అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల,నేటిధాత్రి
మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు,అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేయాలని తెలిపారు.ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని,గత ప్రభుత్వ పాలకుల వలనే పరకాల పట్టణం వెనుకబడిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.పట్టణంలో సిసి రోడ్,డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు మరిన్ని వసతులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 వంట గ్యాస్,నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ చీరలు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎస్పీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి
మున్సిపాలిటీ ధర్మసమాజ్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం ఝాన్సీ సుమన్ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని,మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గడ్డం సుమన్,గడ్డం శివకుమార్, గడ్డం విశ్వనాథం, మధుసూదన్,గజవెల్లి రాజు, గడ్డం సతీష్,గడ్డం వెంకటయ్య,గడ్డం ఆంజనేయస్వామి,గడ్డం రాజమ్మ,దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
