న్యాల్కల్ మండల నీటివనరుల గణన పూర్తిచేయాలని ఆదేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల పరిధిలోని అన్ని నీటివనరుల గణనను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని తహసీల్దార్ ప్రభులు అధికారులను ఆదేశించారు. న్యాల్కల్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, నీటివనరుల గణన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వానికి ఖచ్చితమైన వివరాలు అందజేయాలని ఆయన సూచించారు. గణనలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నివేదికలను సమయానికి పంపాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ, మండల గణాంక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
