· పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి
· కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలను పట్టించుకోని సర్వే

· సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలనుంచి 2.2 కోట్ల ఎకరాలకు వద్ధి
· కాళేశ్వరం ప్రాజెక్టుతో రెట్టింపయిన ధాన్యం దిగుబడులు
· నీటిఎద్దడితో కటకట పడిన రాష్ట్రం…అన్నపూర్ణగా వెలిగిన వైనం
· తాగునీటిని అందించే మిషన్ భగీరథకు ప్రశంసలు
· మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ
· రాష్ట్రంలో తలసరి ఎనఎస్‌డీపీ 212% వది
· జీఎస్‌డీపీ 224.38% వద్ధి నమోదు
· రైతుబంధు ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం
హైదరాబాద్, నేటిధాత్రి:
కాళేశ్వరం ప్రాజెక్టును “కూలేశ్వరం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శల దాడి చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జనవరి 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2025`26 ఆర్థిక సర్వే, 2014` 2023 మధ్యకాలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదవీకాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందంటూ ప్రశంసలు కురిపించడం రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం! విచిత్ర మేమంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను 2025, జులై 31న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథ కం నిర్మాణం, నిర్వహణ విషయంలో గత బీఆరఎస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ 665 పేజీల సుదీర్ఘ నివేదికను ఈ కమిషన్ రూపొందించింది. కాళేశ్వరం తప్పిదాలకు కర్త, కర్మ,క్రియ కేసీఆరేనని నివేదికలో కమిషన్ కుండబద్దలు కొట్టింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక పిల్లర్ కుంగిన నేపథ్యంలో సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయం లో కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ప్రచారం చేస్తూ వస్తోంది. గత స్థానిక ఎన్నికల్లో, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ ప్రభు త్వం కేసీఆర్ పై విమర్శల దాడిలో ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే ప్రస్తావిస్తుండటం గ మనార్హం.
విచిత్రమేమంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా కేసీఆర్‌పై ఆరోపణల దాడులు చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంసించడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌భగీరథ పథకం కారణంగా 2014లో రాష్ట్రంలో 1.31కోట్ల ఎకరాలుగా వున్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి 2.2కోట్ల ఎకరాలకు పెరిగిందని పేర్కొంది. ఇక ఆర్థికంగా రాష్ట్రం పనితీరు ఈ పదేళ్ల కాలంలో అద్భుతంగా వున్నదని స్పష్టం చేసింది. జీఎస్‌డీపీ 224.38% వద్ధి నమోదు చేయగా, తలసరి ఎనఎస్‌డీపీ 212% వద్ధి చెందడం నిజంగా రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి చిహ్నమని పేర్కొంది. ఇదే సమయంలో విద్యుత్ వినియోగం, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషమని వివరించింది. దేశ జనాభాలో మూడుశాతం జనాభా కలిగిన ఈ రాష్ట్రం జాతీయస్థాయి ఉద్యోగాల్లో 5% వాటాతో, 1.7లక్షల ప్రభుత్వ, 7లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన సాధించిందని పేర్కొంది. నీటిసరఫరా, నిధులు, ఉపాధి కల్పన రంగాల్లో ఈ దశాబ్దకాలంలో అ ద్భుతమైన పనితీరు ప్రదర్శించిందని స్పష్టం చేసింది.
ఐటీ, ఫార్మా, తయారీ, ఎంఎసఎంఈల రంగంలో కూడా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని వెల్లడించింది. మిషన్ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా 27,625 చెరువుల పునరుద్ధరణతో పాటు, మహిళాసాధికారత, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతి విషయంలో మంచి ఫలితాలు రాబట్టిందన్నది. మొత్తంమీద చెప్పాలంటే ఈ కాలం రాష్ట్ర చరిత్రలో ఒక “స్వర్ణయుగం”గా మిగిలిపోతుందని ముఖ్యంగా అభివద్ధి దిశగా అద్భుతమైన పరిణామ క్రమాన్ని నమోదు చేసిన కాలమిదని ప్రశంసించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ పథకం రాష్ట్ర రూపురేఖలనే మార్చి వేసాయని స్పష్టం చేసింది.
కేసీఆర్ పదవీకాలంలో ఎనిమిదేళ్ల పాటు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి రూ.6.7లక్షల కోట్లు రాష్ట్రం జతచేసిందంటూ ప్రశంసించింది. 2014కు ముందు ఇది కేవలం రూ.2.67లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేసింది. మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి టీ`ఐపాస్ విధానం సత్వర అనుమతులకు దోహదం చేసి అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఐటీ రంగంలో ఉద్యోగాలవకాశాలు మూడురెట్లు పెరగడమే ఇందుకు ఉదాహరణ అని స్పష్టం చేసింది. అంతేకాదు అభివద్ధిలో మహిళలను కలుపుకుపో యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన “డబ్ల్యుఈ`హబ”, మహిళా పారిశ్రామిక వేత్తలను అద్భుతమైన రీతిలో ప్రోత్సహించిందని పేర్కొంది. నిజానికి దేశంలోనే ఈ హబ్‌ను ప్రా రంభించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సష్టించింది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిపోయిందని ఆర్థిక సర్వే ప్రశంసించింది. 2014కు ముందు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 8.5% వుండగా బీఆరఎస్ అధికారంలో వున్న పదేళ్ల కాలంలో దీన్ని 2.6%కు కట్టడి చేయగలిగిందని ఉదహరించింది. నిజంగా ప్రభుత్వం అద్భుత పనితీ రుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే. ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరిగి సామాన్యులు ఇక్కట్ల పాలవడం తథ్యం. ఏ ప్రభుత్వమైతే ధరలను అదుపులో వుంచగలుగుతుందో అది ప్రజలకు మేలుచేసే ప్రభుత్వంగా భావించాలి.
2014‘23 మధ్యకాలంలో తమ పరిపాలనా కాలాన్ని బీఆరఎస్ నేతలు “బంగారు తెలంగాణ” గా చెబుతుంటారు. తమ ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మహిళాభివద్ధి, సాగు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దష్టిపెట్టి అభివద్ధి చేసిందని ఈ నాయకులు చెబుతున్న అంశాల్లోని సత్యాన్ని 2025‘26 ఆర్థిక సర్వే వెల్లడించింది. మిషన్ భగీరథ ప్రధానంగారా ష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సదుపాయ కల్పనకోసం ఉద్దేశించింది. నీటి ఎద్దడి ప్రాంతాలకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎంతో మేలుచేసింది. ముఖ్యంగా నీటి సదుపాయం అందుబాటులోకి రావడంతో, ఒకప్పుడు బీడు భూములుగా వున్న ప్రాంతాలు మంచి ఫల సాయాన్నిచ్చే సుక్షేత్రాలుగా మారిపోయాయి. ఈ సత్యాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా అంగీకరించాల్సిందే. ఇక ఫ్లెíఓవర్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, రోడ్డు సదుపాయాల కల్పన వంటి అభివద్ధి పనుల ద్వారా, హైదరాబాద్ ఇతర నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ బాగా పెరిగింది.
ఇక వ్యవసాయరంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన మరో గొప్ప విజయం, రైతులకు 24/7 విద్యుత్ సదుపాయాన్ని కల్పించడం. అంతేకాదు అంతకుముందు కరంటు కోతతో సతమతమ య్యే రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. దేశంలో దీన్ని సాధించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, “రైతుబంధు” పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం వంటివి బీఆరఎస్ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన పథకాలు. నిజం చెప్పాలంటే రై తుబంధు అమలును చూసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదేమాదిరి పథకాన్ని ప్రవేశపెట్టి, రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద కొంత మొత్తాన్ని జమచేయడం మొదలుపెట్టింది. రైతుబంధు స్ఫూర్తితో దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇటువంటి పథకాలనే అమలు చేస్తుండటం వర్తమాన చరిత్ర. వద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు “ఆసరా”పేరుతో పింఛను పథకాన్ని అమలు చేసింది. ఇక ఔత్సాహికులైన దళి తులు ఎవరైనా సొంతంగా ఔత్సా హిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకుంటే, నూటికి నూరు శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయంఅందించే “దళిత బంధు” పథకాన్ని బీఆరఎస్ ప్రభుత్వం ప్ర వేశపెట్టి అమలు చేసింది. ఇదిలా వుండగా, బీఆరఎస్ హయాంలో పెద్దఎత్తున గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం విశేషం.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మొత్తం 10 జిల్లాలుండేవి. జనాభా, విస్తీర్ణం దష్ట్యా పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను బీఆరఎస్ ప్రభుత్వంచేపట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సంస్కతికి వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కషి చేసింది. ఇందులో భాగంగా బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను అందరికీ తెలిసేవిధంగా కషిచేసింది. అంతేకాదు వినోదరంగం ముఖ్యంగా సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యానికి లేదా విలన్ పాత్రలకు మాత్రమే వుపయోగించేవారు. కేసీఆర్ పుణ్యమాని ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ యాసలో సినిమాల చిత్రీకరణ జరగడమే కాదు అవి బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుండ టం వర్తమాన విశేషం. మహిళల భద్రతకోసం “షీటీమ్స”ను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలుతీసుకోవడం విశేషం. సమర్థవంతంగా అమలు చేసిన సంక్షేమ, పాలనాపరమైన సంస్కరణలకు గుర్తింపుగా రాష్ట్రం అనేక “స్కాచ్ అవార్డులను” అందుకుంది.
తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు తెచ్చిన కేసీఆర్ ఇందుకు ఒక ఐకాన్‌గా నిలిచారు. తెలంగాణ సాధించిన నాయకుడిగా, రాష్ట్ర చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పాలనలో లోపా లుండవచ్చు, అమలులో పొరపాట్లు జరిగుండవచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఇవి త ప్పవు. రాష్ట్రం సాధించిన అభివద్ధే ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా నిలుస్తుంది. దీన్ని 2025`26 కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక స్పష్టంగా వివరించింది. ప్రత్యర్థుల విమర్శలు సహజం. వారు లోపాలను ఎత్తిచూపుతుంటారు. అది చేయకపోతే వారికి మనుగడ వుండదు. చేయని పనులకు విపరీత ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో, చేసిన పనిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ల డం కూడా అధికారంలో వున్నవారికి అత్యంత అవసరం. ఇది ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడకుండా కాపాడుతుంది!