ్యాపీ బర్త్‌డే’ పాట పాడుతుండగా, నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పక్కన నిలబడి ఉన్నారు. ఈ వీడియోను బర్త్ డే జరుపుకున్న ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు (viral Ambani video).
error: Content is protected !!
Exit mobile version